Carefully
-
నమూనాల సేకరణలో జాగ్రత్త వహించండి
మాంట్రియల్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తమ అనుబంధ సంస్థలకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నూతన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అథ్లెట్ల నుంచి నమూనాలు సేకరించే క్రమంలో కరోనా కారణంగా అధికారులతో పాటు, ఆటగాళ్లకు ఎలాంటి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారుల నిబంధనల మేరకు నడుచుకోవాలని డోపింగ్ నిరోధక సంస్థలకు సూచించింది. ‘డోపింగ్ నియంత్రణ కోసం మనం పరీక్షలు నిర్వహించే సమయంలో అథ్లెట్లకు, అధికారుల ఆరోగ్యానికి తగిన రక్షణ కల్పించాలి. ఎలాంటి అనారోగ్యం లేని వారినే అథ్లెట్ల నుంచి శాంపుల్స్ సేకరించేందుకు ఉపయోగించాలి. ఈ క్రమంలో అథ్లెట్లను కూడా వారి ఆరోగ్యం గురించి ఆరా తీశాకే నమూనాలు సేకరించాలి’ అని ‘వాడా’ పేర్కొంది. పని చేసే ప్రాంతాలను శుభ్రం గా ఉంచుకోవాలని సూచించింది. తప్పనిసరిగా మాస్క్‌లను వాడాలని హెచ్చరించింది. -
వేసవిలో జర భద్రం
పెద్దఅడిశర్లపల్లి : వేసవిలో వడ దెబ్బకు గురికా కుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీఏపల్లి పీహెచ్సి వైద్యాధికారి హిమబిందు కోరారు. మంగళవారం ఆమె స్థానికంగా మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల తాకిడితో డిహైడ్రేషన్‌తో శరీరంలో నీరు తగ్గడమే వడదెబ్బగా భావించాలని అన్నారు. ఎండలో అధిక వేడిలో తిరగడంతో ఇది ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజూ 5 లేదా 6 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కవ ప్రాధాన్యం ఇస్తూ, శరీరంతో పాటు ఇంటిని చల్లగా ఉంచుకోవాలి. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి పలు సూచనలు చేశారు. తీవ్ర ఎండ, ఉష్ణోగ్రత సమయాల్లో ఎక్కువగా బయట తిరగకూడదు. రోడ్లపై విక్రయించే రంగు పానియాలు, కలుషిత ఆహారం తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత్త సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో శరీరమంతా తూడ్చి ఫ్యాన్, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తాగించి వీలైనంత త్వరగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించాలి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలి. అత్యవసరం ఉంటే త్వరగా పనులు ముగించుకోవాలి. బయట లేత రంగు, తేలికైన, కాటన్ దుస్తువులు, టోపి, గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్, మజ్జిగ, గ్లూకోజ్ లాంటి ద్రావణాలు దెగ్గర ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలి. -
నీరు పట్టాలంటే పాట్లు పడాల్సిందే
జాగ్రత్తగా వెళ్లకపోతే మురికి గుంతలో పడిపోవాల్సిందే కుళాయి చుట్టూ మురికి నీరు, పేరుకుపోయిన బురద మద్నూర్: నీటి కోసం జాగ్రత్తగా వెళ్లకపోతే మురికి గుంతలో పడిపోవాల్సిందే. చిన్న నుంచి పెద్ద వారు నీరు తెచ్చుకోవాలంటే నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలోని పంచాయతీ కుళాయి వద్ద చూట్టు మురికి నీరు, బురద పెరుకుపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాలనీలో నివాసం ఉంటున్న ఎవరికీ కుళాయి కనెక్షన్ లేదు. ప్రతి ఒక్కరూ ఈ కుళాయి ద్వారానే నీటిని తీసుకెళ్లాల్సిందే. ఇదే విషయం అధికారులకు తెలిపిన ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కుళాయి పక్కనే నీరు లీకవుతోందని కాలనీ వాసులు తెలిపారు. కుళాయికు వచ్చే పైప్‌లైన్‌కు లీకేజీ ఉందని అందుకోసం నీరు నిండి బురద తయారవుతోందని వారు తెలిపారు. ప్రజలు కలుషితమైన నీరు తాగి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నందున అధికారులు సకాలంలో స్పందించాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికలు కోరుతున్నారు. -
ఓరుగల్లు కీర్తితోరణం
ఓరుగల్లు ఘనమైన వారసత్వ సంపదకు ఇంతకాలం గుర్తుగా ఉన్న కాకతీయుల శిలాతోరణం ఇకపై ప్రభుత్వ అధికారిక చిహ్నంగా మారనుంది. కాకతీయులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కీర్తితోరణం. వరంగల్, తెలంగాణ, తెలుగు ప్రజలను సింబాలిక్‌గా చూపించేందుకు కాకతీయుల కీర్తి తోరణాన్ని మించిన చిహ్నం మరొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారచిహ్నంపై టీఆర్ఎస్ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఎట్టకేలకు కాకతీయుల కీర్తితోరణం, చార్మినార్, నాలుగు సింహాల కలయికతో రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండేలా లోగోను డిజైన్ చేసింది. సాక్షి, హన్మకొండ : హస్తకళలకు పెట్టింది పేరైన జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ఐలాచారి కాకతీయుల కీర్తితోరణానికి ప్రచారం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 1973లో వరంగల్ ఇండస్ట్రియల్ ఏరి యాలో కొత్తగా ఆపే ట్రాక్టర్ షోరూంను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకుడు ఆహూతులకు ఇచ్చేందుకు ఏదైనా జ్ఞాపికను తయారుచేయమని పెంబర్తి కళాకారుడు ఐలాచారిని కోరగా... కాకతీయ కీర్తితోరణం మధ్యలో ఆపే ట్రాక్టర్ ఉండేలా ఓ జ్ఞాపికను తయారు చేశారు. షోరూం ఫంక్షన్లో ఆ జ్ఞాపిక హైలెట్‌గా నిలిచింది. అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ జ్ఞాపికపై ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ప్రపంచ కీర్తికి నాంది 1974లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించి లోగోను రూపొందించాల్సిందిగా కళాకారులను కోరింది. దీంతో గతంలో పేరు తెచ్చిన కాకతీయ కీర్తితోరణం ప్రధానంగా డిజైన్ రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు ఈ డిజైన్ చూసి ముగ్ధుడై ఆ సభలో బహూకరించేందుకు 200 జ్ఞాపికలు కావాలంటూ అక్కడికక్కడే ఆర్డరు ఇచ్చారు. ఒక్కో జ్ఞాపిక తయారీకి రూ.180 కోట్ చేస్తూ ఐలాచారి టెండర్ వేశారు. ఈ కళాఖండానికి రూ.180 అంటే తక్కువ అని... రూ.200గా కోట్ చేయమని వెంగళరావు ప్రత్యేకంగా సూచించారు. అంతేకాదు... అదనంగా మరో 300 జ్ఞాపికలు తయారు చేయాలని పురమాయించారు. అలా మొదటిసారిగా కాకతీయుల కీర్తి తోరణం ప్రపంచ వేదికలపై సగర్వంగా దర్శనం ఇచ్చింది. అన్నింటా తానే... ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసిన మూడు నెలలకు స్వయంగా ముఖ్యమంత్రి వెంగళరావు పెంబర్తిని దర్శించారు. ఈ నేపథ్యంలో కీర్తితోరణం డిజైన్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. అప్పటినుంచి వందల ఫంక్షన్లలో వేలాదిగా జ్ఞాపికలు పంచారు. ఆ తర్వాత నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులకు మెడల్స్ తయారు చేసే పని పెంబర్తి కళాకారులకు అప్పగించారు. గోల్కొండ, చార్మినార్లతో కూడిన వివిధ డిజైన్లు ఆయనకు నచ్చలేదు. చివరకు కాకతీయ కీర్తితోరణంతో డిజైన్ తయారు చేయగా... వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఆ డిజైన్‌తోనే పోలీసులకు మెడళ్లు ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ యూనివర్సిటీ, కలెక్టరేట్, జిల్లా సరిహద్దులు ఇలా అంతటా కీర్తితోరణాలు నిర్మించారు. ఇలా అన్ని ప్రముఖ స్థలాల ముందు టీవిగా నిలబడి అందరికీ స్వాగతం పలికిన కీర్తి తోరణం ఇకపై తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలో భాగం కానుంది.