తమిళసినిమా: నటుడు అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారా? రాజరాజ చోళుడు పాత్రను పోషించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే రావడం విశేషం. ఇటీవల చారిత్రక కథాచిత్రాలు నడుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాలు సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయిన విషయాన్ని చూశాం. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు.
చాలా కాలం క్రితమే దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేషన్ రాజ రాజ చోళన్ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్‌తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో నటుడు అజిత్ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్ కథా చిత్రంలో నటించిన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో సల్మాన్ ఖాన్ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడుగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment