డిఫరెంట్‌ లుక్‌లో మోహన్‌లాల్‌.. | Mollywood Megastar Mohanlal In Different Look | Sakshi
Sakshi News home page

డిఫరెంట్‌ లుక్‌లో మోహన్‌లాల్‌..

Sep 19 2020 10:01 PM | Updated on Sep 19 2020 10:02 PM

Mollywood Megastar Mohanlal In Different Look - Sakshi

తిరువనంతపురం : మాలీవుడ్ మెగాస్టార్ మోహ‌న్ లాల్ విభిన్న నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మోహ‌న్ లాల్ ఆధ్యాత్మిక ​లుక్ లో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. త‌న మైండ్‌, శ‌రీరం కోసం తాను డీటాక్స్ జ‌ర్నీలో ఉన్నాన‌ని క్యాప్ష‌న్ ఇచ్చాడు. అయితే చాలా కాలం త‌ర్వాత అభిమాన హీరోను విభిన్నంగా చూడ‌టం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.

మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం చారిత్రక(హిస్టారికల్‌) డ్రామాగా తెర‌కెక్కుతున్న మ‌రాక్క‌ర్..అరిబిక‌డ‌లింటే సింహం. కోవిడ్ ప్రభావంతో ఈ సినిమా విడుదల కావడానికి మరింత సమయం పడుతుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. కాగా టాలీవుడ్‌లో యంగ్‌ టైగర్‌ హీరోగా నటించిన జనతా గ్యారేజీ సినిమాలో మోహ‌న్ లాల్ కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement