Ravindra Jadeja's dope samples tested most among Indian cricketers: భారత క్రికెటర్లలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి అత్యధికంగా మూడుసార్లు శాంపిళ్లను సేకరించినట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(NADA) తెలిపింది. ఈ ఏడాది జనవరి- మే మధ్య అతడికి మూడుసార్లు టెస్టులు శాంపిల్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. 2023లో ఇప్పటి వరకు పురుష, మహిళా క్రికెటర్లతో కలిపి మొత్తంగా 55 మంది నుంచి 58 శాంపిళ్లు సేకరించినట్లు నాడా తెలిపింది
రోహిత్, కోహ్లిల సంగతేంటి?
ఇందులో సగం వరకు మ్యాచ్‌లు లేని సమయంలోనే తీసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పరీక్షలు నిర్వహించకపోవడం విశేషం.
హార్దిక్ నుంచి..
ఇక రోహిత్ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా సారథ్య బాధ్యతలు తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా యూరిన్ శాంపిల్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో సేకరించారు. ఈ ఏడాదిలో నాడా అత్యధికసార్లు శాంపిల్స్ సేకరించిన జాబితాలో జడేజా ముందు వరుసలో ఉండగా.. 2021,2022లో రోహిత్‌ను అత్యధికంగా మూడుసార్లు టెస్ట్ చేశారు.
కోహ్లి అంటే అంతేమరి!
అయితే, కోహ్లి నుంచి మాత్రం గత రెండేళ్లలో ఒక్కసారి కూడా శాంపిల్స్ తీసుకోకపోవడం గమనార్హం. ఇక మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు మాత్రమే డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 12న వారి నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు.
జడ్డూకే అత్యధికసార్లు
కాగా మొత్తంగా సేకరించిన 58 శాంపిల్స్‌లో ఏడు మాత్రమే బ్లడ్ శాంపిల్స్ ఉండగా.. మిగతావన్నీ యూరిన్ శాంపిల్స్ అని నాడా తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19, మార్చి 26, ఏప్రిల్ 26న జడేజాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
అదే విధంగా.. టీమిండియా పేసర్ నటరాజన్ నుంచి ఏప్రిల్ 27న యూరిన్, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు నాడా వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. కాగా జడ్డూ ప్రస్తుతం అమెరికాలో విహరిస్తుండగా.. రోహిత్, కోహ్లి సెలవుల్లో ఉన్నారు.
చదవండి: పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Comments
Please login to add a commentAdd a comment