MS Dhoni New Salt And-Pepper Look Goes Viral - Sakshi
Sakshi News home page

MS Dhoni: ధోని కొత్త లుక్‌ అదుర్స్‌.. ఫోటో వైరల్‌

Published Fri, Jan 20 2023 7:24 PM | Last Updated on Fri, Jan 20 2023 8:02 PM

MS Dhoni New Salt And-Pepper Look Goes Viral - Sakshi

టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని కొత్త అవతారంలో అదుర్స్‌ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు. కేవలం ఐపీఎల్‌ ఉన్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్‌ మొదలవనున్న నేపథ్యంలో ధోని తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ఇటీవలే ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. 

తాజాగా తన ప్రాక్టీస్‌ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం, నల్లజుట్టుతో సాల్ట్‌ అండ్‌ పెపర్‌ లుక​్‌లో అభిమానుల కంటపడ్డాడు.  ధోనీ ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది. నిజానికి ఒక రోజు ముందు కూడా ధోనీ ఫొటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

గతేడాది కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే ఈసారి మాత్రం ధోనికి చివరి ఐపీఎల్‌ కానుందని చాలా మంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ధోని సారధ్యంలో సీఎస్‌కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. ఇక గతేడాది రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి అతను మధ్యలోనే వైదొలగడంతో తిరిగి ధోనినే జట్టును నడిపించాడు. గత సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

చదవండి: రూల్స్‌ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement