ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా అది జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే పోస్టర్‌లు, టీజర్, ట్రైలర్ అంటూ ప్రేక్షకులకు దగ్గర చేస్తారు. అన్నింటికి మించి సినిమా విడుదలకు ముందు అందులో నటించిన నటీనటులతో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వారందరూ కూడా హాజరవడం జరుగుతుంది. కానీ లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. చివరకు తను నటించిన చిత్రాల కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనదు. ఒక ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టే సమయంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలకు రానని ముందే స్పష్టంగా చెప్పి రూల్ పెట్టేస్తుంది.
చిరంజీవి,షారూఖ్‌ఖాన్ వంటి స్టార్స్‌తో నటించిన నయనతార వారితో పాటు ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ తాజాగా ఒక డైరెక్టర్ కోసం తన రూల్‌ను బ్రేక్ చేసింది నయనతార. కానీ తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన 'పంజా' సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ కోసం ఆమె ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా విష్ణువర్ధన్ 'నేసిప్పయ' అనే సినిమా తీశారు. అందులో అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది.
అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెప్పవచ్చు. విష్ణువర్ధన్ తమిళ్‌లో బిల్లా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ చిత్రంలో నయనతారను ఎంపిక చేయడం వల్ల ఆమె కెరియర్ మారిపోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత నయనతారకు భారీగా డిమాండ్ పెరిగింది. వరుసుగా సినిమా ఆఫర్లు క్యూ కట్టేశాయ్. అలా ఇప్పుడు అభిమానులు లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే రేంజ్‌కు నయనతార చేరుకుంది. ఆ అభిమానంతోనే నయనతార తన రూల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నయన్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment