historical film
-
రాజ రాజ చోళుడిగా అజిత్?
తమిళసినిమా: నటుడు అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారా? రాజరాజ చోళుడు పాత్రను పోషించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే రావడం విశేషం. ఇటీవల చారిత్రక కథాచిత్రాలు నడుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాలు సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయిన విషయాన్ని చూశాం. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం క్రితమే దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేషన్ రాజ రాజ చోళన్ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్‌తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో నటుడు అజిత్ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్ కథా చిత్రంలో నటించిన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో సల్మాన్ ఖాన్ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడుగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
డిఫరెంట్ లుక్‌లో మోహన్‌లాల్..
తిరువనంతపురం : మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ విభిన్న నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మోహన్ లాల్ ఆధ్యాత్మిక లుక్ లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన మైండ్, శరీరం కోసం తాను డీటాక్స్ జర్నీలో ఉన్నానని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే చాలా కాలం తర్వాత అభిమాన హీరోను విభిన్నంగా చూడటం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. మోహన్ లాల్ ప్రస్తుతం చారిత్రక(హిస్టారికల్) డ్రామాగా తెరకెక్కుతున్న మరాక్కర్..అరిబికడలింటే సింహం. కోవిడ్ ప్రభావంతో ఈ సినిమా విడుదల కావడానికి మరింత సమయం పడుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా టాలీవుడ్లో యంగ్ టైగర్ హీరోగా నటించిన జనతా గ్యారేజీ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
ఝాన్సీ రాణి టైలర్
రెండు దశాబ్దాలుగా చారిత్రక చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు నీతా లుల్లా! ఖుదా గవా, చాందినీ, లమ్హే, దేవ్‌దాస్, జోధా అక్బర్.. ఇంకా ఎన్నో సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకున్నారు నీతా. 2016లో అషుతోష్ తీసిన ‘మొహెంజదారో’ చిత్రం తరవాత ఇప్పుడు ‘మణికర్ణిక’ చిత్రంలో ఝాన్సీరాణిగా నటిస్తున్న కంగనా రనౌత్‌కి డిజైనర్‌గా పని^ ó శారు. నీతా రూపొందించిన దుస్తులలో కంగనా ఝాన్సీరాణిలాగ ఎంతో సాహసోపేతంగా కనిపించడం ఇప్పటికే ట్రైలర్లలో, టీజర్లలో మీరు చూసే ఉంటారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి కంగనే డైరెక్టర్. నీతా తన టీమ్‌తో కలిసి ఝాన్సీరాణి వస్త్రాల మీద బాగా పరిశోధన చేశారు. నాలుగు మాసాల పాటు తయారు చేసిన వస్త్రాలు రాణి పాత్రకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని పరీక్షించారు. ‘‘అంతకు ముందే ఈ అంశం మీద చిత్రాలు తీద్దామనుకున్న కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. అందువల్ల ఈ చిత్రం తీసే నాటికి నాకు ఈ పాత్రకు తగ్గ ఆహార్యం మీద అవగాహన కలిగింది. మణికర్ణిక కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఫ్రెష్ మైండ్‌తో పని ప్రారంభించాను’’ అంటారు నీతా లుల్లా. గ్రంథాలయాలు, మ్యూజియమ్లు గాలించి, మణికర్ణిక వస్త్రాలకు సంబంధించిన సమాచారం సేకరించారు నీతా. అంత లోతుగా పరిశీలించడం వల్ల ఝాన్సీలక్ష్మీబాయిని ఎంత శక్తిమంతంగా చూపాలో నీతాకి అర్థమైంది. ఎక్కడెక్కడివో పెయింటింగ్స్, ఇలస్ట్రేషన్స్, ఫ్యాబ్రిక్ శాంపుల్స్ కూడ పరిశీలించారు. దానితో రాజరికాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో తెలుసుకున్నారు. సందర్భానికో వస్త్రధారణ ‘‘యుద్ధవీరురాలికి వస్త్రాలు తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ బాయి వేసిన రకరకాల వేషాలకు సంబంధించిన వస్త్రాలను డ్రామా కంపెనీల దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాను. లక్ష్మీబాయి లేదా మణికర్ణిక.. యవ్వనంలో ఉండగా ఆమెను ఒక యోధురాలిగా, పెళ్లికూతురిగా, రాణిగా, విధవరాలిగా చూపాలి. చివరగా ఆమెను ఒక విప్లవ నాయకురాలిగా చూపాలి. ప్రతి దశలోను రకరకాల రంగులను ఉపయోగించాను. తొమ్మిది గజాల ఎమరాల్డ్ గ్రీన్ చీరలో రనౌత్‌ను చూస్తుంటే పోరాటయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆకుపచ్చ రంగు సిరిసంపదలకు, విశాల హృదయానికి ప్రతీక’’ అంటారు నీతా. కంగన కూడా ఆ వస్త్రాలకు దీటైన నటన కోసం శ్రమించారు. ‘‘ఈ పాత్రకు సంబంధించి రకరకాల భావాలు ప్రదర్శించడం చాలా కష్టంగా ఉందని, కాని ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నానని కంగనా అనేవారని’’ చెబుతున్నారు నీతా. యుద్ధంలో అంగ్రఖా కుర్తా రాచరికం ప్రతిబింబించేలా హ్యాండ్‌స్పన్ ఫ్యాబ్రిక్, ఖాదీ వస్త్రాల మీద సహజ రంగులతో డిజైన్ చేశారు నీతా. రాణిగా లక్ష్మీబాయి పాత్రకు రిచ్ రెడ్ కలర్, ఆరెంజ్, గ్రీన్ రంగులను ఉపయోగించారు. ఆమెలోని విషాదాన్ని చూపడానికి లేత రంగులను ఉపయోగించారు. యుద్ధరంగంలో ఉన్న సమయంలో రనౌత్ ‘అంగ్రఖా కుర్తా’ వేసుకున్నారు. మరాఠా వీరులకు సంబంధించిన బొమ్మలను, తెల్లటి వస్త్రాల మీద బంగారు, ఎరుపు రంగులలో చిత్రించారు. కవచాన్ని లెదర్‌తో రూపొందించారు. అది కూడా చేతితో చేయించారు. కాస్ట్యూమ్స్ కోసం నీతా ఇంత కృషి చేసిన విధంగానే నగల ఎంపికకు మరో విభాగం పెద్ద అధ్యయనమే చేసింది. మణికర్ణిక మరాఠా మహారాణి కావడంతో వివాహానికి ముందు ధరించే నగల విషయంలో ప్రత్యేకత చూపారు. ముక్కుకి నత్తు, కంఠానికి తుషీ చోకర్ తయారుచేశారు. వివాహం అయ్యాక ఆవిడ కుందన్స్, ముత్యాలు ధరించేలా నగలు తయారుచేశారు. పెద్ద పాపిడి బిళ్ల, చేతులకు కంకణాలు, నెక్లేస్.. ఉపయోగించారు. వీటన్నిటినీ త్వరలోనే మనం తెర మీద కళ్లారా చూడొచ్చు. – జయంతి ఇంతలా ఎప్పుడూ శ్రమించలేదు నేను 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు చరిత్ర గురించి అస్సలు తెలియదు. సంప్రదాయ చదువుల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పటికి 100 కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చే యడం మీద నాకు ఆసక్తి ఎక్కువ. మణికర్ణికలో నేను రనౌత్‌కి చేసిన కాస్ట్యూమ్స్‌కి ఎప్పుడూ లేనంతగా శ్రమించాన. ఆమె శిరస్సు కోసం చేసిన అలంకారాలు, రనౌత్‌కు కొత్త అందాలు తీసుకువచ్చాయి. ఆవిడ జీవితంలో ఆ మేకప్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. – నీతా లుల్లా -
చాణక్యుడి పాత్రలో స్టార్ హీరో
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో హిస్టారికల్, ఫోక్లోర్ సినిమాల హవా కనిపిస్తోంది. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల పద్మావత్ సినిమా ఘనవిజయం సాధించగా ప్రస్తుతం మణికర్ణిక చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా మరో చారిత్రక పాత్రను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. చరిత్రలో ఎంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, గురువు, ఆర్థిక నిపుణుడు అయిన చాణక్యుడి కథను వెండితెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ టైటిల్ రోల్ లో నటించేందుకు అంగీకరించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాస్ సి స్టూడియోస్ బ్యానర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
150 కోట్ల సినిమాలో...
వరుస విజయాలతో రేసుగుర్రంలా దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ‘ప్రేమమ్’ వంటి క్యూట్ లవ్‌ప్టోరీ, ‘సింగమ్ 3’ వంటి మాస్ కమర్షియల్ మూవీ.. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసి, మెప్పించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో శ్రుతీకి ఛాన్స్ దక్కిందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’లో శ్రుతి ఓ హీరోయిన్గా ఎంపికయ్యారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఈ సినిమా కోసం పలువురు కథానాయికలను దర్శకుడు సంప్రదించినా, చివరికి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో శ్రుతి మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. హిందీలో అక్కడి నటీనటులతో తీయాలనుకుంటున్నారని వినికిడి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు.