పదేళ్ల తర్వాత... | Kotigobba 3 will see Christmas release | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత...

Mar 11 2018 1:27 AM | Updated on Mar 11 2018 1:27 AM

Kotigobba 3 will see Christmas release - Sakshi

సుదీప్‌

...కలం పట్టి కథ రాశారట హీరో సుదీప్‌. ‘కోటి గొబ్బ 3’ కోసమే ఆయన కలం పట్టారు. ‘కోటి గొబ్బ’ ఫస్ట్‌ పార్ట్‌ (2001)లో సీనియర్‌ నటుడు విష్ణువర్థన్‌ నటించారు. 2016లో వచ్చిన సెకండ్‌ పార్ట్‌లో సుదీప్‌ నటించారు. మూడో భాగంలోనూ ఆయనే హీరో. నటించడంతో పాటు కథ కూడా అందిస్తున్నారు. దాదాపు పదేళ్ల కిత్రం స్వీయదర్శకత్వంలో తాను నటించి, రూపొందించిన ‘జస్ట్‌ మాత్‌ మాతల్లి’ సినిమా కోసం కథ అందించారు సుదీప్‌.

మళ్లీ ఇన్నేళ్లకు తనలోని రచయితను బయటికి తీశారు. ‘కోటి గొబ్బ’ రెండో పార్ట్‌ను నిర్మించిన సూరపు బాబునే మూడో పార్ట్‌ను నిర్మిస్తున్నారు. శివకార్తీక్‌ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమా కోసం సుదీప్‌ భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ పుచ్చుకోనున్నారని శాండిల్‌వుడ్‌ టాక్‌. సుదీప్‌ లుక్‌ కూడా రిలీజైంది. ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. సుదీప్, సూరపు బాబు కాంబినేషన్‌లో వచ్చిన రెండో పార్ట్‌ హిట్‌ సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూడోపార్ట్‌పై అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement