తమిళనాట మంచి మాస్ హీరోగా ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ కథానాయకుడిగా ‘ఇరుంబుదురై (అభిమన్యుడు)’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘హీరో’. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది డిసెంబర్ 20న తమిళంలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే అభిమన్యుడు చిత్రంతో డైరెక్టర్ మిత్రన్, కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హీరో చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శక్తి పేరిట విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ తొలి సారి దక్షిణాదిచిత్రంలో కనిపించాడు. ఇక అభిమన్యుడు చిత్రంతో పీఎస్ మిత్రన్ తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ మొదలు పెట్టిన చిత్ర బృందం ఈ సినిమాను నెలాఖరులో విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రానికి జార్జి.సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక అఖిల్ అక్కినేని హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంతో అఖిల్, హీరో(శక్తి) చిత్రంతో మిత్రన్ బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది.
అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి
Published Wed, Feb 12 2020 4:13 PM | Last Updated on Wed, Feb 12 2020 4:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment