కొందరు నిప్పు అవుతారు | Rana Daggubati unveils the first look of Varalaxmi Sarathkumar is shakti movie | Sakshi
Sakshi News home page

కొందరు నిప్పు అవుతారు

Published Mon, Oct 9 2017 1:16 AM | Last Updated on Mon, Oct 9 2017 1:16 AM

Rana Daggubati unveils the first look of Varalaxmi Sarathkumar is shakti movie

వరలక్ష్మి.. తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. వరలక్ష్షీ్మ శరత్‌కుమార్‌ అంటే  ఆ... ఎక్కడో విన్నట్టుందే! అనక మానరు. తమిళ హీరో, తెలుగువారికి సుపరిచితులైన సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. 2012లో ‘పోడాపోడి’ చిత్రంతో కథానాయిక అయిన వరలక్ష్మి తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు కానీ తెలుగులో చేయలేదు.

ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శక్తి’ సినిమా ద్వారా ఆమె తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. సమాజంలో నేటి మహిళలు ఎదుర్కొంటున్న సంఘటనల నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్‌గా మూడు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు వెర్షన్‌ ‘శక్తి’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని హీరో రానా ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. ‘‘సమ్‌ ఫియర్‌ ఫైర్‌ సమ్‌ సింప్లీ బికమ్‌ ఇట్‌’’ (నిప్పంటే కొందరికి భయం.. కొందరు నిప్పు అవుతారు) అని పోస్టర్‌ మీద ఉంది. దీన్ని బట్టి సినిమాలో వరలక్ష్మి నిప్పు అంత పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారని ఊహించవచ్చు. ఈ శక్తివంతమైన పాత్ర కోసం వరలక్ష్మి ఫిజిక్‌వైజ్‌గా చాలా మేకోవర్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement