పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో విష్ణు 7-6 (7/2), 6-4తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాజా వినాయక్ శర్మను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ సనమ్ సింగ్ నాలుగు మ్యాచ్ పారుుంట్లను వదులుకొని ఓటమి పాలయ్యాడు.
ఏడో సీడ్ దిమిత్రీ పోప్‌కో (కజకిస్తాన్) తో జరిగిన మ్యాచ్‌లో సనమ్ 6-3, 6-7 (6/8), 6-7 (5/7)తో ఓటమి చవిచూశాడు. తొలి సెట్ నెగ్గిన సనమ్ రెండో సెట్ టైబ్రేక్‌లో 6-2తో ఆధిక్యంలో ఉన్నాడు. అరుుతే సనమ్ వరుసగా ఆరు పారుుంట్లు కోల్పోరుు సెట్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్‌లోనూ సనమ్ టైబ్రేక్‌లో తడబడ్డాడు.
రెండో రౌండ్‌లో విష్ణు
Published Tue, Oct 25 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
Advertisement
Advertisement