Batting Practice
-
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
ధోని నినాదాలతో హోరెత్తిన చెన్నై స్టేడియం
ఐపీఎల్ 2023 సీజన్ కోసం ప్రాక్టీస్ సెషన్స్‌తో బిజీగా ఉన్నాడు ధోనీ. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విజయాన్ని దక్కించుకొని నూతనోత్సాహంతో ఈ సీజన్‌ను ప్రారంభించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ధోనీపైనే ఉంది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో కప్ గెలిచి అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా యంగ్ ప్లేయర్స్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు ధోనీ. చెపాక్ స్టేడియంలో సీఎస్కే ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తోన్నారు. సోమవారం ప్రాక్టీస్ సేషన్స్ చూసేందుకు అభిమానులకు అనుమతించారు. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టే సమయంలో అభిమానుల కేరింతలు, అరుపులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గ్లోవ్స్ ధరిస్తూ బ్యాట్ పట్టుకొని స్టైలిష్‌గా ధోనీ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ''కేజీఎఫ్ స్టైల్లో ధోనీ ఎంట్రీ అదిరిపోయింది'' అంటూ వీడియోను ఉద్దేశించి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ''ఐపీఎల్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్.. అతనికి ఉన్న క్రేజ్ మరెవరికి లేదంటూ'' మరొక నెటిజన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nayagan meendum varaar… 💛🥳#WhistlePodu #Anbuden 🦁 pic.twitter.com/3wQb1Zxppe — Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023 చదవండి: చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన -
నెట్స్‌లో చెమటోడ్చిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
పట్నా: రాజకీయ నేతలంటే ఎంతో బిజీగా ఉంటారు. అలాంటిది ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న నాయకుడైతే అసలు తీరికే ఉండదు. కానీ, బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. రాజకీయాలే కాదు ఇతర అంశాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఆదివారం ఉదయం యువకులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లా బ్యాటింగ్ చేస్తున్న తేజస్వీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తేజస్వీ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బ్యాటింగ్ ప్యాడ్స్, గ్లౌజులు, క్యాప్ ధరించి ప్రాక్టీస్ చేస్తున్నారు తేజస్వీ యాదవ్. ‘బిహార్‌కు చెందిన యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్నా. మీ అభిరుచిని ప్రేమించండి.. మీ లక్ష్యం కోసం జీవించండి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు తేజస్వీ యాదవ్. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 లక్షల మందికిపైగా వీక్షించారు. తేజస్వీ యాదవ్‌ని తిరిగి నెట్స్‌లో చూడటంపై సంతోషం వ్యక్తం చేశారు పలువురు అభిమానులు. ఇలాంటి వాటిల్లో తేజస్వీ కనిపించటం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం పట్నాలోని తన నివాసంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్వీట్ చేశారు తేజస్వీ. Practising with young & bright players of Bihar. #Cricket Love your passion Live your purpose pic.twitter.com/Q5S6j2YmGG — Tejashwi Yadav (@yadavtejashwi) January 8, 2023 ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది -
‘మ్యాట్’పై విహారి సాధన...
సాక్షి, హైదరాబాద్ : భారత ఆటగాళ్లు, పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో సన్నద్ధమవుతుండగా... తెలుగు కుర్రాడు, టెస్టు జట్టు సభ్యుడు హనుమ విహారి ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భిన్నమైన కసరత్తులు చేస్తున్నాడు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన విహారి క్లిష్టమైన కంగారు పర్యటన కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ‘ఐపీఎల్లో అవకాశం దక్కి ఉంటే బావుండేది. అయితే ఆడే చాన్స్ లేకపోవడంపై ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను ప్రాక్టీస్‌పైనే దృష్టి సారించాను. కోచ్ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో నా సాధన కొనసాగుతోంది’ అని విహారి అన్నాడు. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్లి ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో తన ఇంటి పరిసరాల్లోనే మ్యాటింగ్ వికెట్‌పై ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్ సెషన్ కోసం కోచ్ సలహా మేరకు ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. ఆసీస్‌లోని బౌన్సీ వికెట్లపై ఆడేందుకు ఈ విధమైన మ్యాటింగ్ వికెట్ ప్రాక్టీస్ దోహదం చేస్తుందని విహారి తెలిపాడు. భారత దిగ్గజాలుగా ఎదిగిన అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా ఇలాంటి మ్యాట్ పిచ్‌లపైనే ప్రాక్టీసే చేశారు. ఐపీఎల్లో ఆడని భారత క్రికెటర్ల సన్నాహాల్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షిస్తున్నారు. నిజానికి విహారి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయాడు. -
ఐపీఎల్ 2020 : ధోని ప్రాక్టీస్ షురూ
రాంచీ : దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా మాజీ కెప్టెన్ దనాధన్ ఎంఎస్ ధోనిపై ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ధోని బరిలోకి దిగుతాడా.. అతని ఆటను ఎప్పుడు కళ్లారా చూస్తామా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం మళ్లీ టీమిండియా జట్టులో ధోని కనబడలేదు.. ఆడలేదు. దాదాపు ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్ గ్రీన్ సిగ్నల్ దొరకడంతో మళ్లీ ధోని తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) ఇదే విషయాన్ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. 'గత వారం జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌కు మహీ వచ్చాడు. ఇండోర్ స్టేడియంలో బౌలింగ్ మెషిన్‌ను ఉపయోగించి బ్యాటింగ్ సాధన చేశాడు. ఎంఎస్ ధోని ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. సాధన కోసం ఇక్కడి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసింది. గత వారాంతంలో రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు కాని అప్పటి నుండి మరలా ఇక్కడికి రాలేదు. అయితే ప్రాక్టీస్ కోసం ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడు కావొచ్చు' అని ఒక అధికారి పేర్కొన్నారు. (పొరపాటున యువరాజ్‌ను గాయపర్చాను : అక్తర్) యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు ఆగస్టు 20న అక్కడికి పయనం కానున్నాయి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. అయితే కరోనా వైరస్ ముంచుకురావడంతో తిరిగి రాంచీకి వెళ్ళిపోయాడు. ఇక ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. చెన్నై జట్టుకు మూడూ ఐపీఎల్ టైటిళ్లు(2010, 2011,2018) సాధించిపెట్టి కెప్టెన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. (‘ధోని ఏమిటో మీరే చూస్తారు కదా’) -
ప్రదీప్, రికీ భుయ్ సెంచరీలు
విజయనగరం: కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మూడో రోజే సాధించిన ఆంధ్ర రంజీ జట్టు చివరి రోజును బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వినియోగించుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ (321 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏజీ ప్రదీప్ (262 బంతుల్లో 100; 8 ఫోర్లు) సెంచరీలతో సత్తా చాటుకోవడంతో... బరోడాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 328/3తో చివరిరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు 195.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 474 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆంధ్రకు 172 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా 17 ఓవర్లలో రెండు వికెట్లకు 60 పరుగులు చేసింది. బండారు అయ్యప్పకు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న ఆంధ్రకు మూడు పాయింట్లు రాగా, బరోడాకు ఒక పాయింట్ లభించింది.