మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా అజిత్? | Once again gangster in Ajith | Sakshi
Sakshi News home page

మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా అజిత్?

Published Wed, Mar 30 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా అజిత్?

మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా అజిత్?

సూపర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన బాషా చిత్రం విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని రజనీకాంత్ ఆ తరహా గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న చిత్రం కబాలి.దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చును. కాగా ఆ తరువాత స్థాయిలో ఉన్న నటుడు అజిత్ సూపర్‌స్టార్ బాణీలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించిన బిల్లా చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అది రజనీకాంత్ నటించిన బిల్లా చిత్రానికి రీమేక్ అన్నది తెలిసిన విషయమే.
 
 తాజాగా అజిత్ కూడా మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా తనదైన స్టైల్‌లో రెచ్చిపోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అజిత్‌ను వీరం చిత్రం ద్వారా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో చూపించి ప్రేక్షకుల ఆమోదాన్ని, ఆయన అభిమానుల ఆదరణను పొందేలా చేసిన దర్శకుడు శివ. ఈయన ఆ తరువాత కూడా వేదాళం చిత్రంలో అలాంటి విభిన్న గెటప్‌లోనే అజిత్‌ను చూపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అజిత్‌ను డెరైక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు దర్శకుడు శివ.
 
 అయితే ఈ సారి అజిత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సత్యజ్యోతి ఫిలింస్ అధినేత టి.త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెలలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు.దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement