Vishnuvardhan
-
ఆ డైరెక్టర్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన 'నయనతార'
ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా అది జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంటూ ప్రేక్షకులకు దగ్గర చేస్తారు. అన్నింటికి మించి సినిమా విడుదలకు ముందు అందులో నటించిన నటీనటులతో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వారందరూ కూడా హాజరవడం జరుగుతుంది. కానీ లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. చివరకు తను నటించిన చిత్రాల కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనదు. ఒక ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టే సమయంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలకు రానని ముందే స్పష్టంగా చెప్పి రూల్ పెట్టేస్తుంది.చిరంజీవి,షారూఖ్‌ఖాన్ వంటి స్టార్స్‌తో నటించిన నయనతార వారితో పాటు ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ తాజాగా ఒక డైరెక్టర్ కోసం తన రూల్‌ను బ్రేక్ చేసింది నయనతార. కానీ తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన 'పంజా' సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ కోసం ఆమె ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా విష్ణువర్ధన్ 'నేసిప్పయ' అనే సినిమా తీశారు. అందులో అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెప్పవచ్చు. విష్ణువర్ధన్ తమిళ్లో బిల్లా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ చిత్రంలో నయనతారను ఎంపిక చేయడం వల్ల ఆమె కెరియర్ మారిపోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత నయనతారకు భారీగా డిమాండ్ పెరిగింది. వరుసుగా సినిమా ఆఫర్లు క్యూ కట్టేశాయ్. అలా ఇప్పుడు అభిమానులు లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే రేంజ్‌కు నయనతార చేరుకుంది. ఆ అభిమానంతోనే నయనతార తన రూల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నయన్ చెప్పుకొచ్చింది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు చెందిన స్వాతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో భర్త కుమార్ మృతి చెందాడు. వీరికి విష్ణువర్ధన్ (8)అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో స్వాతి ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌తో కలసి ఉంటోంది. మూడు నెలల నుంచి వీరు పాత రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లి వ్యవహార శైలిపై కొడుకు నిలదీసేవాడు. ఈ క్రమంలో 10వ తేదీన తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని కోపం పెంచుకున్న స్వాతి తాగిన మైకంలో కొడుకు గొంతు నులిమి హత్య చేసింది. అనిల్‌కు తన కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మబలికింది. ఇద్దరూ కలసి మృతదేహాన్ని అదేరోజు రాత్రి పటాన్చెరు మండలం ముత్తంగి సర్వీస్ రహదారి పక్కన పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు పాత రామచంద్రపురానికి చెందిన బాలుడని తేలడంతో పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల భయంతో స్వాతి, అనిల్ శుక్రవారం రాత్రి వారు ఉంటున్న గదిని ఖాళీ చేసేందుకు రాగా పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో కొడుకును తానే హత్య చేసినట్లు విచారణలో స్వాతి ఒప్పుకోవడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
అదితి శంకర్ కొత్త సినిమా.. షూటింగ్ పూర్తి!
దర్శకుడు విష్ణు వర్ధన్ పేరు చెప్పగానే పట్టియల్, బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆమధ్య బాలీవుడ్ వెళ్లి పేర్షా సినిమాను డైరెక్ట్ చేయగా ఈ మూవీ ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఇతడు సల్మాన్‌ఖాన్ హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం విష్ణువర్ధన్‌కు బాలీవుడ్లో మరింత గుర్తింపును తీసుకురానుందట. తాజాగా ఈయన కోలీవుడ్‌పై దృష్టి సారించారు. దివంగత నటుడు మురళి వారసుడు ఆకాష్ మురళిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఎక్స్ బీ ఫిలిమ్స్ పతాకంపై సేవియర్ బిట్టో నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ఇంతకుముందు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించిన మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించింది. ఇక లేటెస్ట్ మూవీలో ఆకాష్ మురళి సరసన దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్గా నటించటం విశేషం. ఇందులో నటుడు శాంతకుమార్, ప్రభు గణేశన్, నటి కుష్భు సుందర్, కల్కి కొచ్లిన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ మనసులను హత్తుకునే రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లోని అందమైన నగరాలతో పాటు ఇండియాలోని బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారని, ఇంతకు ముందు దర్శకుడు విష్ణు వర్ధన్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కాంబోలో రూపొందిన చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయని, అదే కోవలో సంగీత ప్రియులను ఈ చిత్రం అలరిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. Tamil hero, Akash Murali, son of late actor Murali. The filming has been completed & the film has been shot extensively across different cities in Portugal, Spain & India. Starring @_akashmurali @AditiShankarofl @realsarathkumar #PrabhuGanesan @khushsundar — XB Film Creators (@XBFilmCreators) February 9, 2024 చదవండి: ఫైనల్లీ గుడ్‌న్యూస్ చెప్పిన సమంత -
రాజ రాజ చోళుడిగా అజిత్?
తమిళసినిమా: నటుడు అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారా? రాజరాజ చోళుడు పాత్రను పోషించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే రావడం విశేషం. ఇటీవల చారిత్రక కథాచిత్రాలు నడుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాలు సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయిన విషయాన్ని చూశాం. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం క్రితమే దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేషన్ రాజ రాజ చోళన్ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్‌తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో నటుడు అజిత్ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్ కథా చిత్రంలో నటించిన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో సల్మాన్ ఖాన్ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడుగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్‌లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
ఓరి.. భడవా! అమ్మ తిట్టిందని..18 కి.మీ నడిచి వెళ్లి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. పోలీసులు శనివారం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అయితే ఘటనలో బాలుడు ఎక్కడకు వెళ్లాడు? ఏమయ్యాడు? ఎలా దొరికాడనే విషయాలు తెలిస్తే.. వీడు పిల్లాడు కాదు.. పిడుగు అనిపిస్తుంది. టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాలు.. ప్రశాంత్‌నగర్‌కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నట్టు చెప్పి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్‌నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతకసాగారు. ఇదిలా ఉండగా, విష్ణువర్దన్ నిన్న సాయంత్రానికే చిత్తూరు నుంచి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ గ్రామానికి చేరుకున్నాడు. చీకటి పడడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు చేరుకున్నాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిపై కోపంతో విష్ణువర్ధన్ అంతదూరం నడుచుకుంటూ తన అమ్మమ్మ, తాత ఇంటికి ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు తడకరకు బస్సులో వెళ్లిన విష్ణువర్దన్.. అక్కడక్కడా చూసిన కొండగుర్తులతో దిగువ తడకరకు నడిచి వెళ్లడం విశేషం. -
ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం
బెంగళూరు : కన్నడ చిత్రరంగానికి చెందిన ముగ్గురు నటీనటుల పుట్టినరోజు బుధవారమే కావడంతో అభిమానుల సందడి మిన్నంటింది. సాహససింహ, దివంగత నటుడు విష్ణువర్ధన్, స్టార్ నటునిగా పేరున్న ఉపేంద్ర, నటీమణి శృతిల అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరిపారు. విష్ణు అభిమానులు, వివిధ సంఘ సంస్థలు అభిమాన్ స్టూడియోలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. చిత్ర ప్రముఖులు ట్విట్టర్లో ఆయనను స్మరించుకున్నారు. నిరాడంబరంగా ఉప్పి జన్మదినం మరో నటుడు ఉపేంద్ర 52వ పుట్టినరోజును బెంగళూరులో తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకొన్నారు. కేక్, పూల బొకేలు తీసుకురావద్దని అభిమానులకు ఆయన ముందుగానే మనవి చేశారు. పరిసర సంరక్షణ కోసం మొక్కలను తీసుకురావాలని కోరటంతో చాలామంది అభిమానులు మొక్కలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. నటి, బీజేపీ నాయకురాలు శృతి 44వ జన్మదినంను బెంగళూరులో కేక్ కట్ చేసి ఆచరించారు. విష్ణుకు సీఎం యడ్డి, సుదీప్ నివాళులు దివంగత నటుడు విష్ణువర్ధన్‌కు సీఎం బీఎస్ యడియూరప్ప నివాళులరి్పంచారు. కన్నడ చిత్రరంగానికి అనేక సేవలందించిన్నట్లు ట్విట్టర్ ద్వారా కొనియాడారు. ఆయన సినిమాలు, వ్యక్తిత్వం ద్వారా ప్రజల మన్ననలను పొందుతున్నారని తెలిపారు. విష్ణువర్థన్ తండ్రి మాదిరిగా ఎంత ప్రీతిని చూపించేవారో, తప్పు చేస్తే అంతే కోప్పడేవారని హీరో సుదీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన దూరమై అనాథమలయ్యామని ఆవేదనను వ్యక్తం చేశారు. -
విష్ణు–సాయిలకు డబుల్స్ టైటిల్
లక్నో: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో తెలంగాణ జోడి పి.విష్ణువర్ధన్ గౌడ్– పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ సత్తా చాటింది. విష్ణు–సాయి జంట అండర్–19 బాలుర డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సాయి కుమార్–విష్ణువర్ధన్ జోడి 21–11, 21–19తో రెండో సీడ్ మన్జీత్ సింగ్– డింకూ సింగ్ జంటపై గెలిచింది. అంతకుముందు సెమీస్‌లో 21–7, 22–20తో ఆలాప్ మిశ్రా–ధ్రువ్ రావత్‌పై, క్వార్టర్స్‌లో 21–17, 21–16తో అమన్– యశ్‌పై నెగ్గి తెలంగాణ ఆటగాళ్లు ఫైనల్‌కు చేరారు. -
మళ్లీ రిలీజ్ కానున్న నాటి సంచలనం
బొమ్మనహళ్లి: అలనాటి సూపర్ హిట్ సినిమా ‘నాగరహావు’ నేటి డిజిటల్ ధ్వని, కొంగొత్త హంగులతో ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో శోభన్‌బాబు, లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ చిత్రానికి మాతృక అయిన ఈ కన్నడ సినిమా సరిగ్గా 46 ఏళ్ల కిందట విడుదలై అనేక రికార్డులను తిరగ రాయడమే కాకుండా అవార్డుల పంట పండించింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో విష్ణువర్ధన్ నటుడుగా భారీ బ్రేక్ సాధించి అగ్రనటుడు డాక్టర్ రాజ్ కుమార్ సరసన స్థానాన్ని సైతం సంపాదించాడు. చిత్ర నిర్మాత తనయుని తపనతో... ఈ చిత్ర నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు బాలాజీ ఆలోచనతో సినిమా మరోసారి రూపుదిద్దుకుంది. కొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తిరిగి రూపొందిస్తే ఎలాగుంటుందని తన సోదరుడైన నటుడు రవిచంద్రన్‌ను అడిగానని, ఆయన తనను ప్రోత్సహిస్తూ, వెంటనే పనిని ప్రారంభించమన్నారని బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి కొత్త హంగులను దిద్దాలనుకున్నప్పుడు ప్రింట్లు మాత్రమే దొరికాయని, చెప్పారు. వెతగ్గా వెతగ్గా చెన్నైలోని జెమిని ల్యాబ్స్‌లో నెగటివ్ లభ్యమైందని తెలిపారు. కొత్త హంగులను సమకూర్చడంలో 60 మంది సాంకేతిక నిపుణులు రెండేళ్ల పాటు శ్రమించారని చెప్పారు. మొత్తానికి ఈ నాగరహావు విభిన్న దృశ్య అనుభవాన్ని పంచుతుందని చెప్పారు. గత నెలలో యూట్యూబ్‌లో టీజర్‌ను విడుదల చేయగా ఇప్పటికి 11 లక్షల మందికి పైగా వీక్షించారు. అప్పట్లో నాగరహావును 35 ఎంఎంలో విడుదల చేయగా, ఇప్పుడు సినిమా స్కోప్‌లో విడుదల కానుంది. 1972లో సంచలనం 1972లో విడుదలైన ఈ చిత్రం విష్ణువర్ధన్‌కు సూపర్ స్టార్‌డమ్‌ను తెచ్చింది. అప్పటి వరకు రంగ స్థల, కళా చిత్రాల నటుడుగా మాత్రమే పరిచయమైన విష్ణువర్ధన్‌కు ఈ సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు పుట్టన్న కనగాల్ అప్పట్లో కళా, వాణిజ్య చిత్రాల వారధిగా వ్యవహరిస్తున్నారు. విష్ణువర్ధన్నే కాదు ఈ చిత్రంలో ఆయన అంబరీశ్‌ను కూడా పరిచయం చేశారు. ఇక ఆ సినిమాలో చామయ్య మాస్టారుగా నటించిన కేఎస్. అశ్వత్ పేరు ప్రతి ఇంటా ప్రతి ధ్వనించేది. నటీమణులు ఆరతి, జయంతిలకు కూడా ఈ సినిమా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికీ సూపర్ హిట్ అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమాను హిందీలో జహ్రీలా ఇన్సాన్, తమిళంలో రాజ నాగం పేరిట రీమేక్ చేశారు. అభిమానులకు పండుగే నాగరహావు చిత్రం ఓ కళా ఖండం. దీనిని పునః సృష్టించారు. విష్ణువర్ధన్ అభిమానులకు కచ్చితంగా ఇది పండుగ సీజనే. ఈ సినిమా రజతోత్సవాన్ని జరుపుకుంటుందనే విశ్వాసం నాకుంది. – భారతి, అలనాటి హీరోయిన్, విష్ణువర్ధన్ సతీమణి ఓబవ్వ పాత్రను సవాల్‌గా తీసుకున్నా ఈ సినిమాలో ఓబవ్వ పాత్రను తొలుత కల్పనకు ఇవ్వజూపారు. చిన్న పాత్ర అనే కారణంతో ఆమె తిరస్కరించింది. అనంతరం పుట్టన్న నన్ను అడిగారు. దీనినో సవాలుగా భావించి నేను ఒప్పుకున్నాను. శత్రు సేనలను తుదముట్టించే వీర నారిగా ఓబవ్వను వర్ణిస్తూ రాసిన పాట పుట్టన్న ఊహల్లోంచి పుట్టింది. ఈ పాటను విన్నప్పుడల్లా నాకు కొత్త గీతంగానే అనిపిస్తూ ఉంటుంది. – జయంతి, అలనాటి నటి, ఓబవ్వ పాత్రధారి -
మెయిన్ ‘డ్రా’కు విష్ణు–బాలాజీ జంట
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్, చెన్నైకు చెందిన శ్రీరామ్ బాలాజీ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో విష్ణు–బాలాజీ జోడీ 6–3, 6–4తో టాప్ సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలెనె (స్లొవేనియా) జంటపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–3తో ఎడ్వర్డ్ కోరి–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అంకిత 2–6, 7–5, 4–6తో వితాలియా దియాత్‌చెంకో (రష్యా) చేతిలో పోరాడి ఓడింది. వింబుల్డన్ ప్రధాన టోర్నమెంట్ జూలై 2న ప్రారంభమవుతుంది. -
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సౌత్ డైరెక్టర్
అజిత్ హీరోగా బిల్లా, ఆరంభం లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విష్ణువర్ధన్. తెలుగు పవన్ కల్యాణ్ హీరోగా పంజా సినిమాను రూపొందించిన ఈ స్టైలిష్ డైరెక్టర్ 20బ్తురువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు విష్ణు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాతో విష్ణువర్ధన్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
రంగ్‌దే తిరంగా...
హైదరాబాద్: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి ఒలింపిక్ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి, టెన్నిస్ ఆటగాడు విష్ణువర్ధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రంగ్‌దే తిరంగా’ పేరిట సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్), తెలంగాణ క్రీడా జర్నలిస్టుల సంఘం (టీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ... కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు ఈసారి 5 నుంచి 6 పతకాలు గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అద్వితీయ విజయాలతో చరిత్ర సష్టించాలని ఆమె ఆకాంక్షించారు. అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన భారత బందం మరిన్ని పతకాలు తెస్తుందని 2010 ఆసియా క్రీడల టెన్నిస్ డబుల్స్ కాంస్య పతక విజేత అయిన విష్ణువర్ధన్ అన్నారు. ఎస్పీఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేదార్ తేని మాట్లాడుతూ రంగ్‌దే తిరంగా... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆటగాళ్లకు నైతిక మద్దతుగా నిలిచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ ప్రింట్ చేపట్టిన క్యాంపెయిన్‌లో పలు రంగులతో కూడిన చేతి ముద్రలు వేసి సంఘీభావం తెలిపారు. -
పదేళ్ల తర్వాత...
...కలం పట్టి కథ రాశారట హీరో సుదీప్. ‘కోటి గొబ్బ 3’ కోసమే ఆయన కలం పట్టారు. ‘కోటి గొబ్బ’ ఫస్ట్ పార్ట్ (2001)లో సీనియర్ నటుడు విష్ణువర్థన్ నటించారు. 2016లో వచ్చిన సెకండ్ పార్ట్‌లో సుదీప్ నటించారు. మూడో భాగంలోనూ ఆయనే హీరో. నటించడంతో పాటు కథ కూడా అందిస్తున్నారు. దాదాపు పదేళ్ల కిత్రం స్వీయదర్శకత్వంలో తాను నటించి, రూపొందించిన ‘జస్ట్ మాత్ మాతల్లి’ సినిమా కోసం కథ అందించారు సుదీప్. మళ్లీ ఇన్నేళ్లకు తనలోని రచయితను బయటికి తీశారు. ‘కోటి గొబ్బ’ రెండో పార్ట్‌ను నిర్మించిన సూరపు బాబునే మూడో పార్ట్‌ను నిర్మిస్తున్నారు. శివకార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమా కోసం సుదీప్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పుచ్చుకోనున్నారని శాండిల్‌వుడ్ టాక్. సుదీప్ లుక్ కూడా రిలీజైంది. ఈ సినిమాను క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సుదీప్, సూరపు బాబు కాంబినేషన్లో వచ్చిన రెండో పార్ట్ హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూడోపార్ట్‌పై అంచనాలు ఉన్నాయి. -
84 వసంతాల వినోదం
కన్నడ సినిమాలు అనగానే అందమైన కుటుంబ కథలు, సంగీతం, పాటలు, హృద్యమైన లొకేషన్లు, మానవీయత జోడించిన నటీనటుల నటన గుర్తుకువస్తాయి. శాండల్‌వుడ్‌కు నేడు ఒక మరపురాని మధుర దినం. మార్చి 3 కన్నడ సినిమా రంగానికి ఓ సువర్ణదినంగా పేర్కొనవచ్చు. నేటికి సరిగ్గా కన్నడ వెండితెరకు 84 ఏళ్లు. కన్నడ సినిమాలు ఊపిరి పోసుకున్న అద్భుతమైన రోజు. వై.వి.రావు డైరెక్షన్లో విడుదలైన చిత్రం ‘సతీ సులోచన’ 1934 మార్చి 3న విడుదలైన కన్నడ మొదటి మాటల సినిమా. ఈ చిత్రం విడుదలై నేటీకి 84 ఏళ్లు. దీంతో ఈ రోజును శాండల్‌వుడ్ పండుగా భావిస్తుంది. కన్నడంలో ఓ సినిమా తీయాలనే యోచన నాగేంద్ర రాయరకు రావటంతో బెంగళూరులో వంటపాత్రల సామగ్రి వ్యాపారం చేస్తున్న డంగోజి కుటుంబం దృష్టికి తెచ్చారు. వారు రూ.40 వేలు పెట్టుబడితో ‘సతీ సులోచనా‘ అనే కన్నడ సినిమాను తీయాలని పునాది వేశారు. అన్నీ సిద్ధమైన తరువాత ఈ చిత్రం షూటింగ్ మహరాష్ట్ర కొల్మాపురలో తీయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి నటీమణులుగా అక్కచెల్లెలైయిన కమలా బాయి, లక్ష్మీబాయిలను ఎంపిక చేశారు. వీరు బెంగళూరు నుంచి షూటింగ్ కోసం కొల్హాపురకు రైలులో ప్రయాణం చేసేవారు. ఇలా పరిచయాలు పెరిగి హీరో నాగేంద్ర రాయరు కమలాబాయిని, విలన్ ఎం.వీ సుబ్బయ్య నాయుడు లక్ష్మీబాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికి 3986 సినిమాలు మొదట్లో నాటకాల్లో ఆదరణ పొందిన కథలనే సినిమాలుగా మార్చేవారు. నాటక పాత్రధారులే నటులుగా చేసేవారు. 1956 నుండి సినిమాలకు ప్రత్యేకంగా కథలను రాయటంను ప్రారంభించారు. డాక్టర్ రాజ్‌కుమార్ నటించిన ‘రాయర సోసె’ కల్యాణ కుమార్ నటించిన ‘నటశేఖర’లు సినిమా కథలు ఇలాంటివే. మైసూర్ సౌండ్ స్టూడియో కర్ణాటకకు మొదటి స్టూడియో. ఇదీ కన్నడ చిత్రరంగానికే కాకూండ ఇతర రాష్ట్రాల సినీరంగాని అకర్షించిన మొదటి స్టూడియోగా చెప్పవచ్చు. కన్నడంలో మొదటి కలర్ సినిమా బీఎస్ రంగ డైరక్షన్లో అమర శిల్పి జక్కణాచారి. కన్నడ చిత్రరంగం ఇప్పటివరకు 3986 సినిమాలకు ప్రేక్షకులకు సమర్పించింది. సింహాన్ని చూసి ప్రేక్షకుల పరుగు సతీసులోచన 1934 మార్చి 3 విడుదలైంది. ఆరువారాల పాటు ప్రదర్శన జరిగింది. బెంగళూరులో మొట్టమొదటి టాకీస్ దొడ్డణ్ణ హాల్ (ప్యారా మౌంట్)లో ప్రదర్శితమైంది. మూడు నెలల వ్యవధిలో షూటింగ్‌ను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం నిడివి 170 నిమిషాలు. ఈ చిత్రంలో ఓ తమాషా చోటుచేసుకుంది. సినిమాలో ఒకచోట సింహం కనిపిస్తుంది. అది చూసి సినిమాహాల్లోకి నిజంగానే సింహం వచ్చిందనే భయంతో చాలామంది ప్రేక్షకులు భయంతో మూర్ఛపడిపోగా, మరికొందరు బయటకు పరుగులు పెట్టారు. ఏ సినిమా అయినా హీరోకు జేజేలు పలుకుతారు, కానీ ఇక్కడ విలన్ పాత్రధారుడైన సుబ్బయ్య నాయుడుకు మంచి పేరు వచ్చింది. కన్నడంలో మొదట విడుదల కావాలసిన చిత్రం ‘భక్త ధృవ’, కానీ చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జోడీ
చెన్నై: హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. శ్రీరామ్ బాలాజీతో జతకట్టిన విష్ణు సెమీస్‌లో 6–3, 7–5తో సాకేత్ మైనేని (భారత్)– లుకా మార్గరొలి (స్విట్జర్లాండ్) ద్వయంపై గెలుపొందాడు. ఫైనల్లో విష్ణు–శ్రీరామ్ జంట సెమ్ లకెల్(టర్కీ)–పెట్రోవిచ్ (సెర్బియా) జోడీతో తలపడుతుంది. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 111 ర్యాంకర్ యూకీ 5–7, 6–2, 6–4తో యసుటక ఉచియమ (జపాన్)పై నెగ్గాడు. సెమీస్‌లో అతను మూడో సీడ్ డుకీ లీ (కొరియా)తో ఢీకొంటాడు. -
విష్ణువర్ధన్ గౌడ్ ‘డబుల్’
గువాహటి: జాతీయస్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. సోమవారం ముగిసిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ విభాగాల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) రెండు టైటిల్స్... గారగ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) ఒక టైటిల్ గెలుపొందారు. అండర్–19 బాలుర డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ) జంట 21–16, 21–19తో సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ ఎలాంగో (తెలంగాణ) జోడీపై... అండర్–17 బాలుర డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–బొక్కా నవనీత్ (తెలంగాణ) ద్వయం 21–14, 21–13తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)–ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) జంటపై విజయం సాధించింది. అండర్–19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–మిథుల (ఎయిరిండియా) జోడీ 21–18, 21–18తో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–రితూపర్ణ (ఒడిశా) ద్వయంపై గెలిచింది. అండర్–17 బాలికల డబుల్స్ ఫైనల్లో కేయూర మోపాటి–కవిప్రియ (తెలంగాణ) జంట 21–19, 15–21, 20–22తో త్రిషా హెగ్డే–ధ్రితి యతీశ్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడింది. -
విష్ణువర్ధన్ జంటకు స్వర్ణం
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్–విజయ్ నటరాజన్ (భారత్) ద్వయం 6–3, 6–4తో డెనిస్ యెవ్సెయెవ్–తిముర్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా–ప్రార్థన తొంబారే (భారత్) జోడీకి రజత పతకం లభించింది. ఫైనల్లో అంకిత–ప్రార్థన జంట 6–3, 3–6, 6–7 (5/7)తో తమాచాన్–వరుణ్య (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో నవీన్, 85 కేజీల విభాగంలో రవీందర్ ఖత్రీ రజత పతకాలు గెలిచారు. ఫైనల్లో నవీన్ 0–2తో బెహనామ్ (ఇరాన్) చేతిలో, రవీందర్ 1–4తో అజీజీ సమన్ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. నేటితో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ 8 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 36 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
ఫైనల్లో విష్ణు జంట
హైదరాబాద్: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్ (భారత్)–తొషిహిదె మత్సుయ్ (జపాన్) ద్వయం 7–6 (7/5), 7–6 (7/1)తో సాడియో దుంబియా (ఫ్రాన్స్)–కనెక్ని (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జోడీ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మ్యాచ్ మొత్తంలో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోగా... టైబ్రేక్‌లో మాత్రం విష్ణు జంటదే పైచేయిగా నిలిచింది. శనివారం జరిగే ఫైనల్లో కర్లోవ్‌స్కీ–తుర్నెవ్ (రష్యా) జోడీతో విష్ణు–మత్సుయ్ ద్వయం తలపడుతుంది. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జోడి
టెన్నిస్ టోర్నమెంట్ త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడి ఫైనల్లో ప్రవేశించింది. త్రివేండ్రం టెన్నిస్ క్లబ్లో గురువారం జరిగిన డబుల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2,7–5తో కునాల్ ఆనంద్– అన్విత్ బిండ్రే జంటపై గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో విష్ణువర్ధన్ జోడి జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)– హాంగ్ కిట్ వాంగ్ జంటతో తలపడుతుంది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విష్ణు 6–3, 7–6 (3)తో హాడిన్ బావాపై గెలుపొందగా... టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–2, 6–2తో విజయ్ సుందర్ ప్రశాంత్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్ బాలాజీ 6–4, 6–2తో రాజ్‌నీత్ విరాళి మురుగేశన్‌పై, దల్వీందర్ సింగ్ 6–3, 6–3తో జయేశ్‌పై గెలిచారు. సెమీస్‌లో విష్ణు, శ్రీరామ్ బాలాజీతో తలపడతాడు. -
విష్ణువర్ధన్‌కు 32వ డబుల్స్ టైటిల్
భిలాయ్ (ఛత్తీస్‌గఢ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాదీ ఆటగాడు విష్ణువర్ధన్ జోడి సత్తా చాటింది. ఇక్కడి బీఎస్పీ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–2, 6–4తో రెండో సీడ్ అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా) సామి రెన్‌వెన్ (జర్మనీ) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో విష్ణువర్ధన్ ఖాతాలో 32వ డబుల్స్ టైటిల్ చేరింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 7–6 (7/4), 6–4తో మూడో సీడ్ విష్ణువర్ధన్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో సెమీఫైనల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్) 6–1, 6–2తో సామి రెన్‌వెన్ (జర్మనీ)ని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. -
విష్ణువర్ధన్‌కు 31వ డబుల్స్ టైటిల్
గువహటి: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన ఖాతాలో 31వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శుక్రవారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–3 టోర్నమెంట్లో తన భాగస్వామి శ్రీరామ్ బాలాజీ (భారత్)తో కలిసి విష్ణు టైటిల్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 4–6, 6–1, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శశికుమార్ ముకుంద్ (భారత్)–తిముర్ ఖాబిబులిన్ (కజకిస్తాన్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో మాత్రం విష్ణువర్ధన్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. శశికుమార్ ముకుంద్తో జరిగిన మ్యాచ్‌లో విష్ణు 3–6, 6–4, 1–6తో పరాజయం పాలయ్యాడు. -
విష్ణువర్ధన్‌కు టైటిల్
కోల్‌కతా: ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విష్ణు 6-3, 6-4తో భారత్‌కే చెందిన రంజిత్ విరాళీ మురుగేశన్‌పై విజయం సాధించాడు. ఆరంభంలో తన సర్వీస్‌ను కోల్పోయిన విష్ణు ఆ వెంటనే తేరుకున్నాడు. పదునైన సర్వీస్‌లకు విజృంభించడంతోపాటు రంజిత్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో తొమ్మిదో గేమ్‌లో రంజిత్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన విష్ణు ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్
కోల్‌కతా: ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలోక్ గోయల్‌తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-1తో గెలిచాడు. భారత్‌కే చెందిన రంజిత్ విరాళీ మురుగేశన్, పరీక్షిత్ సొమాని, రోహిత్ రామ్పురియా, జగ్మీత్ సింగ్, నితిన్ కుమార్, సౌరవ్ సుకుల్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. -
రెండో రౌండ్లో విష్ణు
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో విష్ణు 7-6 (7/2), 6-4తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాజా వినాయక్ శర్మను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ సనమ్ సింగ్ నాలుగు మ్యాచ్ పారుుంట్లను వదులుకొని ఓటమి పాలయ్యాడు. ఏడో సీడ్ దిమిత్రీ పోప్కో (కజకిస్తాన్) తో జరిగిన మ్యాచ్‌లో సనమ్ 6-3, 6-7 (6/8), 6-7 (5/7)తో ఓటమి చవిచూశాడు. తొలి సెట్ నెగ్గిన సనమ్ రెండో సెట్ టైబ్రేక్‌లో 6-2తో ఆధిక్యంలో ఉన్నాడు. అరుుతే సనమ్ వరుసగా ఆరు పారుుంట్లు కోల్పోరుు సెట్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సనమ్ టైబ్రేక్‌లో తడబడ్డాడు. -
నర్సరీ పరిశీలన
రాయికోడ్: మండలంలోని రాయిపల్లి గ్రామ ఈజీఎస్ నర్సరీని ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ విష్ణువర్ధన్ సోమవారం పరిశీలించారు. నర్సరీల్లో పాడైన మొక్కల స్థానంలో నిమ్మ, కరివేపాకు విత్తనాలను నాటి మొక్కలుగా పెంచాలన్నారు. మెరుగైన పోషణ పద్ధతులు పాటిస్తే నిమ్మ, కరివేపాకు మొక్కలు 25 రోజుల్లో నాటేందుకు ఎదుగుతాయన్నారు. ప్రతి రోజూ నర్సరీల్లోని మొక్కలను పరిశీలిస్తూ బాధ్యతగా పెంచాలని నిర్వాహకులకు సూచించారు. మొక్కల పెంపకంపై కూలీలకు పలు సూచనలు చేశారు. రాయిపల్లి నర్సరీలో మొత్తం లక్ష మొక్కలను పెంచాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 వేల మొక్కలను పెంచి పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం టేకు, చింత తదితర మొక్కలు పెరుగుతున్నాయన్నారు. మరికొన్ని మొక్కలను పెంచడానికి కవర్లలో మట్టిని నింపి సిద్ధం చేశారన్నారు. అనంతరం కర్చల్-ఇందూర్ ప్రధాన రహదారికి ఇరుపక్కల నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలకు నీళ్లు పోస్తున్న కూలీలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సాయన్న, ధనుంజయ్, కూలీలు పాల్గొన్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు గత రెండు వారాలుగా మండలంలో వర్షాలు ముఖం చాటేయడంతో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టారు. సోమవారం జంమ్గి గ్రామంలో పలువురు రైతులు తమ పొలం గట్లపై నాటిన టేకు మొక్కలకు నీళ్లు పట్టారు. నాటిన టేకు మొక్కల సంరక్షణ కోసం ఒక్కో మొక్కకు నెలకు రూ.5 చొప్పున ఈజీఎస్ ద్వారా అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు సంవత్సరాల వరకు మొక్కల పోషణ ఖర్చులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. -
'పంజా' పవర్ చూపిస్తాడట..!
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకు కథ నచ్చితే సినిమా అంగీకరించే నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో ఓ భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో కూడా తిరిగి పనిచేసే సాహసం, టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు. అందుకే గతంలో తనతో ఓ ఫెయిల్యూర్ సినిమా చేసిన తమిళ దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయాలనుకుంటున్నాడు పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో పంజా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విష్ణువర్థన్. కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న విష్ణువర్థన్ పవర్ స్టార్ హీరోగా అలాంటి స్టైలిష్ యాక్షన్ డ్రామనే తెరకెక్కించాడు. అయితే పవన్ సినిమాల్లో రెగ్యులర్ గా ఉండే స్పీడ్, ఈ సినిమాలో లేకపోవటంతో పంజా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో విష్ణువర్థన్ తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి విష్ణువర్థన్ తెలుగు సినిమా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఈ సారి కూడా తన టాలీవుడ్ ఎంట్రీకి పవన్నే నమ్ముకుంటున్నాడు డైరెక్టర్ విష్ణువర్థన్. పవన్‌తో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డైరెక్టర్. ఇప్పటికే పవర్ స్టార్‌కు కథ కూడా వినిపించిన విష్ణు ఆ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. మరి ఈ సారైన తను అనుకున్న సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. -
విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ (ఎఫ్-10) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో నగరానికి చెందిన విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు-శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడి 6-4, 6-2 స్కోరుతో ఎస్కాఫీర్ ఆంటోన్-గ్రెనీర్ హ్యుగో (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విష్ణు 7-6(7), 5-7, 6-4 తేడాతో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌ను ఓడిం చాడు. మరో వైపు ఫ్రాన్స్ ప్లేయర్ ఎస్కాఫీర్ ఆంటోన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అతను 6-4, 6-2, 6-3తో భారత ఆటగాడు బాలాజీ శ్రీరామ్‌పై గెలుపొందాడు. -
కో సీక్వెల్‌కు సిద్ధం
కో చిత్ర కొనసాగింపునకు కథ సిద్ధం అయ్యిందంటున్నారు నిర్మాత ఎల్ రెడ్ కుమార్. జీవా, కార్తీక్ జంటగా నటించిన చిత్రం కో. విశేష ప్రజాదరణ పొందిన ఆ చిత్రాన్ని ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై ఎల్ రెడ్ కుమార్ నిర్మించారు. గత చిత్రాల పునర్ నిర్మాణాలకు కొనసాగింపు నిర్మాణాలకు ఆసక్తి, ఆదరణ పెరుగుతుండడంతో కో-2కు రెడీ అవుతున్నట్లు నిర్మాత ఎల్ రెడ్ కుమార్ తెలిపారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కో చిత్రానికి సీక్వెల్ తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నానన్నారు. ఒక చిత్రాన్ని సీక్వెల్ అంటే ముందు చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేయాలని ఏమీ లేదన్నారు. దర్శకులు విష్ణువర్ధన్, చక్రితోలేటి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన శరత్ చెప్పిన కథ నచ్చడంతో దాన్ని కో-2గా నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఇటీవల సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న బాబిసింహా హీరోగాను, నటి నిక్కి గల్రాణి హీరోయిన్‌గాను నటించనున్న ఈ చిత్రంలో నటుడు ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు వెల్లడించారు. కో చిత్రం మాదిరిగానే ఈ సీక్వెల్ కథ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. -
టెన్నిస్ ద్రోణుడు
అర్జునుడు విలువిద్యలో నేర్పరి అని కొనియాడే సమయంలో ద్రోణాచార్యుడిని కూడా తలుచుకోవాలని మహాభారతం గుర్తు చేస్తుంది. ఆ స్ఫూర్తితోనే భారతదేశ వర్ధమాన టెన్నిస్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సురేశ్ కృష్ణ, పి.సి. విఘ్నేశ్, వై. సందీప్‌రెడ్డి, సౌజన్య భవిశెట్టి... వంటి వారి గురించి చెప్పుకునే ప్రతిసారీ.. వారిని మేటి క్రీడాకారులుగా తీర్చి దిద్దిన కోచ్ సి. వి. నాగరాజును కూడా గుర్తు చేసుకోవాలి. సికింద్రాబాద్‌లోని ఆర్ ఆర్ సి (రైల్వే రిక్రియేషన్ క్లబ్) గ్రౌండ్స్‌లో ఐదేళ్ల నుంచి 22 ఏళ్ల వయసున్న సుమారు యాభై మంది పిల్లలు టెన్నిస్ సాధన చేస్తున్నారు. కొందరు పిల్లల తల్లులు ఓ పక్కగా కూర్చుని ఓ కంట టెన్నిస్ సాధనను గమనిస్తూ కబుర్లలో ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల్లో ప్రతి ఒక్కరి ఆటతీరును గమనిస్తూ ఉన్నారు 53 ఏళ్ల కంజీవరం వెంకట్రావు నాగరాజు. షాట్లో పొరపాటు జరిగితే వెంటనే పిల్లలను పేరుతో పిలిచి షాట్ అలా కాదంటూ వెళ్లి సరిచేస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు మడమకు దెబ్బ తగిలించుకున్నాడు. వెంటనే క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టి ‘ఈ రోజుకి ఇక ఆడకు. ఇంటికి వెళ్లి మమ్మీడాడీతో ఫోన్ చేయించు, ఏం చేయాలో చెప్తాను’ అని ఓ పక్కన కూర్చోబెట్టారు. రాకెట్ పట్టుకోవడం మొదలు ఆటలో మెలకువలు నేర్పించడం, గాయమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం, క్రీడాకారులు తీసుకోవాల్సిన రోజువారీ ఆహార పట్టిక తయారు చేసివ్వడం వరకు కోచ్‌దే బాధ్యత. అలా ఈ కోచ్ చేతిలో తయారైన టెన్నిస్ క్రీడాకారులు ఇవాళ జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ‘‘సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. నా విద్యార్థులు డేవిస్ కప్ సాధించారు, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు గెలుచుకున్నారు. శిక్షకుడిగా నా సంతోషం నేను తయారు చేసిన వారి విజయాల్లోనే ఉంటుంది’’ అంటారు నాగరాజు. తెలుగు నేలపై నాలుగోతరం..! తల్లిదండ్రులిద్దరూ మంచి క్రీడాకారులు కావడమే తనను క్రీడల వైపు మరల్చింది అంటారు నాగరాజు. ‘‘మా అమ్మ రాజేశ్వరీ వెంకట్రావ్ బెంగుళూరులో టెన్నిస్ ఆడేది. తండ్రి సి.డి. వెంకట్రావ్ ఉస్మానియా తరఫున ఆడేవారు. నేను జూనియర్స్ లెవెల్లో నేషనల్స్ ఆడాను. సాధారణ ఉద్యోగాలు చేస్తే టెన్నిస్‌కు దూరం కావాల్సిందే అని తెలిసిన తర్వాత టెన్నిస్ కోచ్ కావడానికి కావల్సిన కోర్సులు చేసి శిక్షకుడిగా మారాను’’ అని వివరించారాయన. నాగరాజు పూర్వీకులది తమిళనాడులోకి కంజీవరం. నాలుగు తరాల ముందు శ్రీనివాసన్ సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమారుడు దామోదర్ మొదలియార్ డెక్కన్ రైల్వేస్‌లో ఉద్యోగి. అతడి కుమారుడే టెన్నిస్ క్రీడాకారుడు సి.డి. వెంకట్రావ్ - ప్రస్తుతం టెన్నిస్ శిక్షకులైన నాగరాజు తండ్రి. అలా తమిళనాడు నుంచి వచ్చి తెలుగుగడ్డపై స్థిరపడినవారిలో నాలుగోతరం తనదంటారాయన. ఇంతమంది క్రీడాకారులను తయారు చేస్తున్నప్పటికీ తన కుటుంబం నుంచి టెన్నిస్ వారసులను తయారు చేయలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు. ‘‘నాకు ఒక్కతే అమ్మాయి. పేరు సాయికుమారి. నేను పొద్దున్నే గ్రౌండ్‌కి వచ్చేవాడిని. తిరిగి ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మాయి స్కూలుకెళ్ళేది. సాయంత్రం తాను ఇంటికి వచ్చేటప్పటికి నేను గ్రౌండ్‌కు రావడం, నేను ఇల్లు చేరేసరికి తను నిద్రపోవడం... తన బాల్యం దాదాపుగా ఇలాగే గడిచింది. తనకు టెన్నిస్ నేర్పించాలని నేను చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మా ఆవిడ టీచరు కావడంతోనో ఏమో మా అమ్మాయికి పుస్తకాల మీద, చదువు మీద ఆసక్తి ఎక్కువగా కనిపించింది. దాంతో తనను అలాగే కొనసాగనిచ్చాం. ఆమె ఇప్పుడు ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తూ భర్తతో కలిసి ముంబయిలో ఉంటోంది. తండ్రిగా నన్ను చాలా ప్రేమిస్తుంది కానీ, తనకు టెన్నిస్ మీద ప్రేమ కలగలేదు’’ అన్నారాయన కొంచెం బాధగా. ఇది నిరంతర సాధన! పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలంటే వారికి కనీసంగా గ్రౌండ్‌కి రాగలిగిన ఆసక్తి ఉంటే చాలు, ఆ తర్వాత వారిని చైతన్యవంతం చేసి క్రీడాస్ఫూర్తి పెంచడం పెద్ద కష్టం కాదంటారు నాగరాజు. ‘‘టెన్నిస్ సాధన ఐదేళ్ల వయసులో మొదలు పెట్టి ఇరవై రెండు - ఇరవై మూడేళ్లు వచ్చే వరకు నిరంతరాయంగా చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. పద్దెనిమిదేళ్ల ముందే ఓ కల కనాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి అంతకాలం పాటు ఓపిగ్గా శ్రమించాలి’’ అని సూచించారు నాగరాజు. ఉత్తమ శిక్షకుడిగా ‘ఫార్కుందా అలీ అవార్డు’, ‘ప్రైడ్ ఇండియా’ పురస్కారాలను అందుకున్న నాగరాజు ప్రభుత్వం సహకరించి మంచి క్రీడాప్రాంగణానికి అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. నిజమే! ద్రోణాచార్యుడైనా సరే అంత గొప్ప విలుకాళ్లను తయారు చేయగలిగాడంటే పాలకులు తగిన వనరులు కల్పించడం వల్లే సాధ్యమైంది. ఆధునిక యుగానికీ అదే వర్తిస్తుంది. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: శివ మల్లాల ‘‘తల్లిదండ్రులు కొంత ఖర్చుకు, కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. పెళ్లిళ్లు, వేడుకలంటూ సాధనకు అంతరాయం రానివ్వకూడదు. పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల ఆట కోసమే సమయాన్ని కేటాయించాలి. కోచ్ఫీజు, పిల్లల దుస్తులు, టోర్నమెంట్లకు తీసుకెళ్లే చార్జీల వంటివి కలుపుకుని నెలకు పది నుంచి పదిహేను వేల ఖర్చు ఉంటుంది. వారిని గ్రౌండ్‌కు తీసుకురావడం, సూచించిన పోషకాహారం పెట్టడం వరకు తల్లిదండ్రులు చూసుకుంటే చాలు. వారిలో ఆట పట్ల ఆసక్తిని పెంచడం, ఆడితీరాలనేటట్లు చైతన్యవంతం చేయడం వంటివన్నీ మేమే చూసుకుంటాం.’’ - కె.వి. నాగరాజు, టెన్నిస్ కోచ్ -
సెమీస్‌లో సాకేత్, విష్ణు
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్‌లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సాకేత్ 6-2, 6-3తో చంద్రిల్ సూద్ (భారత్)పై గెలుపొందగా, విష్ణువర్ధన్ 7-6(4), 6-4తో రెండో సీడ్ జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)పై అద్భుత విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్‌లో సనమ్ సింగ్ 6-1, 6-1తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్‌పై నెగ్గగా, శ్రీరామ్ బాలాజీ 6-1, 6-4తో కో సుజుకి (జపాన్)ను ఓడించి సెమీస్‌కు చేరాడు. సెమీఫైనల్లో సాకేత్.. బాలాజీతో, విష్ణు.. సనమ్సింగ్తో తలపడనున్నారు. ఇక డబుల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి టైటిల్ కోసం బాలాజీ-రంజిత్ మురుగేశన్ జంటతో అమీ తుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-7(5), 6-2 (10-7)తో విష్ణువర్ధన్-నెదున్‌చెజియాన్ జోడిపై గెలుపొందింది. బాలాజీ-మురుగేశన్ జోడి 6-4, 6-3తో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)-గాబ్రియెల్ ట్రుజిలోసోలర్ (స్పెయిన్) జంటను ఓడించింది. -
నేనున్నానని
సాలూరు, న్యూస్‌లైన్ : పట్టణంలోని డబ్బీవీధికి చెందిన యడ్ల విష్ణువర్థన్ (12) కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అరుకు పార్లమెంట్ సమన్వయకర్త కొత్తపల్లి గీత ఆదివారం రూ. 20 వేలు ఆర్థిక సహా యం అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ వీధి యువకులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను ఊరేగించి, స్థానికంగా ఉన్న చెరువులో దహన సంస్కారాలు చేస్తుండడంగా విష్ణువర్థన్ (12) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. అప్పట్లో బాలుడి కుటుంబాన్ని ఆదుకుం టామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు స్పందించారు. ఈ మేరకు ఆదివా రం ఆ బాలుడి తల్లిదండ్రులు యడ్ల శ్రీను, లక్ష్మికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి ఇద్దరి కుమార్తెలు గాయత్రి, గీత చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వారికి ప్రత్యేకంగా బ్యాంకులో అకౌంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా నేరుగా తమను కలవవచ్చునన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు బాలుడి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు సూరిబాబు, గరుడబిల్లి ప్రశాంత్‌కుమా ర్, మంచాల వెంకటరమణ, డొల బాబ్జీ, వైకుంఠపు మధు, రెడ్డి సన్యాసినాయుడు, మాజీ ఎంపీపీ తీళ్ళ సుశీల, పాల్గొన్నారు. -
గౌతమ్+నీలిమ=?!
నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్, నువ్వులేక నేను లేను చిత్రాల్లో నటించిన బాలనటుడు అమిత్ కథానాయకునిగా మారారు. ఆయన హీరోగా ‘గౌతమ్+నీలిమ=?!’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. గుజ్జల విష్ణువర్దన్ దర్శకుడు. నిస్సార్ బాషా, బి.పి.రాజు నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి వడ్డేపల్లి నరసింగరావు కెమెరా స్విచాన్ చేయగా, అస్మితాసూద్ క్లాప్ ఇచ్చారు. ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలుపెట్టి, ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి చేస్తామని ఏప్రిల్‌లో ఈ ముక్కోణపు ప్రేమకథను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. 12 ఏళ్ల క్రితం బాలనటుణ్ణి అయిన తాను, హీరోగా అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అమిత్ అన్నారు. ఇంకా కథానాయక నూర్జహాన్, రచయిత సుధీర్ పొలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత షాహీ మొహిద్దీన్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ కవల. -
బెంగళూరులో విష్ణువర్ధన్ ఫిలిం ఇన్స్టిట్యూట్
పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ తరహాలో బెంగళూరు నగరంలోని మైలసంద్రలో విష్ణువర్ధన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ను స్థాపిస్తామని నటి భారతి విష్ణువర్ధన్ తెలిపారు. నటుడు విష్ణువర్ధన్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఇక్కడి అభిమాన్ స్టూడియోలోని ఆయన సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం భారతి విష్ణువర్థన్ విలేకరులతో మాట్లాడుతూ.... విష్ణువర్ధన్ పేరిట స్టూడియో నిర్మాణానికి కర్నాటక ప్రభుత్వం మైలసంద్రలో రెండెకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు తమ కుటుంబం భాగస్వామ్యంలో ఫిలిం ఇనిస్టిట్యూట్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. మహానటుడు విష్ణువర్ధన్‌పై రాసిన పుస్తకాన్ని ఆమె ఈ సందర్భంగా ఆవిష్కరించారు. విష్ణు వర్థన్ కు నివాళులర్పించిన వారిలో మంత్రి రామలింగా రెడ్డి కూడా ఉన్నారు. -
‘ఆట ఆరంభం’ ఆడియో వేడుక
అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట పెద్ద హిట్. ఈ సినిమాను ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులోకి అనువదించారు డా. జి.శ్రీనుబాబు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. -
తెలుగులోనూ ఈ సినిమా విజయం సాధించాలి : ఏ.ఎం.రత్నం
‘‘ఈ సినిమా తమిళనాట పెద్ద హిట్. అజిత్ పిలిచి మరీ నాకీ అవకాశం ఇచ్చారు. ఆయన రుణం తీర్చుకోలేనిది’’ అని ఏ.ఎం.రత్నం అన్నారు. అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట పెద్ద హిట్. ఈ సినిమాను ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులోకి అనువదించారు డా. జి.శ్రీనుబాబు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. విష్ణువర్దన్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని శ్రీకాంత్ అడ్డాలకు అందించారు. రానా, ఆర్య ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏ.ఎం.రత్నం ఇంకా మాట్లాడుతూ -‘‘తెలుగులో మా సంస్థ నుంచి కర్తవ్యం, పెద్దరికం, స్నేహంకోసం, ఖుషి లాంటి విజయాలొచ్చాయి. తమిళంలో అయితే... మా సంస్థకు 90 శాతం విజయాలున్నాయి. నిర్మాతగా నాకు పునర్జన్మనిచ్చిందీ సినిమా. అజిత్, ఆర్య కాంబినేషన్‌ని ముందుగానే అనుకుని ఈ కథను నేను, విష్ణువర్దన్ కలిసి తయారు చేశాం. ఆర్య ఒప్పుకుంటాడో లేదో అని మీమాంసలో ఉండేవాణ్ణి. అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘రామాయణం లాంటి ఈ సినిమాలో ఆర్య లక్ష్మణుడైతే... నేను హనుమంతుణ్ణి. అజిత్‌గారైతే నిజంగా రాముడే. అంతటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. మంచి సినిమాలో నేనూ భాగం అయినందుకు ఆనందంగా ఉంది’’ అని రానా చెప్పారు. ‘‘తన సినిమాను మాకు ఇచ్చి.. మా సంస్థ మరింత ముందుకు వెళ్లడానికి సహకరించిన ఏ.ఎం.రత్నంగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అని నిర్మాత అన్నారు. మంచి కథను తెరకెక్కించాలంటే... రత్నం లాంటి నిర్మాతలు దొరకాలని, తన రిక్వెస్ట్ మీద ఇందులో ప్రత్యేక పాత్ర పోషించిన రానాకు కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. ఇంకా వి.సాగర్, బీవీఎస్ఎన్ ప్రసాద్, నల్లమలుపు శ్రీనివాస్, వి.సముద్ర, ఘంటసాల రత్నకుమార్, వీరభద్రమ్, శోభారాణి, రమేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆట ఆరంభం...
అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగిస్తోంది. ఈ చిత్రాన్ని ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత డా.శీనుబాబు.జి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తమిళనాట ఉన్న పాత రికార్డులను అధిగమిస్తూ... కొత్త రికార్డును నెలకొల్పే దశగా దూసుకుపోతోందీ సినిమా. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్.. తెలుగు ప్రేక్షకులను కూడా తప్పక అలరిస్తుందని నా నమ్మకం. విష్ణువర్దన్ టేకింగ్ ఈ సినిమాలో కొత్త పుంతలు తొక్కింది. ఈ నెల మూడోవారంలో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. మహేష్ మంజ్రేకర్, అతుల్ కులకర్ణి, అశోక్, సుమ రంగనాథన్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కెమెరా: ఓం ప్రకాష్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: ఓమిక్స్ క్రియేషన్స్. -
పోరాడి ఓడిన విష్ణు
న్యూఢిల్లీ: తొలి మూడు మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించి జోరు మీదున్న విష్ణువర్ధన్‌కు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విష్ణు 7-5, 3-6, 6-7 (4/7)తో శ్రీరామ్ బాలాజీ (భారత్) చేతిలో ఓటమి చవిచూశాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. అవకాశం దొరికినపుడల్లా బాలాజీ నెట్‌వద్దకు దూసుకొచ్చి పాయింట్లు సాధించాడు. భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరైన విష్ణు బ్యాక్‌హ్యాండ్ షాట్లు, బేస్‌లైన్ ఆటతో బాలాజీని నియంత్రించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరో సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్) 6-3, 6-1తో వీటోస్కా (జర్మనీ)పై గెలిచి శనివారం జరిగే ఫైనల్లో బాలాజీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. డబుల్స్ విభాగంలో ఏపీ ఆట గాడు అశ్విన్ విజయరాఘవన్ రన్నరప్‌గా నిలి చాడు. ఫైనల్లో అశ్విన్-రామ్‌కుమార్ (భారత్) జంట 6-7 (3/7), 3-6తో శ్రీరామ్ బాలాజీ- రంజిత్ (భారత్) జోడి చేతిలో ఓడిపోయింది. -
చలో సమైక్య శంఖారావం పోస్టర్ల విడుదల
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మైదుకూరులో శనివారం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల నిర్వహిం చే సమైక్య శంఖారావానికి సంబంధించి పోస్టర్లను డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, నేతలు కోటా నరసింహరావు, సౌది రామక్రిష్ణారెడ్డి, హరూన్ బజాజ్ డెరైక్టర్ అహ్మద్‌బాషా శుక్రవారం ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేశారని వారు అన్నారు. జిల్లా ప్రజలు షర్మిల సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీ సురేష్, రాజగోపాల్‌రెడ్డి, హమ్రాజ్, అయూబ్ పాల్గొన్నారు. కడప నియోజకవర్గం నుంచి సమైక్య శంఖారావానికి 200 వాహనాలలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారని వైఎస్ఆర్సీపీ కడప సమన్వయకర్త ఎస్బి అంజద్‌బాషా తెలిపారు.