నీరు పట్టాలంటే పాట్లు పడాల్సిందే
-
జాగ్రత్తగా వెళ్లకపోతే మురికి గుంతలో పడిపోవాల్సిందే
-
కుళాయి చుట్టూ మురికి నీరు, పేరుకుపోయిన బురద
మద్నూర్: నీటి కోసం జాగ్రత్తగా వెళ్లకపోతే మురికి గుంతలో పడిపోవాల్సిందే. చిన్న నుంచి పెద్ద వారు నీరు తెచ్చుకోవాలంటే నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలోని పంచాయతీ కుళాయి వద్ద చూట్టు మురికి నీరు, బురద పెరుకుపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాలనీలో నివాసం ఉంటున్న ఎవరికీ కుళాయి కనెక్షన్ లేదు. ప్రతి ఒక్కరూ ఈ కుళాయి ద్వారానే నీటిని తీసుకెళ్లాల్సిందే. ఇదే విషయం అధికారులకు తెలిపిన ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కుళాయి పక్కనే నీరు లీకవుతోందని కాలనీ వాసులు తెలిపారు. కుళాయికు వచ్చే పైప్‌లైన్‌కు లీకేజీ ఉందని అందుకోసం నీరు నిండి బురద తయారవుతోందని వారు తెలిపారు. ప్రజలు కలుషితమైన నీరు తాగి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నందున అధికారులు సకాలంలో స్పందించాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికలు కోరుతున్నారు.