విష్ణువర్ధన్
చెన్నై: హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. శ్రీరామ్ బాలాజీతో జతకట్టిన విష్ణు సెమీస్‌లో 6–3, 7–5తో సాకేత్ మైనేని (భారత్)– లుకా మార్గరొలి (స్విట్జర్లాండ్) ద్వయంపై గెలుపొందాడు.
ఫైనల్లో విష్ణు–శ్రీరామ్ జంట సెమ్ లకెల్(టర్కీ)–పెట్రోవిచ్ (సెర్బియా) జోడీతో తలపడుతుంది. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 111 ర్యాంకర్ యూకీ 5–7, 6–2, 6–4తో యసుటక ఉచియమ (జపాన్)పై నెగ్గాడు. సెమీస్‌లో అతను మూడో సీడ్ డుకీ లీ (కొరియా)తో ఢీకొంటాడు.
Comments
Please login to add a commentAdd a comment