Prabhas Billa Movie Re release On October 23rd in 4K Print - Sakshi
Sakshi News home page

Billa Movie Re-release: 4కె వెర్షన్‌లో ‘బిల్లా’ రీ-రిలీజ్‌, ఆ కలెక్షన్స్‌ను ఏం చేయబోతున్నారంటే..

Published Sat, Oct 15 2022 6:45 PM | Last Updated on Sat, Oct 15 2022 7:17 PM

Prabhas Billa Movie Re release On October 23rd in 4k Print - Sakshi

డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌. ప్రభాస్‌ నటించిన యాక్షన్‌ మూవీ బిల్లా రీరిలీజ్‌ కాబోతోంది. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీరి రీరిలీజ్‌ చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా మూవీ టీం శనివారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా బిల్లా మూవీని నయా టెక్కాలజీ 4కే వెర్షన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే.  స్టైలిష్ యాక్షన్ మూవీగా రూపొందిన ఇందులో అనుష్క, నమితలు హీరోయిన్లుగా నటించారు.

దివంగత నటులు, ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణంరాజు పోలీసు అధికారిగా కీ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. 2007 డిసెంబర్‌ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. మరోసారి ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా మరోసారి థియేటర్లోకి వస్తున్న ఈ సినిమాకు ఎంతటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఈ సందర్భంగా వచ్చిన మూవీ కలెక్షన్స్‌ను యూకే ఇండియా డయోబెటిక్ ఫుట్ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ మెహర్ రమేష్, సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి:
ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురయ్యా, 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటి గీతా సింగ్‌
తీవ్ర విషాదం.. మీర్జాపూర్‌ నటుడు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement