![IPL 2023: Entire Chepauk Roars-MS Dhoni Comes Out To Bat Ahead CSK - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/28/MS.jpg.webp?itok=7d_v3vdF)
ఐపీఎల్ 2023 సీజన్ కోసం ప్రాక్టీస్ సెషన్స్‌తో బిజీగా ఉన్నాడు ధోనీ. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విజయాన్ని దక్కించుకొని నూతనోత్సాహంతో ఈ సీజన్‌ను ప్రారంభించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది.
ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ధోనీపైనే ఉంది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో కప్ గెలిచి అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా యంగ్ ప్లేయర్స్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు ధోనీ. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తోన్నారు.
సోమవారం ప్రాక్టీస్ సేషన్స్ చూసేందుకు అభిమానులకు అనుమతించారు. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టే సమయంలో అభిమానుల కేరింతలు, అరుపులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో గ్లోవ్స్ ధరిస్తూ బ్యాట్ పట్టుకొని స్టైలిష్‌గా ధోనీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ''కేజీఎఫ్ స్టైల్‌లో ధోనీ ఎంట్రీ అదిరిపోయింది'' అంటూ వీడియోను ఉద్దేశించి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ''ఐపీఎల్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్.. అతనికి ఉన్న క్రేజ్ మరెవరికి లేదంటూ'' మరొక నెటిజన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nayagan meendum varaar… 💛🥳#WhistlePodu #Anbuden 🦁 pic.twitter.com/3wQb1Zxppe
— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023
Comments
Please login to add a commentAdd a comment