మార్చి 1న ‘విశ్వాసం’ | Ajith Kumar Viswasam In Telugu On 1st March | Sakshi
Sakshi News home page

మార్చి 1న ‘విశ్వాసం’

Published Wed, Feb 20 2019 3:22 PM | Last Updated on Wed, Feb 20 2019 3:26 PM

Ajith Kumar Viswasam In Telugu On 1st March - Sakshi

తలా అజిత్‌.. తమిళ నాట మాస్‌కు మారుపేరు. వరుస హిట్‌లతో దూసుకుపోతూ.. అజిత్‌ బాక్సాఫీస్‌ రికార్డులను క్రియేట్‌ చేస్తున్నాడు. తాజాగా సంక్రాంతి బరిలో దిగిన అజిత్‌ వసూళ్ల మోత మోగించాడు. ఇప్పటికీ అక్కడ ‘విశ్వాసం’  జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. 

తాజాగా కన్నడ వెర్షన్‌కు సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కన్నడలో ‘జగమల్ల’గా త్వరలోనే విడుదల కానుంది. ఇక తెలుగులో ఈ సినిమా మార్చి 1న విడుదల కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. రిలీజ్‌కు సంబంధించిన బిజినెస్‌ వ్యవహరమంతా చకాచకా జరుగుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నయన తార హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి ఇమ్మాన్‌ సంగీతమందించగా.. శివ దర్శకత్వం వహించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement