చెన్నై సూపర్‌కింగ్స్:
కెప్టెన్: ఎంఎస్ ధోని
విజేత: 2010, 2011, 2018
ఎంఎస్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 14వ సీజన్‌లో మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న సీఎస్‌కే 2021 మినీ వేలానికి ముందు ఆరుగురిని రిలీజ్ చేసింది. వారిలో కేదార్ జాదవ్, పియుష్ చావ్లా, మురళి విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో సీఎస్‌కే రూ. 17.35 కోట్లు ఖర్చు చేసింది. సీఎస్‌కే కోనుగోలు చేసిన వారిలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో పాటు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఉన్నాడు. వీరితో పాటు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లైన కృష్ణప్ప గౌతమ్, కె. భగత్ వర్మ, సి. హరి నిషాంత్, ఎం. హరిశంకర్ రెడ్డిలను కొనుగోలు చేసింది.
చదవండి: ఆర్‌సీబీ మ్యాచ్ షెడ్యూల్
ఐపీఎల్ 2020 సీజన్‌కు గాను సీఎస్‌కే ప్రదర్శన చూసుకుంటే మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటమిలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. సీఎస్‌కే లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడనుండగా.. అందులో 5 మ్యాచ్‌లు ముంబై వేదికగా.. 4 మ్యాచ్‌లు.. ఢిల్లీ వేదికగా.. 3 మ్యాచ్‌లు బెంగళూరు వేదికగా.. 2 మ్యాచ్‌లు కోల్‌కత వేదికగా ఆడనుంది.
సీఎస్‌కే జట్టు:
బ్యాట్స్‌మెన్ : ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్(వికెట్‌కీపర్), ఫాఫ్ డు ప్లెసిస్ ,రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, చతేశ్వర్ పూజారా,సి. హరి నిశాంత్
ఆల్‌రౌండర్లు: సామ్ కరన్,రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్,కె.భగత్ వర్మ,కృష్ణప్ప గౌతమ్
బౌలర్లు: శార్దుల్ ఠాకూర్, కర్న్ శర్మ, కె.ఎం.ఆసిఫ్, జోష్ హాజిల్‌వుడ్, ఇమ్రాన్ తాహిర్, ఆర్. సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎన్గిడి, ఎం.హరిశంకర్ రెడ్డి
చదవండి: ముంబై ఇండియన్స్ మెరిసేనా
సీఎస్‌కే మ్యాచ్ షెడ్యూల్:
తేది | జట్లు | వేదిక | సమయం |
ఏప్రిల్ 10 | సీఎస్‌కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 16 | సీఎస్‌కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 19 | సీఎస్‌కే వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 21 | సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 25 | సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ | ముంబై | సాయంత్రం 3.30 గంటలు |
ఏప్రిల్ 28 | సీఎస్‌కే వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 1 | సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 5 | సీఎస్‌కే వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 7 | సీఎస్‌కే వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 9 | సీఎస్‌కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ | బెంగళూరు | సాయంత్రం 3.30 గంటలు |
మే 12 | సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్ | బెంగళూరు | రాత్రి 7.30 గంటలు |
మే 16 | సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ | బెంగళూరు | రాత్రి 7.30 గంటలు |
మే 21 | సీఎస్‌కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
మే 23 | సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
Comments
Please login to add a commentAdd a comment