150 కోట్ల సినిమాలో... | sruthihasan in historic film | Sakshi
Sakshi News home page

150 కోట్ల సినిమాలో...

Published Thu, Feb 16 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

150 కోట్ల సినిమాలో...

150 కోట్ల సినిమాలో...

వరుస విజయాలతో రేసుగుర్రంలా దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్‌. ఇటీవల ‘ప్రేమమ్‌’ వంటి క్యూట్‌ లవ్‌ప్టోరీ, ‘సింగమ్‌ 3’ వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీ.. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసి, మెప్పించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో శ్రుతీకి ఛాన్స్‌ దక్కిందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌.సి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’లో శ్రుతి ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారని చెన్నై కోడంబాక్కమ్‌ టాక్‌. 

ఈ సినిమా కోసం పలువురు కథానాయికలను దర్శకుడు సంప్రదించినా, చివరికి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో శ్రుతి మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. హిందీలో అక్కడి నటీనటులతో తీయాలనుకుంటున్నారని వినికిడి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందించనున్నారు. త్వరలోనే షూటింగ్‌ ఆరంభం కానుంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement