
మాంట్రియల్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తమ అనుబంధ సంస్థలకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నూతన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అథ్లెట్ల నుంచి నమూనాలు సేకరించే క్రమంలో కరోనా కారణంగా అధికారులతో పాటు, ఆటగాళ్లకు ఎలాంటి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారుల నిబంధనల మేరకు నడుచుకోవాలని డోపింగ్ నిరోధక సంస్థలకు సూచించింది. ‘డోపింగ్ నియంత్రణ కోసం మనం పరీక్షలు నిర్వహించే సమయంలో అథ్లెట్లకు, అధికారుల ఆరోగ్యానికి తగిన రక్షణ కల్పించాలి. ఎలాంటి అనారోగ్యం లేని వారినే అథ్లెట్ల నుంచి శాంపుల్స్ సేకరించేందుకు ఉపయోగించాలి. ఈ క్రమంలో అథ్లెట్లను కూడా వారి ఆరోగ్యం గురించి ఆరా తీశాకే నమూనాలు సేకరించాలి’ అని ‘వాడా’ పేర్కొంది. పని చేసే ప్రాంతాలను శుభ్రం గా ఉంచుకోవాలని సూచించింది. తప్పనిసరిగా మాస్క్‌లను వాడాలని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment