రాంచీ : దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా మాజీ కెప్టెన్ దనాధన్ ఎంఎస్ ధోనిపై ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ధోని బరిలోకి దిగుతాడా.. అతని ఆటను ఎప్పుడు కళ్లారా చూస్తామా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం మళ్లీ టీమిండియా జట్టులో ధోని కనబడలేదు.. ఆడలేదు. దాదాపు ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్ గ్రీన్ సిగ్నల్ దొరకడంతో మళ్లీ ధోని తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?)
ఇదే విషయాన్ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. 'గత వారం జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌కు మహీ వచ్చాడు. ఇండోర్ స్టేడియంలో బౌలింగ్ మెషిన్‌ను ఉపయోగించి బ్యాటింగ్ సాధన చేశాడు. ఎంఎస్ ధోని ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. సాధన కోసం ఇక్కడి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసింది. గత వారాంతంలో రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు కాని అప్పటి నుండి మరలా ఇక్కడికి రాలేదు. అయితే ప్రాక్టీస్ కోసం ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడు కావొచ్చు' అని ఒక అధికారి పేర్కొన్నారు. (పొరపాటున యువరాజ్‌ను గాయపర్చాను : అక్తర్)
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు ఆగస్టు 20న అక్కడికి పయనం కానున్నాయి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. అయితే కరోనా వైరస్ ముంచుకురావడంతో తిరిగి రాంచీకి వెళ్ళిపోయాడు. ఇక ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. చెన్నై జట్టుకు మూడూ ఐపీఎల్ టైటిళ్లు(2010, 2011,2018) సాధించిపెట్టి కెప్టెన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. (‘ధోని ఏమిటో మీరే చూస్తారు కదా’)
Comments
Please login to add a commentAdd a comment