టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భోళాశంకర్ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ అనుకన్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్న మెహర్ రమేశ్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేశ్ అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేన్ని? అందులో హిట్ అయిన సినిమాలు ఏవీ? ఫ్లాప్స్ అయినా చిత్రాలేవీ? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి.
(ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?)
మెహర్ రమేశ్ పేరు చెప్పగానే అందరికీ 'శక్తి', బిల్లా, 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ తొలిసారి నటుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన. మొదట 2002లో నటుడిగా మహేశ్‌బాబు 'బాబీ' మూవీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేశ్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
అనంతరం 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం మెహర్ రమేశ్‌కు వచ్చింది. అలా ఆ చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో కన్నడలో తెరకెక్కించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో అదే ఉత్సాహంతో తెలుగులోనూ అగ్ర హీరోలతో మెహర్ రమేశ్ చిత్రాలను తెరకెక్కించారు.
ఎన్టీఆర్‌తో కంత్రి
దీంతో మెహర్ రమేశ్ మరో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో 2008లో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హన్సిక , తనీషా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రభాస్‌తో బిల్లా
అయితే ఆ తర్వాత మెహర్ రమేశ్.. యంగ్ రెబల్ స్టార్‌తో హిట్ కొట్టాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బిల్లా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. 2009లో రిలీజైన ఈ చిత్రం అనుష్క, హన్సిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నమిత, జయసుధ తదితరులు నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు.
జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి
అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టిన మెహర్ రమేశ్.. శక్తి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. 2011 ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
(ఇది చదవండి: మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ)
వెంకటేశ్‌తో షాడో
శక్తి ఫ్లాప్ తర్వాత మెహర్ రమేశ్.. విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టాడు. అయితే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. 2013లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు.
చిరంజీవితో భోళాశంకర్
అయితే మొదట పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు. ఆయన అగ్ర హీరోలతో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌తో తెరెకెక్కించిన భోళాశంకర్ సైతం ఫ్లాప్‌గా నిలవడంతో సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురయ్యాడు మెహర్ రమేశ్.
Comments
Please login to add a commentAdd a comment