టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కొన్నేళ్ల పాటు క్రికెట్‌లో అత్యంత ధనవంతమైన(Richest Cricketer) ఆటగాడిగా కొనసాగాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి ధోని వార్షిక ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1040 కోట్లు ఉండడం విశేషం. ధోని వార్షిక ఆదాయం.. కోహ్లి కంటే(రూ.1050 కోట్లు) కేవలం పది కోట్లు మాత్రమే తక్కువగా ఉంది.
దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్‌మెంట్స్, ఎండార్స్‌మెంట్ల రూపంలో వద్దన్నా కోట్లు వచ్చి పడేవి. అలాంటి ధోని క్రికెట్‌లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా(TTE) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ధోని పేరిట 2012కు సంబంధించిన పాత అపాయింట్‌మెంట్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్(ఆఫీస్ కేడర్) పోస్టుకు ధోనిని ఎంపిక చేసినట్లుగా అపాయింట్‌మెంట్ లెటర్‌లో ఉంది. ఇక ఈ పోస్టు కింద ధోని నెల జీతం రూ. 43వేలు(రూ.12,650-47,650)గా ఉండడం ఆశ్చర్యపరిచింది.
నెలజీతంతో పాటు అదనంగా స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్‌డ్ అలెవెన్స్ కింద మరో రూ. 21,970 ఉన్నాయి. ఇవీ గాక HRA(హౌస్ రెంటల్ అలెవెన్స్) కింద రూ.20,400.. స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400..(సబ్ ప్లాంట్స్‌లో పనిచేస్తే అదనంగా మరో రూ.8 వేలు).. ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 60వేలు, న్యూస్‌పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ. లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అందుకున్నాడు. ఇక ఈ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
కాగా అప్పటికే వేల కోట్లు సంపాదిస్తున్న ధోని ఈ జాబ్ చేశాడా లేదా అన్నది పక్కనబెడితే.. అప్పటికి టీమిండియా కెప్టెన్‌గా ఉన్న ధోని బ్రాండ్‌వాల్యూ ఎంతలా ఉందనేది ఈ లెటర్ చెప్పకనే చెప్పింది. ఇక ఇండియా సిమెంట్స్ ఎవరిదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇండియా సిమెంట్స్ అనుబంధ సంస్థ.
ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే బంధం కొనసాగిస్తే వస్తోన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు సీఎస్‌కేకు ఐదు టైటిల్స్ అందించిన ధోని.. రోహిత్‌తో(ముంబై ఇండియన్స్)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. 2010, 2011, 201, 2021లో సీఎస్‌కేను విజేతగా నిలిపిన ధోని తాజాగా 2023లో సీఎస్‌కేకు ఐదోసారి టైటిల్ అందించాడు. ఇక 2024 ఐపీఎల్‌లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. రానున్న తొమ్మిది నెలల్లో వచ్చే సీజన్ ఆడడంపై క్లారిటీ ఇస్తానని(అప్పటివరకు ఫిట్‌గా ఉంటే) ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని పేర్కొన్నాడు.
చదవండి: Shaka Hislop Collapsed Video: లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్
Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment