అదితి శంకర్‌ కొత్త సినిమా.. షూటింగ్‌ పూర్తి! | Akash Murali, Vishnu Vishal, Aditi Shankar Movie Shoot Wrapped | Sakshi
Sakshi News home page

Akash Murali: దివంగత నటుడి తనయుడు హీరోగా కొత్త సినిమా.. హీరోయిన్‌గా అదితి..

Published Sun, Feb 11 2024 12:25 PM | Last Updated on Sun, Feb 11 2024 12:43 PM

Akash Murali, Vishnu Vishal, Aditi Shankar Movie Shoot Wrapped - Sakshi

దర్శకుడు విష్ణు వర్ధన్‌ పేరు చెప్పగానే పట్టియల్‌, బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆమధ్య బాలీవుడ్‌ వెళ్లి పేర్షా సినిమాను డైరెక్ట్‌ చేయగా ఈ మూవీ ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఇతడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం విష్ణువర్ధన్‌కు బాలీవుడ్‌లో మరింత గుర్తింపును తీసుకురానుందట. తాజాగా ఈయన కోలీవుడ్‌పై దృష్టి సారించారు. దివంగత నటుడు మురళి వారసుడు ఆకాష్‌ మురళిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఎక్స్‌ బీ ఫిలిమ్స్‌ పతాకంపై సేవియర్‌ బిట్టో నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సంస్థ ఇంతకుముందు విజయ్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన మాస్టర్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని నిర్మించింది. ఇక లేటెస్ట్‌ మూవీలో ఆకాష్‌ మురళి సరసన దర్శకుడు శంకర్‌ కూతురు అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించటం విశేషం. ఇందులో నటుడు శాంతకుమార్‌, ప్రభు గణేశన్‌, నటి కుష్భు సుందర్‌, కల్కి కొచ్లిన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ మనసులను హత్తుకునే రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందని చిత్రయూనిట్‌ పేర్కొంది.

ఈ చిత్ర షూటింగ్‌ పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాల్లోని అందమైన నగరాలతో పాటు ఇండియాలోని బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారని, ఇంతకు ముందు దర్శకుడు విష్ణు వర్ధన్‌ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా కాంబోలో రూపొందిన చిత్రాల్లోని పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయని, అదే కోవలో సంగీత ప్రియులను ఈ చిత్రం అలరిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

చదవండి: ఫైనల్లీ గుడ్‌న్యూస్‌ చెప్పిన సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement