Shakti
-
'అంబాజీ ఆలయం': గర్భాలయంలో విగ్రహమే లేని శక్తిపీఠం!
దసరా సందడి కోలహాలం మొదలు కానుంది. ప్రతి చోట సంబరాల హడావిడి మొదలయ్యింది. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మని భక్తి కొద్ది కొలుచుకుని ఆమె అనుగ్రహంతో సంతోషం ఉండాలని కోరుకుంటారు. అలాంటి పర్వదినాన ఈ పుణ్యభూమిలో అలరారే విశేష శక్తి పీఠాలు స్మరించుకోవడం, సందర్శించడం వంటివి చేస్తుంటాం. వాటిలో మనకు తెలియని విచిత్రమైన శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్‌లోని అంబాజీ ఆలయం. అయితే ఈ ఆలయంలో విగ్రహమే భక్తులకు కనిపించదు. కానీ పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు చేస్తారట. ఏంటా ఆలయ విశిష్టత? ఎలా చేరుకోవాలి? తదితర విశేషాలు తెలుసుకుందామా..!గుజరాత్-రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది ఈ అంబాజీ ఆలయం. మౌంట్ అబు నుంచి రెండు గంటల ప్రయాణం. ఈ ఆలయం అరసుర్ కొండలలో నెలకొంది. ఈ ప్రదేశం అంతా ఆ జగదంబికకే సొంతం. ఇక్కడ వెలిసిన అమ్మవారిని 'అరసురి అంబ' అని, అంబాజీ అని పిలుచుకుంటారు భక్తులు. శక్తి స్వరూపిణిగా భావించే దుర్గమ్మ అంశయే ఈ అంబాదేవి అని భక్తుల నమ్మకం. శివుని విశ్వతాండవం లేదా విధ్వంస నృత్యం సమయంలో సతీదేవి శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. పురాణ ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతారు. దీన్ని సతిదేవి హృదయం పడిన ప్రదేశమని పురాణ వచనం. మరొక కథనం ప్రకారం..ఈ ప్రాంతంలోనే రెండు దేవాలయాలు ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంటో గబ్బర్ కొండపై మరొక ఆలయం ఉందట. దీన్ని దేవత నిజ ఆలయంగా చెబుతుంటారు ప్రజలు. అయితే కొండ ఎక్కి అమ్మవారిని దర్శించడం కష్టంగా ఉండటంతో దంతా రాజ్యపు రాజు దేవతను తన రాజ్యానికి వచ్చి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడు. అందుకు అంగీకరించిన దేవతా రాజుకి ఒక షరతు పెడుతుంది. "రాజా నిన్ను అనుసరిస్తూ వస్తుంటాను కానీ వెనదిరగ కూడదు. మాటతప్పితే అక్కడ భూస్థాపితం లేదా అక్కడ వెలవడం జరుగుతుంది." అని రాజుతో చెబుతుంది దేవతా. అందుకు ఒప్పుకున్న రాజు సంతోషంతో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లుతుంటాడు. అయితే కొంత దూరం వెళ్లాక ఆమె పాదాల శబ్దం వినిపంచడం లేదనిపించి గిర్రున వెనుదిరుగుతాడు. అంతే అమ్మ అక్కడే భూమిలోకి పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే నేడు భక్తులచే పూజలందుకుంటున్న మహిమాన్వితమైన అంబాజీ దేవాలయం. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు బదులుగా దేవత చిహ్నమైన 'శ్రీ వీసా యంత్రం' ఉంటుంది. అది కూడా ముసుగుతో కప్పబడి ఉంటుంది. ఈ యంత్రాన్ని చూసేందుకు కూడా భక్తులకు అనుమతి లేదు. కానీ ఆలయ పూజారులు విగ్రహాన్ని పోలి ఉండే విధంగా గర్భాలయాన్ని అలంకరిస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతుంది. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అంబాజీ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే హారతి(అంటే యంత్రాన్ని పూజించే ముందు వారి కళ్లకు తెల్లటి గుడ్డ కట్టుకోవాలి) అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. ఆ కార్యక్రమంలోనే "గర్భా" అనే జానపద నృత్యాన్ని భక్తిపూర్వకంగా చేస్తారు. ఏడాదిపొడువునా ఈ ఆలయం భక్తుల కోలాహాలంతో సందడిగా ఉంటుంది. ఇక భాద్రపద పౌర్ణమి రోజు నిర్వహించే "భదర్వి పూనం" ఉత్సవమే ఈ శక్తిపీఠంలో జరిగే అతిపెద్ద వేడుక. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఇక్కడే ఐదు జైన దేవాలయాల సముహమైన కుంభారియా అనే జైన దేవాలయాన్ని కూడా చూడవచ్చు. అద్భుతంగా చెక్కబడిన పాలరాతి స్తంభాలకు ఇది ప్రసిద్ధి చెందింది.ఎలా చేరుకోవాలంటే..అహ్మదాబాద్ విమానాశ్రయానికి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.అబురోడ్ రైల్వే స్టేషన్‌కి 21 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.(చదవండి: దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..! ..!) -
వాళ్లే అంతర్ధానమౌతారు
సేలం(తమిళనాడు)/పాలక్కడ్(కేరళ): పక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శల జడి కొనసాగుతోంది. ‘శక్తి’ని అంతం చేయాలని బయల్దేరిన వాళ్లే నాశనమవుతారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా దక్షిణభారత రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మోదీ మంగళవారం సైతం తమిళనాడు, కేరళలో పర్యటించి ప్రచారసభల్లో పాల్గొన్నారు. సేలంలో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణానికి రెండు పార్శా్వలు. అవినీతి, వారసత్వ రాజకీయాలతో అంటకాగాయి. ఇతర మతాలపై పల్లెత్తు మాట అయినా మాట్లాడటానికి జంకే కూటమి పార్టీలు హిందూ మతాన్ని దూషించటానికి ఒక్క క్షణం కూడా ముందూ వెనకా ఆలోచించవు. ఎన్నికల ప్రచారం ముంబైలో మొదలెట్టిన మొదటిరోజే వారి వైఖరి బట్టబయలైంది. ‘శక్తి’ని నాశనం చేస్తామని ముంబైలో శివాజీపార్క్ సభావేదికగా ప్రకటించారు. హిందూత్వంలో శక్తికి ఉన్న ప్రాధాన్యత, విశిష్టత తమిళనాడులో ప్రతి ఒక్కరికీ తెలుసు. కంచి కామాక్షి అమ్మవారు, ‘శక్తిపీఠం’ మదుర మీనాక్షి అమ్మవారు, సమయపురం మారియమ్మన్... ఇలా అంతా శక్తి స్వరూపిణిలే. శక్తి అంటే మాతృ శక్తి, నారీ శక్తి’ అంటూ సభకు వచ్చిన మహిళలనుద్దేశిస్తూ మోదీ అన్నారు. ‘ఈ శక్తినే విపక్షాలు అంతం చేస్తాయట. కూటమి నేతలు పదేపదే హిందువుల విశ్వాసాలను కించపరుస్తున్నారు. శక్తిని అంతం చేయాలని చూసిన వాళ్లు నాశనమైన వృత్తాంతాలు మన ఇతిహాసాల్లో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనను ఏప్రిల్ 19న తమిళనాడు ప్రజలు పునరావృతం చేస్తారు’ అని అన్నారు. తమిళనాడులో అదే తేదీన 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉన్న సంగతి తెల్సిందే. ‘‘ జాతీయ కవి సుబ్రమణ్య భారతి చెప్పినట్లుగానే నేనూ భరతమాతను శక్తి స్వరూపిణిగానే ఆరాధిస్తా. దేశ నారీశక్తిని ఆరాధిస్తా. నేను శక్తి ఉపాసకుడిని. శక్తిని అంతం చేస్తామన్న వాళ్లను తమిళనాడు ఓటర్లు శిక్షిస్తారు. కోట్లాది తమిళులు ఇస్తున్న గ్యారెంటీ ఇది’’ అని మోదీ అన్నారు. పాలక్కడ్‌లో భారీ రోడ్‌షో కేరళలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ మంగళవారం కేరళలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చిన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పాలక్కడ్‌లో రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: ‘శక్తి’ అంతమే విపక్షాల లక్ష్యం
శివమొగ్గ/కోయంబత్తూర్: ‘శక్తి’ని అంతంచేయడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘శక్తిని అంతం చేస్తామని ముంబై శివాజీ గ్రౌండ్ సభలో విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది. శక్తిని నాశనం చేయడమే వారి లక్ష్యమైతే శక్తి ఉపాసనే మా సంకల్పం. శివాజీ పార్కులో ప్రతి పిల్లాడూ జై భవానీ, జై శివానీ మంత్రం వింటూ, పఠిస్తూ పెరుగుతాడు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ తుల్జా భవానీ మాత ఆశీస్సులతోనే దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు. శక్తిని ఆరాధించారు. ఆయన పేరిట ఉన్న శివాజీ పార్కులోనే శక్తిని అంతమొందిస్తామని విపక్షాలు ప్రతినబూనాయి. ఈ మాట వింటే శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడు ఉద్ధవ్ అదే సభా వేదికపై ఉన్నారు. ప్రతి భారతీయ మహిళా శక్తికి ప్రతిరూపమే. నారీ శక్తికే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. చంద్రయాన్–3 దిగిన చోటుకు శివశక్తిగా నామకరణం చేశాం’’ అని మోదీ గుర్తుచేశారు. ‘‘నారీ శక్తే నాకు నిశ్శబ్ద ఓటరని కొందరు రాజకీయ విశ్లేషకులంటున్నారు. కానీ నా దృష్టిలో నారీ శక్తి అంటే అమ్మవారి శక్తి స్వరూపం’’ అన్నారు. ‘‘అమ్మవారి శక్తి స్వరూపమంటే భరతమాతకు మరో పేరు. కన్నడ కవి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత కువెంపు సైతం కర్ణాటక మాత అంటే శక్తి స్వరూపిణి అన్నారు. ఇండియా కూటమి నేతలు మాత్రం ఏకంగా శక్తినే నాశనం చేస్తామంటున్నారు. ఇది మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లపై, మహిళా సంక్షేమ పథకాలపై దాడి. ధర్మాగ్రహ శక్తే ఉగ్రవాదాన్ని, అరాచకాలను అంతమొందిస్తుంది. ఆ శక్తినే విపక్షాలు సవాలు చేస్తున్నాయి. శక్తి సత్తా ఏంటో, శక్తికి ఎదురెళ్తే ఏమైతుందో ప్రతి మహిళ, కుమార్తె, సోదరీ కాంగ్రెస్‌కు తెలిసేలా చేయాలి’’ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది సీఎంలున్నారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘‘వెయిటింగ్ సీఎం, కాబోయే సీఎం, సూపర్ సీఎం, షాడో సీఎం. అధిష్టానానికి నిధులు పంపించే కలెక్షన్ మంత్రి విడిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి కూడా పైసల్లేకుండా నిధులన్నీ నొక్కేశారు’’ అంటూ దుయ్యబట్టారు. కోయంబత్తూర్‌లో మోదీ 2.5 కి.మీ. పొడవున రోడ్ షో చేశారు. -
శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని హర్షం
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకీర్ హుస్సేన్(తబలా),శంకర్ మహదేవన్ (సింగర్)లు ఉన్న శక్తి బ్యాండ్‌కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Congratulations @ZakirHtabla, @Rakeshflute, @Shankar_Live, @kanjeeraselva, and @violinganesh on your phenomenal success at the #GRAMMYs! Your exceptional talent and dedication to music have won hearts worldwide. India is proud! These achievements are a testament to the hardwork… — Narendra Modi (@narendramodi) February 5, 2024 దిస్ మూమెంట్ పాటను జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్(సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతకు ముందు.. శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
ఉత్తర కరోలినాలో శక్తి అవార్డ్స్ 2023
-
హిట్ అయినదే పెద్ద సినిమా
‘‘రుద్రం కోట’ చిత్రం ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇప్పుడు ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతోంది. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించి, కొత్తవారిని ప్రొత్సహించాలి’’ అన్నారు నటుడు శ్రీకాంత్. రుద్ర హీరోగా, శక్తి, విభీష హీరోయిన్లుగా రాము కోన దర్శకత్వం వహించిన చిత్రం ‘రుద్రం కోట’. నటి జయలలిత కీలక పాత్రలో నటించి, సమర్పించారు. అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్, నటి రాశీ విడుదల చేశారు. రాశీ మాట్లాడుతూ– ‘‘రుద్రం కోట’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు జయలలిత. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు అనిల్ ఆర్కా. -
అక్కడేమో బ్లాక్ బస్టర్స్.. ఇక్కడ చూస్తే డిజాస్టర్స్!
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భోళాశంకర్ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ అనుకన్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్న మెహర్ రమేశ్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేశ్ అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేన్ని? అందులో హిట్ అయిన సినిమాలు ఏవీ? ఫ్లాప్స్ అయినా చిత్రాలేవీ? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) మెహర్ రమేశ్ పేరు చెప్పగానే అందరికీ 'శక్తి', బిల్లా, 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ తొలిసారి నటుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన. మొదట 2002లో నటుడిగా మహేశ్‌బాబు 'బాబీ' మూవీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేశ్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం మెహర్ రమేశ్‌కు వచ్చింది. అలా ఆ చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో కన్నడలో తెరకెక్కించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో అదే ఉత్సాహంతో తెలుగులోనూ అగ్ర హీరోలతో మెహర్ రమేశ్ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్‌తో కంత్రి దీంతో మెహర్ రమేశ్ మరో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో 2008లో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హన్సిక , తనీషా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌తో బిల్లా అయితే ఆ తర్వాత మెహర్ రమేశ్.. యంగ్ రెబల్ స్టార్‌తో హిట్ కొట్టాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బిల్లా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. 2009లో రిలీజైన ఈ చిత్రం అనుష్క, హన్సిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నమిత, జయసుధ తదితరులు నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టిన మెహర్ రమేశ్.. శక్తి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. 2011 ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. (ఇది చదవండి: మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ) వెంకటేశ్‌తో షాడో శక్తి ఫ్లాప్ తర్వాత మెహర్ రమేశ్.. విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టాడు. అయితే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. 2013లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. చిరంజీవితో భోళాశంకర్ అయితే మొదట పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు. ఆయన అగ్ర హీరోలతో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌తో తెరెకెక్కించిన భోళాశంకర్ సైతం ఫ్లాప్‌గా నిలవడంతో సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురయ్యాడు మెహర్ రమేశ్. -
ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్నాడో సినీ కవి. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏ సినిమా అయినా హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రతి సినిమా హిట్టవ్వదు. ప్రేక్షకులకు నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. అలా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడి నిర్మాతలకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన శక్తి సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి స్పందించాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. 'ఆ రోజుల్లో పంపిణీ అంతా నిర్మాతలే చూసుకునేవారు. అందువల్ల నష్టం వస్తే నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇళ్లు, పొలాలు, భూములు అమ్ముకున్న ఎంతోమందిని కళ్లారా చూశాను. అందుకే నేను ఎప్పుడూ కొంత జాగ్రత్త పడేవాడిని. ఏదైనా సినిమా తీసి దెబ్బతిన్నప్పుడు చిరంజీవి పిలిచి కథ రెడీ చేసుకోండి, మనం సినిమా చేద్దాం అనేవారు. నాగార్జున కూడా అంతే, వేరే సినిమాలు ఆపేసి మరీ నాకోసం సినిమాలు చేసేవారు. ఆరోజుల్లో అలా ఉండేది. నాకు బాగా అసంతృప్తిని ఇచ్చిన సినిమా శక్తి. ఈ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నాలుగైదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నిజానికి ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోదామనుకున్నాను. ఇక్కడ బాగా సక్సెస్ అయిన చూడాలని ఉంది సినిమాను నేను, అరవింద్ కలిసి హిందీలో తీశాం. రూ.12 కోట్ల నష్టం వచ్చింది. అంటే చెరి ఆరు కోట్ల నష్టం. అప్పటికి ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ వెంటనే కోలుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వినీదత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్) సినిమా నిర్మిస్తున్నాడు. చదవండి: ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో వెధవ పనులు చేశా: డైరెక్టర్ నేను చనిపోలేదు, అలా అని రిటైర్మెంటూ తీసుకోలేదు: నటుడు -
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
విద్యా వ్యవస్థను ప్రశ్నించే ‘శక్తి’
టీవీలో వీడియో జాకీ(వీజే)గా కెరీర్ స్టార్ట్ చేసి, అతి తక్కువ సమయంలో క్రేజీ స్టార్‌గా ఎదిగిన తమిళ హీరో శివ కార్తికేయన్. తమిళనాట సూపర్ ఫాలోయింగ్ ఉన్న అతను 'రెమో', 'సీమ రాజా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడిగా మారాడు. ఆయన తాజాగా నటించిన సినిమా 'హీరో'. తమిళనాడులో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని నిర్మాత కోటపాడి జె.రాజేష్ 'శక్తి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైనెమెంట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. 'అభిమన్యుడు' దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ 'శక్తి'కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయిక. విద్యావ్యవస్థ మీద సినిమా అంటే ఆ చిత్రమే గుర్తొస్తుంది నిర్మాత కోటపాడి జె.రాజేష్ మాట్లాడుతూ "సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రజల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో తీశాం. తమిళనాడులో విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ సినారియో గురించి చర్చించిన సినిమా 'శక్తి'. ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సినిమా అంటే 'జెంటిల్మెన్' గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థను సరిచేయడానికి 'జెంటిల్మెన్' వస్తే 'శక్తి'లా ఉంటాడు. 'అభిమన్యుడు'లో బ్యాంక్ మోసాల గురించి చర్చించారు. ఈ సినిమాలో విద్యావ్యవస్థ గురించి చర్చించారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ భిన్నమైన పాత్ర చేశారు. అతనీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు అర్జున్ ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్.. ఆయన సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ దక్షిణాది సినిమాకు కొత్త అయినప్పటికీ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రివ్యూల్లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకని, ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి తెలంగాణలో థియేటర్లు రీ ఓపెన్ అవుతాయని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా, సంతానం హీరోగా మరో సినిమా చేస్తున్నాం. మా నిర్మాణ సంస్థలో మరో రెండు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి కథ వస్తే తెలుగులోనూ సినిమా చేయాలని చూస్తున్నాం" అన్నారు. ఈ చిత్రానికి రచన: పి.యస్.మిత్రన్, పార్తిబన్, సవారి ముత్తు, ఆంటోనీ భాగ్యరాజ్, సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, మాటలు: రాజేష్ ఎ మూర్తి, పాటలు : రాజశ్రీ సుధాకర్. -
సామాజిక బాధ్యతతో శక్తి
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్‌మేన్’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్‌మేన్’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్‌గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
విద్యా వ్యవస్థపై పోరాటం
శివ కార్తికేయన్ హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ‘శక్తి’ పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోంది. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి. జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ మాన్, స్పైడర్ మాన్, శక్తి మాన్.. అంటే పిల్లలకే కాదు అన్ని వయసుల వారిలో ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్ల స్ఫూర్తితో సాహసాలు చేస్తుంటారు కొంతమంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాంటివాడే. సూపర్ హీరోలా మారి విద్యా వ్యవస్థలోని విషయాలపై ఎలా పోరాడాడు? అన్నదే కథాశం. వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఏదైనా విభిన్న నేపథ్యం లేకపోతే శివ కార్తికేయన్ సినిమా చేయరు. ‘శక్తి’ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తూ హార్ట్‌ని టచ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే’’ అన్నారు కోటపాడి. జె. రాజేష్. -
సూపర్ హీరో శక్తి
తమిళ నటుడు శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘హీరో’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోటపాడి రాజేష్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్‌గా నటించారు. ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ‘‘శక్తిమాన్ సీరియల్ చూస్తూ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు హీరో. మరి సూపర్‌హీరో అయ్యాడా? సమాజంలో అతను తెచ్చిన మార్పు ఏంటి? అనే కథతో తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా స్వరకర్త. -
శక్తి టీం వాహనాలను ప్రరంభించిన ఐజీ మీనా
-
హలో శక్తీ.. సేవ్ మీ ప్లీజ్
‘శివమణి’ సినిమాలో ఆపదలో ఉన్న ఆడపిల్ల ఒక ఫోన్ కొడితే చాలు, పోలీస్ ఆఫీసర్ నాగార్జున వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ అమ్మాయిని వేధిస్తున్న పోకిరీల పని పడతాడు! అంతకన్నా పెద్ద ఉమెన్ ప్రొటెక్షన్.. ‘శక్తి’! ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెయిల్, ఒక్క వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ‘శక్తి’ వెళ్లి ఎంతటివాడినైనా సెట్‌రైట్ చేస్తుంది. ‘సబల’గా మొదట గుంటూరు జిల్లాలో మొదలైన ఈ మహిళా రక్షణ వ్యవస్థ.. ‘శక్తి’గా ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించి ఆపద్బాంధవిగా సేవలు అందిస్తోంది. భర్త విదేశాల్లో ఉండటంతో కుమార్తెతో కలిసి ఉంటున్న ఓ మహిళను.. భార్య, ఇద్దరు పిల్లల ఉన్న ఓ కారు డ్రైవర్ ట్రాప్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ న్యూడ్ ఫొటోలు, వీడియోలు దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత ఆమె కుమార్తెను సైతం మాయ మాటలతో లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ కుమార్తె న్యూడ్ ఫొటోలు, వీడియోలను తీసి, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ ఆ మహిళను బ్లాక్మెయిల్ చెయ్యడం మొదలుపెట్లాడు. దీంతో ఆమె చివరి ప్రయత్నంగా ‘శక్తి’ బృందాన్ని ఆశ్రయించింది. శక్తి బృందం ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న అశ్లీల ఫొటోలు, వీడియోలని తొలగించి ఆమెకు రక్షణగా నిలిచింది.సొంత బాబాయే పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బయటకు చెప్పుకోలేక గర్భం వస్తుందనే భయాన్ని దాచుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్న ఓ యువతి ‘సబల’ బృందాన్ని ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని రోదించింది. విషయం బయటకు పొక్కితే కుటుంబం పరువు పోతుందని వేడుకుంది. ఆమె వివరాలు గోప్యంగా ఉంచిన సబల బృందం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఆమెకు ఆ టార్చర్ నుంచి విముక్తి కల్పించారు.ఫేస్బుక్లో పరిచయమైన యువతి, యువకుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకునేందుకు ఒకరినొకరు కలుసుకున్నారు. ఫేస్బుక్లో యువకుడి చాటింగ్లకు ఆకర్షితురాలైన యువతి నేరుగా అతన్ని చూసి అందంగా లేకపోవడంతో ప్రేమ వద్దని, స్నేహంగా మెలుగుదామంటూ సూచించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు యువతికి సంబంధించిన వివరాలతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్‌ను తెరిచి యువతి, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు అందులో ఉంచి ఆమె కావాలంటే గంటకు రూ. 5వేలు చెల్లిస్తే చాలంటూ అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టాడు. మెడిసిన్ చదువుతున్న ఆ యువతి పోలీసుస్టేషన్‌కు వెళితే పరువు పోతుందనే భయంతో ‘సబల’ను ఆశ్రయించింది. వారు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల తోటి ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు సబలను ఆశ్రయించగా, ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అతడు మహిళా ఉద్యోగికి క్షమాపణ చెప్పడంతోపాటు, వేరేచోటకు బదిలీ చేయించుకుని వెళ్లి పోవడంతో సమస్య పరిష్కారం అయింది.ఇలా దారుణమైన సంఘటనలు ఎన్నో çశక్తి (సబల) బృందాల దృష్టికి రావడం, వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడంతోపాటు, ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ‘సబల’కు ఆదరణ పెరిగిపోయింది. ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధురాళ్ల వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆకృత్యాలలో కేవలం 20 శాతం మాత్రమే పోలీసు స్టేషన్ల వరకు వెళుతున్నాయి. మిగతా వారంతా పరువు పోతుందనో... కేసులకు భయపడో .. తమలో తాము కృంగిపోతూ తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పుకోలేక లోలోనే మధనపడుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచడం కోసం సమాజంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టే దిశగా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సి.హెచ్.వెంకటప్పలనాయుడు గత ఏడాది జూన్ 29వ తేదీన ‘సబల’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ‘సబల’ పేరుతో 126 మంది మహిళ కానిస్టేబుళ్లతో 62 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, బాలికల హాస్టళ్లు, కళాశాలలు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రతి ఇనిస్టిట్యూట్‌కు ఈ సబల బృందాలు వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నాయి. ‘సబల’ బృందాలు ఇలా విజయవంతం అవడంతో అనంతరం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలని నిర్ణయించిన పోలీసు ఉన్నతాధికారులు ‘శక్తి’ పేరుతో ఇప్పుడీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో తిరిగే సబల బృందాలకు సైకిల్‌తోపాటు.. వారి రక్షణకు పెప్పర్ స్ప్రే, లాఠీలను అందించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయం పక్కనే ప్రత్యేకంగా సబల కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా సేవలందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలతోపాటు, సమాజంలో జరుగుతున్న వివిధరకాలైన వేధింపుల నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై డాక్యుమెంటరీ ద్వారా వీడియోలు చిత్రీకరించి వారిలో అవగాహనను పెంచే కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. సబల ప్రారంభమైన ఎనిమిది నెలల వ్యవధిలో 400లకు పైగా ఫిర్యాదులను సేకరించి వాటన్నింటిని పరిష్కరించగలిగారు. 27 మంది మైనర్ బాలికల వివాహాలను అడ్డుకుని వారి భవిష్యత్తును కాపాడగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు రూరల్ జిల్లా శక్తి బృందానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గత ఏడాది నవంబరు 24న ఢిల్లీలో జరిగిన ఉమెన్ సేఫ్టీ ఇనిషియేటివ్ అనే ఓ కార్యక్రమంలో గుంటూరు రూరల్ జిల్లా తెనాలి డీఎస్పీ పి.స్నేహిత ‘శక్తి’ పనితీరు గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో ఫిబ్రవరి 25న ఢిల్లీలో ‘స్కోచ్ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అవార్డును (స్మార్ట్ గవర్నెన్స్‌కి ఇస్తారు. గుంటూరు రూరల్ జిల్లా శక్తి బృందం తరుపున నోడల్ ఆఫీసర్ స్నేహిత అవార్డును అందుకున్నారు. - ఎన్.మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు మహిళలకు భరోసా నేటి సమాజంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది తమపై జరుగుతున్న అకృత్యాలను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు మా దృష్టికి రావడంతో శక్తి బృందాలను ఏర్పాటు చేశాం. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ సమాజంలో నిశ్చింతగా తిరిగేలా చేయడమే ‘శక్తి’ ముఖ్య లక్ష్యం. ఎస్.వి.రాజశేఖర్‌బాబు, రూరల్ ఎస్పీ తొమ్మిది మందిని కాపాడాం శక్తి బృందాల పనితీరు మహిళలకు వరంగా మారింది. ఆవేదనను బయటకు చెప్పుకోలేక తొమ్మిది మంది యువతులు ఆత్మహత్యకు పాల్పడే సమయంలో సబలకు ఫోన్ చేసి చెప్పడం, మా బృందం వెంటనే స్పందించి వారి ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని రక్షించడం జరిగింది. ఎలాంటి సమస్య అయినా సరే సబల ద్వారా పరిష్కారం పొందేందుకు మహిళలు, విద్యార్థులు ముందుకు రావాలి. అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. స్నేహిత, శక్తి నోడల్ ఆఫీసర్, తెనాలి డీఎస్పీ నిర్భయంగా ఫిర్యాదు సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులను సబలతో పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఫిర్యాదు చేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. వారికి ఇష్టం లేకుండా కేసులు నమోదు చేయం. అయినప్పటికీ సబలను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. సబలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇతర జిల్లాల ఫిర్యాదులను ఆయా పరిధిలోని ఎస్హెచ్ఓలకు తెలియజేసి సమస్యను పరిష్కరించేలా చూస్తున్నాం. – సుభాషిణి, సి.ఐ., శక్తి నోడల్ ఆఫీసర్ అండగా ఫేస్బుక్, వాట్సాప్ చిన్న పిల్లలు, మహిళలు నేరుగా సబలకు ఫిర్యాదులు చేసే అవకాశంతోపాటు, డయల్ 100కు ఫిర్యాదు చేసినా లేదా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫేస్బుక్లో అయితే https://www. facebook.com/sabalaguntur rural.9కు, వాట్సాప్ ద్వారా అయితే 9440900866కు,ఈమెయిల్ ద్వారా అయితే sabalagrr@gmail. comకు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి వెంటనే వారితో మాట్లాడి పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. -
బాలీవుడ్ నటుడికి అరుదైన గౌరవం
తెలుగులో శక్తి, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్‌కు అరుదైన గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జమ్వాల్ తన స్టంట్లతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ పోరాట కళ కలరియపట్టులో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యుత్ జమ్వాల్ ప్రపంచంలోని టాప్ సిక్స్ మార్షల్ ఆర్ట్స్ కళాకరుల జాబితాలో స్థానం సంపాదించాడు. అమెరికాకు చెందిన లూపర్ అనే వెబ్ సైట్ ఈ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ లో విద్యుత్ జమ్వాల్‌తో పాటు స్కాట్ అడ్కిన్స్, అతీఫ్ క్రౌడర్, ఇల్రామ్ చోయి, మార్కో జిరోర్, యు జింగ్, జానీ ట్రిగ్యుయెన్ లు ఉన్నారు. ‘గొప్ప మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు అంటే తెలుసుకోవాల్సింది ప్రత్యర్థిపై దాడి చేయటం కాదు, ఓపికగా ప్రత్యర్థిని దెబ్బతీయటం తెలుసుకోవాల’న్నారు విద్యుత్ జమ్వాల్. ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చిన ఈ యువ కళాకారుడు బాలీవుడ్ చిత్రాల్లో హీరోగానూ రాణిస్తున్నాడు. -
కాంగ్రెస్‌కు‘శక్తి’
సాక్షి, రంగారెడ్డి : పార్టీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రస్తుతం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నసామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని మరింత ప్రజల దరికి చేర్చాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో సంస్థాగత కార్యక్రమాలేగాకుం డా సమకాలీన రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని ఏఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ‘శక్తి’ యాప్‌పై పార్టీ నేతలకు జాతీయ కోఆర్డినేటర్ యశ్వంత్ శుక్లా, పార్టీ ప్రతినిధులు స్వప్న, ఆశోక్ వర్గీస్ గాంధీభవన్‌లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, పార్టీ నేతలు నందికంటి శ్రీధర్, రవికుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘శక్తి’ యాప్‌లో కార్యకర్తలు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల కార్యకర్తలంతా ఓటర్ ఐడీ నంబర్‌ను 7996179961కు ఎస్ఎంఎస్ చేసి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రాహుల్ ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలంతా జూన్ 15 లోపు రిజిస్టర్ చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీ గా కార్యకర్తలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్న పార్టీ.. తాజాగా కార్యకర్తలను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తోంది. దీనికి ‘శక్తి’పేరుతో ప్రత్యేకంగా యాప్ రూపొందించి అన్ని స్థాయిల్లోని కార్యకర్తల వివరాలను నమోదు చేస్తోంది. యాప్ ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారం సులువుగా కార్యకర్తలకు చేరవేయొచ్చని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో యాప్ ద్వారా కార్యకర్తల నమోదు మొదలవగా తెలంగాణలోనూ వెంటనే ప్రారంభించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. -
నేను శక్తి
శక్తి! ఏ ఇంట్లో కనపడుతుంది? ఏ వీధిలో నడుస్తుంది? ఏ ఆఫీసును నడిపిస్తుంది? ఏ వ్యవహారాలు చక్కబెట్టగలుగుతుంది? ఏ కొరివికుండ మోస్తుంది? ఏ ఆస్తి కాగితం మీద సంతకం పెడుతుంది? ఎప్పడు మంచంలో వద్దనగలుగుతుంది? ఎక్కడ తన కంచంలో ఓ ముద్ద వేసుకోగలుగుతుంది? అబ్బ... అంతెందుకు? అసలు ఎన్ని పిండాలలో ఊపిరిపోసుకుంటుంది? సంప్రదాయపు కట్టుబాట్లలో ఇంకెన్నాళ్లు కట్టుబడి ఉంటుంది? దేవత అనీ, పూజనీయురాలనీ, త్యాగమూర్తనీ... ఇంకెన్నాళ్లు మనిషిగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది? ఇంట్లో కొరికినా, వీధిలో కాటేసినా ఇంకెన్నాళ్లు మూగబోయిన విగ్రహంలా ఉండిపోతుంది? భూమి అంత చైతన్యం రావాలి. ఆకాశమంత అవగాహన కావాలి. నీకు జన్మనిచ్చినదానిని... నువ్వు నాకేమిస్తావు? ఆకాశంలో సగమిస్తావా? భూమ్మీద పూర్తిగా దగా చేస్తావా? వద్దు... నువ్వు నాకు ఇవ్వద్దు. శక్తి ఒకరు ఇస్తే రాదనీ... ఒకరు దోచుకుంటే పోదనీ... వెక్కిరిస్తే దాక్కోదనీ... శక్తి నేనని... తెలుసుకుంటా. తెలియజేస్తా. నేను శక్తి అందమైన రేపటికి నేను శక్తి... దానికి మీరే సాక్షి. నేను నా గళమెత్తుతాను. అరవగలనని చెప్పడానికి కాదు. గొంతులేని వారి తరఫున వినిపించడం కోసం. – మలాలా యుసాఫ్జాయ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత -
కొందరు నిప్పు అవుతారు
వరలక్ష్మి.. తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. వరలక్ష్షీ్మ శరత్‌కుమార్ అంటే ఆ... ఎక్కడో విన్నట్టుందే! అనక మానరు. తమిళ హీరో, తెలుగువారికి సుపరిచితులైన సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. 2012లో ‘పోడాపోడి’ చిత్రంతో కథానాయిక అయిన వరలక్ష్మి తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు కానీ తెలుగులో చేయలేదు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శక్తి’ సినిమా ద్వారా ఆమె తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. సమాజంలో నేటి మహిళలు ఎదుర్కొంటున్న సంఘటనల నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్‌గా మూడు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు వెర్షన్ ‘శక్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో రానా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ‘‘సమ్ ఫియర్ ఫైర్ సమ్ సింప్లీ బికమ్ ఇట్’’ (నిప్పంటే కొందరికి భయం.. కొందరు నిప్పు అవుతారు) అని పోస్టర్ మీద ఉంది. దీన్ని బట్టి సినిమాలో వరలక్ష్మి నిప్పు అంత పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని ఊహించవచ్చు. ఈ శక్తివంతమైన పాత్ర కోసం వరలక్ష్మి ఫిజిక్వైజ్గా చాలా మేకోవర్ అయ్యారు. -
బిగ్‌బాస్: మేం హౌజ్‌లో ఉండలేం బాబోయ్!
తమను పంపించాలని వేడుకుంటున్న కంటెస్టెంట్స్ తమిళ బిగ్‌బాస్ షోలో ఆసక్తికరమైన పరిణామాలు తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో కన్నా ముందే ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ షో విజయవంతంగా ఏడువారాలు పూర్తి చేసుకుంది. మొదట డల్‌గా ప్రారంభమైన ఈ షో పలు సంఘాల హెచ్చరికలు, వివాదాలు, ఒవియా ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్‌తో ఊపందుకుంది. ఇప్పుడు తమిళనాట అత్యధిక మంది వీక్షిస్తున్న టీవీ షో ఇదే. దీని టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, గతవారం ఒవియా అనూహ్యరీతిలో హౌజ్ నుంచి తప్పుకోవడం, జూలీని ఎలిమినేట్ చేయడంతో షోలో ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. ఈ వారం ప్రముఖ దర్శకుడు పీ వాసు తనయుడు, నటుడు శక్తి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఆరవ్, బిందు మాధవి, గణేశ్ వెంకట్రామన్ మధ్య గట్టి పోటీ నెలకొన్నా.. అనూహ్య రీతిలో శక్తి షో నుంచి ఔట్ అయ్యాడు. పాపులారిటీ తెచ్చుకోవాలన్న తన లక్ష్యం ఈ షోతో నెరవేరిందని ఈ సందర్భంగా శక్తి పేర్కొన్నాడు. ఇక, డెంజర్ జోన్లో ఉన్న గాయత్రీ రఘురాం అనూహ్యంగా ఎలిమినేషన్ తప్పించుకోగా.. తమిళ బిగ్‌బాస్ షోలోని పలువురు కంటెస్టెంట్స్ మాత్రం తమను హౌజ్ నుంచి పంపించాలని వేడుకుంటున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంతమాత్రం ఉండలేమని చెప్తున్నారు. ముఖ్యంగా నటుడు, గీత రచయిత స్నేహన్ తనకు ఓటు వేయొద్దని అభిమానులను అభ్యర్థించాడు. తాను హౌజ్‌లో ఎంతమాత్రం ఉండలేనని, దయచేసి తనకు ఎవరూ ఓటు వేయొద్దని కోరాడు. తాను మరికొంత కాలం హౌజ్‌లో ఉంటే మరో వ్యక్తిలా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అయినా అతన్ని ఎమిలినేట్ చేయలేదు. ఇక షోలోని ప్రముఖ కమెడియన్ వైయాపురి కూడా తనను హౌజ్ నుంచి పంపించమని వేడుకుంటున్నాడు. 'నటుడ్ని అయ్యేందుకు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడు అవే కష్టాలు మళ్లీ ఎందుకు పడాలో అర్థం కావడం లేదు. హౌజ్‌లో స్థానం కోసం పోరాడాల్సిన ఖర్మ నాకు లేదు. దయచేసి నన్ను ఇంటికి పంపించండి. ఈ క్రూరమైన ఆట నేను ఆడలేకపోతున్నా' అంటూ వైయాపురి తన భార్యకు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఒవియా తప్పుకోవడంతో బిగ్‌బాస్ షోలో ఆసక్తి తగ్గిపోవడంతో ఆమెను మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా షోలోకి తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు.