సూపర్‌ హీరో శక్తి | Hero Sivakarthikeyan comes in Telugu as Shakti | Sakshi
Sakshi News home page

సూపర్‌ హీరో శక్తి

Published Sat, Feb 15 2020 5:08 AM | Last Updated on Sat, Feb 15 2020 5:08 AM

Hero Sivakarthikeyan comes in Telugu as Shakti - Sakshi

శివ కార్తికేయన్

తమిళ నటుడు శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్‌ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘హీరో’. ‘అభిమన్యుడు’ ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కోటపాడి రాజేష్‌ నిర్మించారు. బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ విలన్‌గా నటించారు. ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ‘‘శక్తిమాన్‌ సీరియల్‌ చూస్తూ సూపర్‌ హీరో కావాలని కలలు కంటాడు హీరో. మరి సూపర్‌హీరో అయ్యాడా? సమాజంలో అతను తెచ్చిన మార్పు ఏంటి? అనే కథతో తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement