ఆట ఆరంభం... | Atta Arambam in Telugu for Ajith's Arrambam | Sakshi
Sakshi News home page

ఆట ఆరంభం...

Published Sun, Nov 17 2013 12:22 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Atta Arambam in Telugu for Ajith's Arrambam

అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగిస్తోంది. ఈ చిత్రాన్ని ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత డా.శీనుబాబు.జి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తమిళనాట ఉన్న పాత రికార్డులను అధిగమిస్తూ... కొత్త రికార్డును నెలకొల్పే దశగా దూసుకుపోతోందీ సినిమా.
 
  పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్.. తెలుగు ప్రేక్షకులను కూడా తప్పక అలరిస్తుందని నా నమ్మకం. విష్ణువర్దన్ టేకింగ్ ఈ సినిమాలో కొత్త పుంతలు తొక్కింది. ఈ నెల మూడోవారంలో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. మహేష్ మంజ్రేకర్, అతుల్ కులకర్ణి, అశోక్, సుమ రంగనాథన్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కెమెరా: ఓం ప్రకాష్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: ఓమిక్స్ క్రియేషన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement