హీరోకి విలన్‌ దొరికాడు | abhay deol villain role in hero movie | Sakshi
Sakshi News home page

హీరోకి విలన్‌ దొరికాడు

Published Mon, Jul 22 2019 4:11 AM | Last Updated on Mon, Jul 22 2019 4:11 AM

abhay deol villain role in hero movie - Sakshi

‘2.ఓ’ సినిమాలో అక్షయ్‌కుమార్, ‘పేట’లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌. ‘అభిమన్యుడు’ ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా తమిళంలో ‘హీరో’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు అభయ్‌ డియోల్‌. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తు్తన్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement