విజయనగరం: కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మూడో రోజే సాధించిన ఆంధ్ర రంజీ జట్టు చివరి రోజును బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వినియోగించుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ (321 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏజీ ప్రదీప్ (262 బంతుల్లో 100; 8 ఫోర్లు) సెంచరీలతో సత్తా చాటుకోవడంతో...
బరోడాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 328/3తో చివరిరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు 195.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 474 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆంధ్రకు 172 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా 17 ఓవర్లలో రెండు వికెట్లకు 60 పరుగులు చేసింది. బండారు అయ్యప్పకు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న ఆంధ్రకు మూడు పాయింట్లు రాగా, బరోడాకు ఒక పాయింట్ లభించింది.