
సంఘమిత్ర కోసం రెండేళ్లు
‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఐదేళ్లు రాసిచ్చారు. ఈ టైమ్‌లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... ‘బాహుబలి’ స్థాయిలో ‘సంఘమిత్ర’ సినిమాను తీయాలని తమిళ దర్శకుడు సుందర్ .సి సంకల్పించిన సంగతి తెలిసిందే.
‘సంఘమిత్ర’లో ఓ హీరోగా నటించనున్న ‘జయం’ రవి తన రెండేళ్ల కాల్‌షీట్స్‌ను ఈ సినిమాకు రాసిచ్చారట! ‘బాహుబలి’ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఐదేళ్లు పడుతుందని ఎవరూ అనుకోలేదు. ‘సంఘమిత్ర’కు ‘జయం’ రవి రెండేళ్లు కేటాయించారు. సినిమా పూర్తయ్యే సరికి ఎన్ని రోజులు పడుతుందో! ఇందులో ఆర్య మరో హీరోగా నటించనున్నారు.