Billa
-
ఆ డైరెక్టర్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన 'నయనతార'
ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా అది జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంటూ ప్రేక్షకులకు దగ్గర చేస్తారు. అన్నింటికి మించి సినిమా విడుదలకు ముందు అందులో నటించిన నటీనటులతో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వారందరూ కూడా హాజరవడం జరుగుతుంది. కానీ లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. చివరకు తను నటించిన చిత్రాల కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనదు. ఒక ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టే సమయంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలకు రానని ముందే స్పష్టంగా చెప్పి రూల్ పెట్టేస్తుంది.చిరంజీవి,షారూఖ్‌ఖాన్ వంటి స్టార్స్‌తో నటించిన నయనతార వారితో పాటు ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ తాజాగా ఒక డైరెక్టర్ కోసం తన రూల్‌ను బ్రేక్ చేసింది నయనతార. కానీ తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన 'పంజా' సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ కోసం ఆమె ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా విష్ణువర్ధన్ 'నేసిప్పయ' అనే సినిమా తీశారు. అందులో అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెప్పవచ్చు. విష్ణువర్ధన్ తమిళ్లో బిల్లా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ చిత్రంలో నయనతారను ఎంపిక చేయడం వల్ల ఆమె కెరియర్ మారిపోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత నయనతారకు భారీగా డిమాండ్ పెరిగింది. వరుసుగా సినిమా ఆఫర్లు క్యూ కట్టేశాయ్. అలా ఇప్పుడు అభిమానులు లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే రేంజ్‌కు నయనతార చేరుకుంది. ఆ అభిమానంతోనే నయనతార తన రూల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నయన్ చెప్పుకొచ్చింది. -
అక్కడేమో బ్లాక్ బస్టర్స్.. ఇక్కడ చూస్తే డిజాస్టర్స్!
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భోళాశంకర్ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ అనుకన్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్న మెహర్ రమేశ్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేశ్ అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేన్ని? అందులో హిట్ అయిన సినిమాలు ఏవీ? ఫ్లాప్స్ అయినా చిత్రాలేవీ? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) మెహర్ రమేశ్ పేరు చెప్పగానే అందరికీ 'శక్తి', బిల్లా, 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ తొలిసారి నటుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన. మొదట 2002లో నటుడిగా మహేశ్‌బాబు 'బాబీ' మూవీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేశ్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం మెహర్ రమేశ్‌కు వచ్చింది. అలా ఆ చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో కన్నడలో తెరకెక్కించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో అదే ఉత్సాహంతో తెలుగులోనూ అగ్ర హీరోలతో మెహర్ రమేశ్ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్‌తో కంత్రి దీంతో మెహర్ రమేశ్ మరో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో 2008లో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హన్సిక , తనీషా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌తో బిల్లా అయితే ఆ తర్వాత మెహర్ రమేశ్.. యంగ్ రెబల్ స్టార్‌తో హిట్ కొట్టాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బిల్లా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. 2009లో రిలీజైన ఈ చిత్రం అనుష్క, హన్సిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నమిత, జయసుధ తదితరులు నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టిన మెహర్ రమేశ్.. శక్తి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. 2011 ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. (ఇది చదవండి: మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ) వెంకటేశ్‌తో షాడో శక్తి ఫ్లాప్ తర్వాత మెహర్ రమేశ్.. విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టాడు. అయితే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. 2013లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. చిరంజీవితో భోళాశంకర్ అయితే మొదట పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు. ఆయన అగ్ర హీరోలతో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌తో తెరెకెక్కించిన భోళాశంకర్ సైతం ఫ్లాప్‌గా నిలవడంతో సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురయ్యాడు మెహర్ రమేశ్. -
హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం అంతఇంతా కాదు. రీసెంట్ ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ, డైరెక్టర్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిల పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్లో నిలవడంతో జక్కన్న కొద్ది రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మీడియాతో ముచ్చటించిన ఆయన గతంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా హృతిక్‌ను కించపరస్తూ చేసిన కామెంట్స్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..? దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ‘‘ఇది జరిగి చాలా కాలం అవుతుంది. దాదాపు 15-16 ఏళ్లు గడిచింది. అప్పుడు నేను చేసిన కామెంట్స్ ఇప్పుడేందుకు బయటకు వచ్చాయో తెలియదు. అది బిల్లా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో అన్నాను. ఆ ఈవెంట్‌కు నేను గెస్ట్‌గా వెళ్లాను. ‘ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్’ అన్నాను. అలా అనడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదు. కానీ హృతిక్ రోషన్ కించపరచడం నా ఉద్దేశం కాదు. అతను అంటే నాకు చాలా గౌరవిస్తాను’’ అంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసి చాలా మంది ఆయనను పొగడ్తలతో ముంచెత్తున్నారు. చదవండి: ఈ సంక్రాంతి మాకు కొత్త ఆరంభం: ఉపాసన స్పెషల్ పోస్ట్ ‘తప్పును అంగీకరించడం మీ గొప్పతనం’, మరోసారి మీ వినయాన్ని చూపారు’ అంటూ నెటిజన్లు జక్కన్నపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా అప్పుడు బిల్లా మూవీ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. ‘ధూమ్ 2 మూవీ చూసి.. ఎందుకు బాలీవుడ్‌యే ఇలాంటి క్వాలిటి మూవీస్ తీస్తుందని ఆశ్చర్యపోయాను. ఎందుకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నా. కానీ బిల్లా ట్రైలర్, పోస్టర్స్, పాటలు చూశాక ప్రభాస్ ముందు హృతిక్ రోషర్ నంథింగ్ అనిపించింది. హాలీవుడ్ రేంజ్లో బిల్లా మూవీ తీసిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు ధన్యవాదాలు’ అని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఇప్పుడ అవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
థియేటర్లలో బిల్లా రీ రిలీజ్.. కృష్ణంరాజు కుమార్తె ఎమోషనల్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. పాన్ ఇండియా స్టార్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హల్చల్ చేశారు. ఏపీలోని ఓ థియేటర్లో ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ షో చూసేందుకు కృష్ణంరాజు పెద్దకుమార్తె ప్రసీద హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని బిల్లా సినిమాను వీక్షించారు. ఫ్రభాస్ ఫ్యాన్స్ మధ్య థియేటర్లో సినిమా చూడడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నను, అన్నయ్యను స్క్రీన్‌పై చూడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?) కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద మాట్లాడుతూ...' ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా మళ్లీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యను, నాన్నను స్క్రీన్‌పై చూడడం సంతోషం కలిగించింది. మేమందరం చాలా బాగా సినిమాను ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. ' అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదన్నాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. -
థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ అభిమానులు
-
అరాచకం.. థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు చేసిన అత్యుత్సాహంతో థియేటర్లో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా వెంకట్రామ థియేరట్‌లో బిల్లా సినిమాను రీరిలీజ్ చేశారు. చాలాకాలంగా మూతబడిన ఈ థియేరట్ను అభిమానుల కోరిక మేరకు బిల్లా స్పెషల్ షో వేయించారు. అయితే సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చడంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగుతు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx — 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022 -
అమెరికాలో భారీ స్థాయిలో విడుదల కానున్న 'బిల్లా' 4k వెర్షన్
ఈమధ్య కాలంలో సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అమెరికాలోనూ రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. యూఎస్‌లో 70కి పైగా లొకేషన్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాక కోసం అభిమానులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు.అనుష్క, నమిత, హన్సిక కథానాయికలుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. -
తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు కృష్ణం రాజు కుమార్తె
రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతిని డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభాస్ కూడా ఈ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. అటు సినీప్రియులు వీరిమధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఇద్దరూ కలిసి నటించిన సినిమాల గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో వీరి కలయికలో వచ్చిన బిల్లా మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం హీరోల బర్త్‌డేలకు వారి హిట్ సినిమాలను 4కెలో థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే కదా! అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని బిల్లాను మళ్లీ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద, కమెడియన్ అలీ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన సాయి ప్రసీద మాట్లాడుతూ... 'బిల్లా చిత్రంతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లో నాన్న, అన్నయ్య కలిసి నటించిన తొలి చిత్రమిది. ఇది నాన్నకు చాలా ఇష్టమైన మూవీ. ఈ చిత్రాన్ని 4కెలో రీరిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేశ్ అంకుల్‌కు థాంక్యూ. ఈ స్పెషల్ షోల ద్వారా వచ్చే లాభాలను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు అందిస్తాం. ఇందులో నాన్న భాగస్వామిగా ఉన్నారు. ఫ్యాన్స్ ఈ మూవీని మళ్లీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. చదవండి: గీతూ వల్ల నరకయాతన, బాలాదిత్య భార్య ఏమందంటే? ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం -
ప్రభాస్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్, 4కె వెర్షన్లో ‘బిల్లా’ రీ-రిలీజ్
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ బిల్లా రీరిలీజ్ కాబోతోంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీరి రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా మూవీ టీం శనివారం ప్రెస్ మీట్ నిర్వహించింది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా బిల్లా మూవీని నయా టెక్కాలజీ 4కే వెర్షన్లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ మూవీగా రూపొందిన ఇందులో అనుష్క, నమితలు హీరోయిన్లుగా నటించారు. దివంగత నటులు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు పోలీసు అధికారిగా కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. 2007 డిసెంబర్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మరోసారి ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మరోసారి థియేటర్లోకి వస్తున్న ఈ సినిమాకు ఎంతటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఈ సందర్భంగా వచ్చిన మూవీ కలెక్షన్స్‌ను యూకే ఇండియా డయోబెటిక్ ఫుట్ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మెహర్ రమేష్, సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురయ్యా, 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటి గీతా సింగ్ తీవ్ర విషాదం.. మీర్జాపూర్ నటుడు మృతి -
‘బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..
ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీటీ అని ముద్దుగా పలుచుకునే ఈ బెంగళూరు భామ సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విక్రమార్కుడు వంటి చిత్రాల్లో గ్లామరస్‌గా కనిపించిన అనుష్క.. తన మొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘అరుంధతి’లో జేజమ్మగా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో తన నటనకు వంద శాతం మార్కులు కొట్టెసింది అనుష్క. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో ఒక్కసారిగా స్వీటీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి తెలుగు, తమిళంలో అగ్రనటిగా రాణించిన ఆమె ప్రస్తుతం సినిమాలు తగ్గించి కేవలం లేడీ ఓరియంటెడ్ పాత్రలనే ఎంచుకుంటోంది. అయితే మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిల్లా’ మూవీలో బికినీ వేసి అందాలు ఆరబోసిన స్వీటీ బయట మాత్రం చాలా సంప్రదాయంగా ఉంటుంది. ఏ మూవీ ఆడియో ఫంక్షన్ అయినా, ఇతర ఈవెంట్లు అయినా చీరలో లేక సల్వార్ కమీజ్లోనో కనిపిస్తుంది. స్వీటీ గ్లామరస్ పాత్రలు చేసినప్పటికి బిల్లాలో ఇంకాస్తా డోస్ పెంచి బికినీలో ఫిదా చేసింది. అయినప్పటికి అనుష్క పాత్రకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతటి రేంజ్లో ఎక్స్పోజ్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనుష్కకు వ్యక్తిగతంగా అలాంటి దుస్తులు అంటే ఇష్టం ఉండవని ఇదివరకే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సైతం ఓ ఇంటర్వ్వూలో ఇదే విషయం మాట్లాడుతూ బిల్లాలో తన పాత్రను గుర్తుచేసుకుంది. ఇందులో తను బికినీ ధరించడంతో తన తల్లి చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పింది. ‘మా అమ్మ నేను పద్దతిగా ఉండాలనుకుంటుంది. అది వ్యక్తిగతంగా అయినా వృత్తిపరంగా అయినా. అయితే బిల్లా సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను ఇంకా స్టైలిష్‌గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్‌గా ఎందుకుంటావ్ అని అంది. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే తన నుంచి ఆ వ్యాఖ్యలు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు’ అంటూ స్వీటీ చెప్పుకొచ్చింది. చదవండి: నాని మూవీకి హ్యాండ్ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్ వాయిదా! Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్, హీరోగా బండ్ల గణేశ్ -
హ్యాట్రిక్ ప్లాన్‌లో హిట్ కాంబినేషన్
వరుస బ్లాక్ బస్టర్లతో కోలీవుడ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆ ప్రాజెక్ట్ మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు అజిత్. గతంలో తనకు వీరం, వేదలం సూపర్ హిట్స్‌ను అందించిన శివ దర్శకత్వంలో ప్రస్తుతం వివేగం సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు అజిత్. తనతో బిల్లా, ఆరంభం సినిమాలను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు అజిత్. మాస్ హీరోగా ఉన్న అజిత్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించిన విష్ణువర్ధన్, మరోసారి అజిత్ కోసం డిఫరెంట్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ చోళ రాజుగా నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వివేగం షూటింగ్లో బిజీగా ఉన్న అజిత్ నుంచి త్వరలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మాఫియా డాన్‌గా శింబు
కొన్ని సినిమాలకు భాషా భేదాలుండవు. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనాలను నమోదు చేస్తాయి. అలా సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా అన్ని భాషల్లోనే బిగ్ హిట్‌గా నిలిచిన సినిమా బిల్లా. అమితాబ్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కిన డాన్ సినిమాను యుగంధర్ గా తెలుగులో, బిల్లాగా తమిళ్లో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. ఈ జనరేషన్లో అదే సినిమాను షారూఖ్, డాన్ పేరుతో రీమేక్ చేస్తే, బిల్లా పేరుతో అజిత్, ప్రభాస్‌లు మరోసారి రీమేక్ చేశారు. తరువాత అజిత్, డేవిడ్ బిల్లా పేరుతో బిల్లా సినిమాకు ప్రీక్వల్ను తెరకెక్కించినా అది ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. తాజాగా మరోసారి బిల్లా సినిమా తెరమీదకు వచ్చింది. కోలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో శింబు, బిల్లా సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. చాలా రోజులుగా కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్న శింబు, ఇటీవల విడుదలై ఇదు నమ్మ ఆలు సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. అదే జోరులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో ఒకటి బిల్లా సీక్వల్ అంటూ కన్ఫామ్ చేశాడు. ఈ సీక్వల్‌ను తన సొంతం బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు శింబు. ప్రీక్వల్తో నిరాశపరిచిన బిల్లా, సీక్వల్తో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి. -
బిల్లా మళ్లీ వస్తున్నాడు
కొన్ని సినిమాలకు భాషా బేదాలుండవు. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనాలను నమోదు చేస్తాయి. అలా సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా అన్ని భాషల్లోనే బిగ్ హిట్‌గా నిలిచిన సినిమా బిల్లా. అమితాబ్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కిన డాన్ సినిమాను యుగంధర్ గా తెలుగులో, బిల్లాగా తమిళ్లో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. ఈ జనరేషన్లో అదే సినిమాను షారూఖ్, డాన్ పేరుతో రీమేక్ చేస్తే, బిల్లా పేరుతో అజిత్, ప్రభాస్‌లు మరోసారి రీమేక్ చేశారు. తరువాత అజిత్, డేవిడ్ బిల్లా పేరుతో బిల్లా సినిమాకు ప్రీక్వల్ను తెరకెక్కించినా అది ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. తాజాగా మరోసారి బిల్లా సినిమా తెరమీదకు వచ్చింది. కోలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో శింబు, బిల్లా సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. చాలా రోజులుగా కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్న శింబు, ఇటీవల విడుదలై ఇదు నమ్మ ఆలు సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. అదే జోరులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో ఒకటి బిల్లా సీక్వల్ అంటూ కన్ఫామ్ చేశాడు. ఈ సీక్వల్‌ను తన సొంతం బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు శింబు. ప్రీక్వల్తో నిరాశపరిచిన బిల్లా, సీక్వల్తో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి. -
నయన తారతో మళ్లీ మళ్లీ
శింబు, నయనతారలది హిట్ జంటే కాదు సంచలన జంట కూడా. ఈ మాజీ ప్రేమికుల గురించి మీడియాలో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా కథనాలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. శింబు నయనతారలు ప్రేమించుకున్నారు, విడిపోయారు, దూషించుకున్నారు. అయినా మళ్లీ కలిసి నటించారు. ఆ చిత్రం ఇదునమ్మఆళు. అనేక సమస్యలనెదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇటీవల తెరపైకి వచ్చింది. ఇది మంచి విజయం సాధించిందంటూ శింబు ఆదివారం తన మిత్ర బృందంతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా పాల్గొనడం విశేషం. ఎందుకంటే బీప్ సాంగ్ వివాదం తరువాత శింబు, అనిరుధ్‌లు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే శింబు ఫేస్బుక్లో తన అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా మళ్లీ నటి నయనతారతో కలిసి నటిస్తారా? అన్న ఒక అభిమాని ప్రశ్నకు బదులిస్తూ ఎస్ నయనతారతో మళ్లీ మళ్లీ కలిసి నటిస్తాను అని అన్నారు. మరో విషయం ఏమిటంటే బిల్లా-3 చిత్రం చేయబోతున్నానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దానికి బిల్లా 2018 అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు.దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు మీతో చిత్రం చేయడానికి తాను రెడీ అని అనడంతో నేను పుట్టినప్పటి నుంచి రెడీ అన్నారు శింబు. మీరు, యువన్‌శంకర్‌రాజా, నేను చిత్రం చేద్దాం అని శింబు అనడమే కాకుండా బిల్లా 2018 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమై 2018లో తెరపైకి వస్తుందనీ అనడం ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. కాగా ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం బిల్లా. అదే చిత్ర రీమేక్‌లో అజిత్ నటించారు. ఆ చిత్రం విజయాన్ని సాధించింది. ఆ తరువాత అజిత్ బిల్లా-2లోనూ నటించారు. ఇప్పుడు శింబు బిల్లా-3లో నటించనున్నారన్నమాట. ప్రస్తుతం శింబు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం యంబదు మడమయడా చిత్రంలో నటిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి కావచ్చింది. తాజాగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అంబానవన్ అసరాదవన్ అడంగాదవన్(ఎఎఎ) అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. -
మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా అజిత్?
సూపర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన బాషా చిత్రం విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని రజనీకాంత్ ఆ తరహా గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న చిత్రం కబాలి.దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చును. కాగా ఆ తరువాత స్థాయిలో ఉన్న నటుడు అజిత్ సూపర్‌స్టార్ బాణీలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించిన బిల్లా చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అది రజనీకాంత్ నటించిన బిల్లా చిత్రానికి రీమేక్ అన్నది తెలిసిన విషయమే. తాజాగా అజిత్ కూడా మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా తనదైన స్టైల్లో రెచ్చిపోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అజిత్‌ను వీరం చిత్రం ద్వారా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో చూపించి ప్రేక్షకుల ఆమోదాన్ని, ఆయన అభిమానుల ఆదరణను పొందేలా చేసిన దర్శకుడు శివ. ఈయన ఆ తరువాత కూడా వేదాళం చిత్రంలో అలాంటి విభిన్న గెటప్‌లోనే అజిత్‌ను చూపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అజిత్‌ను డెరైక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు దర్శకుడు శివ. అయితే ఈ సారి అజిత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సత్యజ్యోతి ఫిలింస్ అధినేత టి.త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెలలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు.దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. -
లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు!- అనుష్క
ఒకప్పుడు బొద్దుగా బందరు లడ్డూలా ఉండే కథానాయికలంటే పడి చచ్చేవాళ్లు. ఇప్పుడేమో ‘జీరో సైజ్’ ట్రెండ్ నడుస్తోంది. వీలైనంత సన్నగా కనిపించాలని కథానాయికలు తాపత్రయపడతారు. లావుగా కనిపించాల్సి వచ్చే ఆ పాత్రలకు దాదాపు దూరంగా ఉంటారు. కానీ, అనుష్కలాంటి కొంతమంది తారలు మాత్రం పాత్ర డిమాండ్ చేస్తే, తగ్గుతారు, పెరుగుతారు. అందుకు ఓ ఉదాహరణ ‘బిల్లా’. ఆ సినిమా కోసం బరువు తగ్గిన అనుష్క తాజాగా ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్లో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో అనుష్కను చూసి ఆందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పరిగెత్తుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తే, మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం. వాస్తవానికి ఈ పాత్ర గురించి చెప్పగానే అనుష్క తనంతట తాను బరువు పెరగాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయం గురించి అనుష్క ‘సాక్షి’తో మాట్లాడుతూ - ‘‘ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగిందో తెలిసిందే. ఏదైనా ట్రిక్ చేసి, లావుగా కనబడేలా చేయొచ్చు. కానీ, నాకది ఇష్టం లేదు. అందుకే బరువు పెరగాలని దర్శక, నిర్మాతలు నాకు నిబంధన విధించకపోయినా పెరుగుతానని నా అంతట నేనే చెప్పాను. దీనికోసం ఎక్కువ ఆహారం తీసుకున్నాను. కానీ, ఆరోగ్యకరమైనదే తీసుకున్నాను. అందరూ లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు. ‘సైజ్ జీరో’ చాలా స్వీట్ స్క్రిప్ట్. మంచి మెసేజ్ ఉంది. ప్రతి అమ్మాయీ ఈ చిత్రంతో కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. -
అజిత్ ..రజనీలా స్టైలిష్ స్టార్ కాడు
సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్! కొందరికి జుట్టు నెరుస్తుంది... మనోడికి జుట్టు మెరుస్తుంది... సదరన్ సినిమాలో అతనొక సిల్వర్ లైనింగ్! లైఫ్ చాలా సింపుల్... నో వైనింగ్... నో డైనింగ్!! రిస్కు అజిత్‌కుమార్ ఇంటిపేరు... మంచితనం ఆయన ముద్దుపేరు... రత్నం మాటల్లో చెప్పాలంటే - తన కమ్‌బ్యాక్‌కు అజిత్ పెద్ద కట్నం. ‘నామ వాళనువ్ునా... యార వేణా, యతనపేర వేణా కొల్లలావ్ు’ (మనం బతకాలంటే... ఎవరినైనా, ఎంత మందినైనా చంపచ్చు). ఇది తమిళ సూపర్‌హిట్ ‘బిల్లా’ లోని డైలాగ్. రీల్ లైఫ్‌లో ఈ డైలాగ్‌తో మాస్‌ను ఉర్రూత లూపిన హీరో అజిత్. కానీ, రియల్ లైఫ్‌లో ఆయన క్యారెక్టర్ మాత్రం ఆ పాపులర్ డైలాగ్‌కు పూర్తి విరుద్ధం. మనం బతకడం కాదు... చుట్టూ అంతా బతకాలి, బాగుండాలి. ఇదీ అజిత్ తత్త్వం. అందుకే, అజిత్ గురించి మాట్లాడుకొనే ముందు... నిర్మాత ఏ.ఎం. రత్నం గురించి చెప్పుకోవాలి! ఒకటా... రెండా... బోల్డన్ని కోట్లు పోసి, ‘భారతీయుడు’, ‘జీన్స్’ లాంటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత. ఆయన అడగడమే ఆలస్యం... ఏ హీరో అయినా డేట్లివ్వాల్సిందే! నిర్మాతగా రత్నానికున్న క్రేజ్, ఇమేజ్ అలాంటివి. కానీ... అదంతా గతం! ఇప్పుడు రత్నం వాళ్ళెవరికీ గుర్తు లేడు. ఒక్కడికి మాత్రం గుర్తున్నాడు. ఆ ఒక్కడూ - అజిత్. రత్నం లాంటి నిర్మాతను నిలబెడితే, ఇండస్ట్రీకి మంచిదని అజిత్ నమ్మాడు. అజిత్ ఎప్పుడూ అంతే! తను నమ్మిందే చేస్తాడు. అప్పుడెప్పుడో తన ‘కాదల్ కోట్టై’ని తెలుగులో ‘ప్రేమలేఖ’గా అందించిన రత్నాన్ని పిలిచి మరీ డేట్లి చ్చాడు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు సినిమాలు. నిన్నటి ‘ఆరంబం’... తాజా ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’గా రానుంది) సూపర్‌హిట్. ఇప్పుడు మూడోది మొదలైంది. రత్నం పుంజుకున్నాడు. వైభవం మళ్ళీ మొదలైంది. ఇదంతా అజిత్ చలవే! మీకు శ్రీకర్ గుర్తున్నాడా? పోనీ... గొల్లపూడి మారుతీరావు కొడుకు తీసిన ‘ప్రేమ పుస్తకం’ (1993) సినిమా గుర్తుందా? ఆ శ్రీకరే... ఈ అజిత్. హీరోగా అతని ఫస్ట్ ఫిల్మ్ అదే. నిజానికి, హీరో అజిత్ తొలి అడుగులోనే సినిమా కథంత డ్రామా ఉంది. అవకాశమిచ్చిన గొల్లపూడి కొడుకు శ్రీనివాస్ షూటింగ్ మొదలైన తొమ్మిదో రోజే చనిపోయాడు. వైజాగ్ షూటింగ్లో రాకాసి సముద్రపు అల మింగేసింది. శ్రీనివాస్ శవాన్ని శ్మశానం దాకా మోశాడు అజిత్. దుఃఖాన్ని దిగమింగి, కొడుకు ప్రేమించిన వెండితెర పుస్తకాన్ని గొల్లపూడి పూర్తి చేశాడు. అజిత్ హీరో అయ్యాడు. ఆ సినిమా ఆడలేదు. కానీ, అజిత్‌కు తమిళ్ ఛాన్సలొచ్చాయి. రజనీకాంత్, కమలహాసన్‌లను అభిమానించిన అజిత్... వాళ్ళు క్రమంగా స్లో అవుతున్న టైమ్‌లో వచ్చాడు. లిబరలైజేషన్ ఎరాలోని నవతరం ప్రేక్షకుల టైవ్‌ులో వచ్చాడు. విక్రమ్, విజయ్ లాంటి కొత్త నీటితో పైకొచ్చాడు. తెలుగు ఫీల్డ్‌లోకి మళ్ళీ రాలేనంత బిజీ అయ్యాడు. తమ్ముడి భార్య మీద కన్నేసిన అన్న! ఏ హీరో అయినా ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా? అజిత్ ఒప్పుకున్నాడు. తమ్ముడి పాత్ర తనే! మూగ, చెవిటివాడైన అన్న కూడా తనే! ఎంత కష్టం... ఎంత రిస్కు! కానీ, అజిత్ అదరగొట్టాడు. తెలుగులోనూ డబ్ అయింది. ఇప్పటికీ తెలుగువాళ్ళకు అజిత్ అంటే ‘వాలి’ గుర్తొస్తుంది. యూత్‌ఫుల్, రొమాంటిక్ పాత్రలతో అజిత్ స్టార్టయ్యాడు. యాక్షన్ పాత్రలకు ఎదిగాడు. నెరిసిన జుట్టుతో మెచ్యూర్ పాత్రలకు మారాడు. 44 ఏళ్ళ వయసుకే పాతికేళ్ళ కెరీర్... 55 సినిమాలు. సినిమాను అజిత్ అమితంగా ప్రేమిస్తాడు. డబ్బు పెట్టిన నిర్మాత, తీస్తున్న దర్శకుడూ బాగుండాలని తపిస్తాడు. రిజల్ట్ - గత ఎనిమిదేళ్ళలో 5 హిట్స్ (‘బిల్లా, మంగాత్తా, ఆరంబమ్, వీరమ్, ఎన్నై అరిందాల్’). అజిత్... రజనీకాంత్‌లా స్టైలిష్ స్టార్ కాడు! కమల్‌లా అద్భుతమైన పెర్ఫార్మరూ కాడు! విజయ్, ధనుష్‌లా పచ్చి మాస్ హీరో అసలే కాడు! కానీ, వాళ్ళందరిలో లేనిది ఇతనిలో ఉంది. అదే జనాలకు నచ్చింది. ఎక్స్‌ట్రాలు లేవు... హంగామాలు లేవు... ఇప్పుడతను తమిళ సినిమాకు సెలైంట్ నంబర్‌వన్! ఎన్ని సినిమాలు చేసినా ‘అమర్కళమ్’ అజిత్ లైఫ్‌లో స్పెషల్. (‘అద్భుతం’గా డబ్ అయింది. ఎస్పీబీ గుక్కతిప్పుకోకుండా పాడిన ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా...’ పాట గుర్తుందిగా!) నటి శాలినితో అతను కలసి చేసిన సినిమా అదొక్కటే! మొదట వాళ్ళిద్దరూ కేవలం కో-స్టార్స్... ఆపైన ఫ్రెండ్సయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమైంది. గుడి గంటలు, చర్చి బెల్స్ సాక్షిగా వారిని ఏకం చేసింది. పేరుకు తగ్గట్లే ఆ సినిమా వాళ్ళ లైఫ్‌లో జరిగిన అద్భుతం. అజిత్... నచ్చింది చేస్తాడు... నచ్చినట్లు బతుకుతాడు కేరళ అయ్యర్‌కీ, కలకత్తా సింధీకీ హిందువుగా పుట్టి, క్రిస్టియన్ శాలినిని పెళ్ళి చేసుకోవడం కావచ్చు... ఆరు సిన్మాలుగా జుట్టుకు రంగేయకపోవడం కావచ్చు... కలెక్షన్స్ కోసం సినిమా ప్రమోషన్‌కు తిరగకపోవడం కావచ్చు... యాడ్స్‌లో చేయనని భీష్మించుకోవడం కావచ్చు... చివరకు, ఇంట్లో పనివాళ్ళకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కావచ్చు... సినిమా ఫీల్డ్‌లో అజిత్ ఒక యునీక్ ఎగ్జాంపుల్! ఆటో మెకానిక్‌గా మొదలై... రేసింగ్‌కి డబ్బు కోసం ఒక గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసి... పత్రికల్లో ప్రకటనలకు మోడల్‌గా మారి... సినిమాల్లో స్థిరపడిన రోజులన్నీ అజిత్‌కు బాగా గుర్తే! ఒకటే జీవితం... దాన్ని అనుకున్న రీతిలో, ఆనందంగా గడపాలి. అది అతని తత్త్వం. ‘సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్. బయప్పడాదవన్ ఒరు తడవదాన్ సావాన్’ (చావంటే భయమున్నవాడు రోజూ చస్తాడు. భయం లేనివాడు ఒకేసారి చస్తాడు). ఇది అజిత్ సినిమా పంచ్ డైలాగే కాదు. ఆయన లైఫ్ ఫిలాసఫీ కూడా. అందుకే, భయపడకుండా రిస్క్ చేస్తాడు - అది షూటింగ్లో ఫైటైనా! బయట రేసైనా! పద్ధెనిమిదో ఏట నుంచి బైక్, కారు రేసుల్లో దేశ విదేశాల్లో పాల్గొన్న ప్రాణం అజిత్‌ది. ప్రమాదాల పాలయ్యాడు. ఒకటి కాదు... రెండు కాదు... 15 సర్జరీలు... అందులో 5 ఏకంగా వెన్నెముకకే! అయినా ఆగలేదు. ‘బిల్లా’లో డైలాగ్‌లా ‘అయావ్‌ు బ్యాక్’ అన్నాడు. ‘ఫార్ములా 2’ రేస్‌లో పాల్గొన్నాడు. బైకు, కారే కాదు... విమానం నడపాలని అజిత్ ఆశ. ప్రైవేట్ పైలట్ లెసైన్స్ రాలేదు. అజిత్ నిరాశపడి, ఆగిపో కుండా ఏరో- మోడలింగ్ చేశాడు. రెండేళ్ళ క్రితం స్విట్జర్లాండ్‌లో కొన్న కొత్త బి.ఎం.డబ్ల్యు బైక్‌పై పుణే నుంచి చెన్నై దాకా రైడ్ చేశాడు. తనలోని పసితనం కాపాడుకుంటున్నాడు. మరి, ఇప్పుడు అజిత్ ఏం చేస్తున్నాడు? నిన్నటి నుంచి తన 56వ సినిమా (నిర్మాత రత్నం) షూటింగ్లో పాల్గొంటున్నాడు. షూటింగై పోగానే, వరుస హిట్ల విజయగర్వం తలకెక్కించుకోకుండా, హాయిగా ఇంట్లో ఏడేళ్ళ కూతురు అనౌష్కతో, రెండు నెలల చంటిపిల్లాడు ఆద్విక్తో గడుపుతున్నాడు. అజిత్ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలే! సగటు సినీ హీరోగా క్వాలిఫై అయ్యేంత హైట్ అతనికి లేకపోవచ్చు. కానీ, లైఫ్ ఫిలాసఫీలో అతనిది టవరింగ్ పర్సనాలిటీ! విడ్డూరం ఏమిటంటే - అజిత్ ఫ్యాన్ క్లబ్స్ వద్దం టాడు. అమ్మానాన్నను బాగా చూసుకోండని చెబుతాడు. అవసరంలో ఉన్నవాళ్ళకు అండగా నిలబడమంటాడు. ఎ.ఎం. రత్నానికి అజిత్ చేసింది అదే! అందుకే, చాలా మంది స్టార్స్ ఉండచ్చు. కానీ, అభిమానులు అన్నట్లు ‘అల్టిమేట్ స్టార్’ మాత్రం అజితే! పేరు, ప్రతిష్ఠ, డబ్బు, ఈ స్టార్ స్టేటస్... ఇవాళ ఉంటాయి. మరి, రేపటికి...? అజిత్ ఉంటాడు!! - రెంటాల జయదేవ కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇవాళ తమిళనాట అజిత్ సినిమా వస్తోందంటే, డిస్ట్రిబ్యూటర్లకూ, థియేటర్లకూ పండగే! సినిమా ఎలా ఉన్నా సరే, ఓపెనింగ్స్ అదిరిపోతుంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇవాళ రజనీకాంత్ సినిమాల కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ అజిత్‌కు వస్తున్నాయని తమిళ సినీ వ్యాపార వర్గాల కథనం. అందుకే, ఫ్యాన్స్ అజిత్‌ను ‘తల’ (నాయకుడనే అర్థంలో ‘తలైవా’కు సంక్షిప్త రూపం), ‘కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్’ అని పిలుస్తుంటారు. తోటి హీరోలతో పోలిస్తే, సంఖ్యాపరంగా అజిత్ హిట్స్ తక్కువే కావచ్చు. కానీ, సినిమా హిట్టయిందీ అంటే... ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసినట్లే! బాక్సాఫీస్ వద్ద ఆ క్రేజు, స్టార్డమ్ అజిత్ సొంతం. తక్కువ హిట్స్‌తో, ఎక్కువ పాపులారిటీ సాధించిన తమిళ హీరో అంటే అజితే! మంచితనం ఎక్కువ ‘‘స్టార్స్‌కు భిన్నంగా అజిత్‌లో సింప్లిసిటీ, మంచితనం ఎక్కువ. ఎందరో నిర్మాతలు వెయిట్ చేస్తున్నా, ఆయనే నన్ను పిలిచి మరీ డేట్లిచ్చారు. యూనిట్లో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, అవసరమైన సాయం చేస్తారు. తమిళనాట యూత్‌కు ఆయనంటే క్రేజ్. ఆయనే తమ రోల్‌మోడల్, ఇన్స్పిరేషన్ అంటారు.’’ - ఎ.ఎం. రత్నం, ప్రముఖ సినీ నిర్మాత