tenis
-
‘అమ్మ’యినా... సాగిపోవచ్చు!
పెర్త్: అమ్మంటే అనుబంధం... అమ్మయితే ఆనందం... పనిచేసే మహిళలు అమ్మ హోదా వచ్చాక బిడ్డను చూసుకునేందుకు ఇంటి వద్దే ఆగిపోకుండా తమ వృత్తిగత జీవితంలో ముందుకు సాగిపోతున్నారని... రెంటికి న్యాయం చేస్తున్న అలాంటి తల్లులే నాకు స్ఫూర్తి అంటోంది అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. మంగళవారం హాప్‌మన్ కప్ టీమ్ ఈవెంట్లో స్విట్జర్లాండ్ జట్టుతో తలపడే ముందు ఆమె తన గారాలపట్టి ఒలింపియాను భుజంపై ఎత్తుకునే వార్మప్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పెట్టింది. దీనికి స్ఫూర్తిదాయక సందేశాన్ని జతచేసింది. ‘మాతృమూర్తులకు ఏదైనా సాధ్య మే. అమ్మతనానికి అడ్డువుండదు. నేనైతే కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నా. నా చిట్టితల్లి మాత్రం నా ఒడిలోనే నిద్రపోతోంది. అలాగని కసరత్తు ఆపలేను. కుమార్తెనూ దించలేను. ఈ విషయంలో పనిచేసే తల్లిదండ్రులే నాకు ప్రేరణ. చంటిబిడ్డల తల్లులు చేస్తున్న ఉద్యోగాలు... పడుతున్న కష్టాలు విన్నప్పుడు, చదివినపుడు నేను కూడా అలా చేయగలను అనిపించింది. ఇలా వారు జీవితంలో చేస్తున్న పోరాటానికి నా వందనం’ అని సెరెనా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. -
సానియా ‘తల్లి లాలన’...
ఏస్‌లు, సర్వీస్లే కాదు తనకు ‘శిశు’లాలనా తెలుసంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. తన ముద్దుగారే కుమారుడు ఇజ్హాన్ను మురిపెంగా చూసుకుంటున్న ఈ ఫొటోను కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ట్విట్టర్లో షేర్ చేసింది. పక్కనే ఎంచక్కా కునుకు తీస్తున్న భర్త షోయబ్ మాలిక్లాగే తనకూ నిద్రపోవాలని ఉన్నా... మాతృత్వపు మధురిమల్లో మునిగితేలుతున్నానని చెప్పింది. -
స్పోర్ట్స్ క్యాలెండర్ 2019
గతేడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలను అధిరోహించింది. క్రికెట్లోనే కాకుండా ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్... ఒకటేంటి బరిలోకి దిగిన ప్రతీ అంతర్జాతీయ ఈవెంట్లో మనోళ్లు మెరిపించారు. మెగా టోర్నీల పరంగా గత సంవత్సరం ఫుట్‌బాల్ ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, యూత్ ఒలింపిక్స్... ఇతర క్రీడాంశాల్లో ప్రపంచకప్‌లతో ఏడాది పొడవునా సందడి నెలకొంది.ఇదే ఊపును కొనసాగించేందుకు 2019 కూడా సిద్ధమవుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో భారత్‌కు పతకావకాశాలు ఉన్న ఈవెంట్స్‌లో సన్నాహాలు మొదలుకానున్నాయి. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌నకు ఆతిథ్య మిచ్చేందుకు ఇంగ్లండ్ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ప్రధాన ఈవెంట్స్‌తో కూడిన స్పోర్ట్స్ క్యాలెండర్ మీ కోసం... క్రికెట్ ►జనవరి 3–7: భారత్ గీ ఆస్ట్రేలియా, నాలుగో టెస్టు (సిడ్నీ) ►జనవరి 12: భారత్ గీ ఆస్ట్రేలియా, తొలి వన్డే (సిడ్నీ) ►జనవరి 15: భారత్ గీ ఆస్ట్రేలియా, రెండో వన్డే (అడిలైడ్) ►జనవరి 18: భారత్ గీ ఆస్ట్రేలియా, మూడో వన్డే (మెల్బోర్న్) ►జనవరి 23: భారత్ గీ న్యూజిలాండ్, తొలి వన్డే (నేపియర్) ►జనవరి 26: భారత్ గీ న్యూజిలాండ్, రెండో వన్డే (మౌంట్ మాంగనీ) ►జనవరి 28: భారత్ గీ న్యూజిలాండ్, మూడో వన్డే (మౌంట్ మాంగనీ) ►జనవరి 31: భారత్ గీ న్యూజిలాండ్, నాలుగో వన్డే (హామిల్టన్) ►ఫిబ్రవరి 3: భారత్ గీ న్యూజిలాండ్, ఐదో వన్డే (వెల్లింగ్టన్) ►ఫిబ్రవరి 6: భారత్ గీ న్యూజిలాండ్, తొలి టి20 (వెల్లింగ్టన్) ►ఫిబ్రవరి 8: భారత్ గీ న్యూజిలాండ్, రెండో టి20 (ఆక్లాండ్) ►ఫిబ్రవరి 10: భారత్ గీ న్యూజిలాండ్, మూడో టి20 (హామిల్టన్) ►ఫిబ్రవరి 24: భారత్ గీ ఆస్ట్రేలియా,తొలి వన్డే (మొహాలి) ►ఫిబ్రవరి 27: భారత్ గీ ఆస్ట్రేలియా, రెండో వన్డే (హైదరాబాద్) ►మార్చి 2: భారత్ గీ ఆస్ట్రేలియా, మూడో వన్డే (నాగ్‌పూర్) ►మార్చి 5: భారత్ గీ ఆస్ట్రేలియా, నాలుగో వన్డే (ఢిల్లీ) ►మార్చి 8: భారత్ గీ ఆస్ట్రేలియా, ఐదో వన్డే (రాంచీ) ►మార్చి 10: భారత్ గీ ఆస్ట్రేలియా, తొలి టి20 (బెంగళూరు) ►మార్చి 13: భారత్ గీ ఆస్ట్రేలియా, రెండో టి20 (వైజాగ్) ►మార్చి–ఏప్రిల్: భారత్‌లో జింబాబ్వే పర్యటన (టెస్టు, మూడు వన్డేలు) ►జూలై–ఆగస్టు: వెస్టిండీస్‌లో భారత్ పర్యటన (2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు) ►అక్టోబర్: భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన (3 టెస్టులు) ►నవంబర్: భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన (2 టెస్టులు, 3 టి20లు) ►డిసెంబర్: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) బ్యాడ్మింటన్ ►జనవరి 13: పీబీఎల్ ఫైనల్ (బెంగళూరు) ►జనవరి 15–20: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (కౌలాలంపూర్) ►జనవరి 22–27: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (జకార్తా) ►మార్చి 6–10: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–1000 టోర్నీ (బర్మింగ్‌హామ్) ►మార్చి 26–31: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (న్యూఢిల్లీ) ఏప్రిల్ 2–7: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (కౌలాలంపూర్) ►ఏప్రిల్ 9–14: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (సింగపూర్) ►మే 19–26: సుదిర్మన్ కప్ ►(గ్రేడ్–1 టీమ్ టోర్నీ; నానింగ్, చైనా) ►జూలై 16–21: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–1000 టోర్నీ (జకార్తా) ►జూలై 23–28: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (టోక్యో) ►జూలై 30–ఆగస్టు 4: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (బ్యాంకాక్) ►ఆగస్టు 19–25: ప్రపంచ చాంపియన్‌షిప్ ►(గ్రేడ్–1 టోర్నీ; బాసెల్, స్విట్జర్లాండ్) ►సెప్టెంబర్ 17–22: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–1000 టోర్నీ (చాంగ్జౌ) ►సెప్టెంబర్ 24–29: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (సియోల్) ►అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (ఒడెన్స్) ►అక్టోబర్ 22–27: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (పారిస్) ►నవంబర్ 12–17: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (హాంకా>ంగ్) ►నవంబర్ 5–10: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (ఫుజౌ) ►డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (గ్వాంగ్జౌ) టెన్నిస్ ►జనవరి 14–27: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►ఫిబ్రవరి 1–2: డేవిస్ కప్ ►క్వాలిఫయర్స్ ►మార్చి 3–17: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ►సిరీస్–1000 టోర్నీ ►మార్చి 20–31: మయామి ఓపెన్ మాస్టర్స్ ►సిరీస్–1000 టోర్నీ ►ఏప్రిల్ 4–5: డేవిస్ కప్ గ్రూప్–2 మ్యాచ్‌లు ►ఏప్రిల్ 14–21: మోంటెకార్లో ఓపెన్ ►మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 5–12: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 12–19: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ►ఆగస్టు 5–11: మాంట్రియల్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఆగస్టు 11–18: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ►సెప్టెంబర్ 13–15: డేవిస్ కప్ గ్రూప్–1, 2 మ్యాచ్‌లు ►అక్టోబర్ 6–13: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►అక్టోబర్ 28–నవంబర్ 3: పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ (సీజన్ ముగింపు టోర్నీ) ►నవంబర్ 18–24: డేవిస్ కప్ ఫైనల్ ఫార్ములావన్ ►మార్చి 17: ఆస్ట్రేలియా ►గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) ►మార్చి 31: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ►ఏప్రిల్ 14: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ►ఏప్రిల్ 28: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) ►మే 12: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) ►మే 26: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) ►జూన్ 9: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) ►జూన్ 23: ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి (మార్సెలి) ►జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్బెర్గ్) ►జూలై 14: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) ►జూలై 28: జర్మనీ గ్రాండ్‌ప్రి (హాకెన్‌హీమ్) ►ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ►సెప్టెంబర్ 1: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) ►సెప్టెంబర్ 8: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) ►సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్‌ప్రి (సింగపూర్ సిటీ) ►సెప్టెంబర్ 29: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి) ►అక్టోబర్ 13: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) ►అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) ►నవంబర్ 3: యూఎస్ గ్రాండ్‌ప్రి (టెక్సాస్) ►నవంబర్ 17: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) ►డిసెంబర్ 1: అబుదాబి గ్రాండ్‌ప్రి (అబుదాబి) చెస్ ►జనవరి 9–16: ఢిల్లీ ఓపెన్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ ►ఏప్రిల్ 1–10: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (శ్రీలంక) ►సెప్టెంబర్ 9–అక్టోబర్ 2: వరల్డ్ కప్ ►అక్టోబర్ 1–13: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (నాగ్‌పూర్) ►అక్టోబర్ 14–26: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ) ఆర్చరీ ►ఏప్రిల్ 22–28: వరల్డ్ కప్ స్టేజ్–1 (కొలంబియా) ►మే 6–12: వరల్డ్ కప్ స్టేజ్–2 (చైనా) ►మే 20–26: వరల్డ్ కప్ స్టేజ్–3 (టర్కీ) ►జూన్ 10–16: ప్రపంచ చాంపియన్‌షిప్ (నెదర్లాండ్స్) ►జూలై 1–7: వరల్డ్ కప్ స్టేజ్–4 (జర్మనీ) హాకీ ►జూన్ 6–16: అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల సిరీస్ ఫైనల్ టోర్నీ (భారత్) ►జూన్ 15–23: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ►(ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్ టోర్నీ (జపాన్) ఫుట్‌బాల్ ►జనవరి 5–ఫిబ్రవరి 1: ►ఆసియా కప్ (యూఏఈ) ►మే 23–జూన్ 15: వరల్డ్ కప్ అండర్–20 టోర్నీ (పోలాండ్) ►జూన్ 7–జూలై 7: మహిళల వరల్డ్ కప్ (ఫ్రాన్స్) ►జూన్ 14–జూలై 7: కోపా అమెరికా కప్ (బ్రెజిల్) ►జూన్ 15–జూలై 13: ఆఫ్రికా నేషన్స్ కప్ (కామెరూన్) ►అక్టోబర్ 5–27: వరల్డ్ కప్ అండర్–17 టోర్నీ (పెరూ) అథ్లెటిక్స్ జనవరి 20: ముంబై మారథాన్ ►మార్చి 17: ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ (జపాన్) ►మార్చి 30: వరల్డ్ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్ (డెన్మార్క్) ►ఏప్రిల్ 15: బోస్టన్ మారథాన్ ►ఏప్రిల్ 28: లండన్ మారథాన్ ►మే 3: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) ►మే 18: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) ►మే 30: డైమండ్ లీగ్ మీట్–3 (స్టాక్‌హోమ్) ►జూన్ 6: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) ►జూన్ 13: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో) ►జూన్ 16: డైమండ్ లీగ్ మీట్–6 (మొరాకో) ►జూన్ 30: డైమండ్ లీగ్ మీట్–7 (అమెరికా) ►జూలై 5: డైమండ్ లీగ్ మీట్–8 (స్విట్జర్లాండ్) ►జూలై 12: డైమండ్ లీగ్ మీట్–9 (మొనాకో) ►జూలై 20: డైమండ్ లీగ్ మీట్–10 (లండన్) ►ఆగస్టు 18: డైమండ్ లీగ్ మీట్–11 (బర్మింగ్‌హామ్) ►ఆగస్టు 24: డైమండ్ లీగ్ మీట్–12 (పారిస్) ►ఆగస్టు 29: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిక్) ►సెప్టెంబర్ 6: డైమండ్ లీగ్ మీట్–14 (బెల్జియం) ►సెప్టెంబర్ 27–అక్టోబర్ 6: ప్రపంచ చాంపియన్‌షిప్ (దోహా) టేబుల్ టెన్నిస్ ►ఏప్రిల్ 5–7: ►ఆసియా కప్ (జపాన్) ►ఏప్రిల్ 21–28: ప్రపంచ సీనియర్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ (హంగేరి) ►సెప్టెంబర్ 2–7: ఆసియా జూనియర్ ►చాంపియన్‌షిప్ (మంగోలియా) ►సెప్టెంబర్ 17–22: ఆసియా ►సీనియర్ చాంపియన్‌షిప్ (ఇండోనేసియా) ►నవంబర్ 24–డిసెంబర్ 1: ప్రపంచ జూనియర్ ►చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్) రెజ్లింగ్ ►జనవరి 23–26: ►డేవ్ షుల్జ్ స్మారక టోర్నీ (కొలరాడో స్ప్రింగ్స్, అమెరికా) ►ఏప్రిల్ 23–28: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (చైనా) ►జూలై 9–14: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (లెబనాన్) ►ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఎస్తోనియా) ►సెప్టెంబర్ 14–22: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (కజకిస్తాన్) ►అక్టోబర్ 28–నవంబర్ 3: ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్ (హంగేరి) వెయిట్‌లిఫ్టింగ్ ►మార్చి 8–15: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (అమెరికా) ►ఏప్రిల్ 20–30: ఆసియా చాంపియన్‌షిప్ (చైనా) ►జూన్ 1–8: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఫిజీ) ►జూలై 9–14: కామన్వెల్త్ జూనియర్, యూత్, సీనియర్ చాంపియన్‌షిప్ (సమోవా) ►సెప్టెంబర్ 18–27: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్) ►అక్టోబర్ 20–27: ఆసియా జూనియర్, యూత్ చాంపియన్‌షిప్ (ఉత్తర కొరియా) షూటింగ్ ►ఫిబ్రవరి 20–28: వరల్డ్ కప్ రైఫిల్, స్టల్ (న్యూఢిల్లీ) ►మార్చి 15–26: వరల్డ్ కప్ షాట్‌గన్ (మెక్సికో) ►ఏప్రిల్ 5–16: వరల్డ్ కప్ షాట్‌గన్ (యూఏఈ) ►ఏప్రిల్ 21–29: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (చైనా) ►మే 7–18: వరల్డ్ కప్ షాట్‌గన్ (కొరియా) ►మే 24–31: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (జర్మనీ) ►జూన్ 30–జూలై 10: ప్రపంచ షాట్‌గన్ చాంపియన్‌షిప్ (ఇటలీ) ►ఆగస్టు 13–23: వరల్డ్ కప్ షాట్‌గన్ (ఫిన్లాండ్) ►ఆగస్టు 26–సెప్టెంబర్ 3: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (బ్రెజిల్) ►అక్టోబర్ 8–15: వరల్డ్ కప్ ఫైనల్స్ షాట్‌గన్ (యూఏఈ) -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. గతంలో నిషిమోటోతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన శ్రీకాంత్ ఈసారి మాత్రం 44 నిమిషాల్లో చేతులెత్తేశాడు. ఈ ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్స్ కాకుండా వరల్డ్ టూర్ సర్క్యూట్‌కు చెందిన పది టోర్నమెంట్లలో పాల్గొన్న శ్రీకాంత్ రెండింటిలో మాత్రం సెమీఫైనల్‌కు చేరుకొని, మిగతా ఎనిమిది టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయాడు. మరోవైపు రెండేళ్ల క్రితం ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ప్లేయర్ సమీర్ వర్మ ఈసారి నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 15–21, 21–19, 11–21తో లీ చెయుక్ యుయి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. -
ఫెడరర్‌కు చుక్కెదురు
లండన్: కెరీర్లో వందో టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశిస్తున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు సీజన్ చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుభారంభం లభించలేదు. ‘లీటన్ హెవిట్ గ్రూప్’లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–7 (4/7), 3–6తో కీ నిషికోరి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్లో ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నిషికోరి పైచేయి సాధించి తొలి సెట్ గెల్చుకున్నాడు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ వెంటనే తన సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఆరో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన నిషికోరి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 7–6 (12/10)తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. గతంలో రికార్డుస్థాయిలో ఆరుసార్లు సీజన్ ముగింపు టోర్నీ టైటిల్ నెగ్గిన ఫెడరర్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే డొమినిక్ థీమ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. -
సొంతగడ్డపై తొలి టైటిల్‌కు విజయం దూరంలో...
మహిళల టెన్నిస్‌లో కొత్త కెరటం నయోమి ఒసాకా (జపాన్) స్వదేశంలో తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచింది. టోక్యోలో జరుగుతోన్న పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్లో ఆమె ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఒసాకా 6–2, 6–3తో కామిలా గియోర్గి (ఇటలీ)పై గెలిచింది. నేడు జరిగే తుది పోరులో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. ఇటీవలే యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించిన ఒసాకా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. -
ఒలింపియన్ అంకితపై శైలు సంచలన విజయం
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శైలు నూర్‌బాషా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 11–8, 11–7, 12–14, 6–11, 11–8, 11–9తో అంకిత దాస్ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. బెంగాల్‌కు చెందిన అంకిత 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అయితే శైలు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. సుతీర్థతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 7–11, 4–11, 8–11తో పరాజయం పాలైంది. ఆర్బీఐ తరఫున పోటీపడిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో... ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
చరిత్రకు చేరువలో...
ఒకరేమో దిగ్గజం... మరొకరేమో అనామకురాలు... ఒకరి ఖాతాలో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ఉంటే... మరొకరికి కెరీర్లోనే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఒకరు గెలిస్తే అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సమమవుతుంది... మరొకరు నెగ్గితే తమ దేశం తరఫున తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖిస్తుంది. ఎవరు విజయం సాధించినా నయా చరిత్ర నమోదయ్యే నేపథ్యంలో... అపార అనుభవజ్ఞురాలు సెరెనా విలియమ్స్... జపాన్ యువ సంచలనం నయోమి ఒసాకా మధ్య యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్: ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పట్టుదలతో ఆడిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొమ్మిదోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 17వ సీడ్ సెరెనా 6–3, 6–0తో 19వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించి జపాన్ అమ్మాయి నయోమి ఒసాకాతో నేడు జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. 66 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో సెరెనాకు ఆరంభంలో కాస్త పోటీ లభించింది. కానీ ఒక్కసారి సెరెనా లయలోకి వచ్చాక ప్రత్యర్థి చేతులెత్తేసింది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి... తన సర్వీస్‌నూ కాపాడుకున్న సెవస్తోవా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే పుంజుకున్న సెరెనా మూడో గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకొని, నాలుగో గేమ్‌లో సెవస్తోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి సెవస్తోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో సెరెనా మరింత జోరు పెంచగా... సెవస్తోవా డీలా పడిపోయింది. నెట్ వద్దకు 14సార్లు దూసుకొచ్చిన సెరెనా 11సార్లు పాయింట్లు సాధించింది. 16 విన్నర్స్ కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. ఈ గెలుపుతో 36 ఏళ్ల సెరెనా 31వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. తుది పోరులో గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24) పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేస్తుంది. దాంతోపాటు ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా ఏడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖిస్తుంది. ప్రస్తుతం క్రిస్ ఎవర్ట్ (6 సార్లు)తో సెరెనా సమఉజ్జీగా ఉంది. ‘ఇదంతా అద్భుతంలా అనిపిస్తోంది. ఏడాది క్రితం పాపకు జన్మనిచ్చే సమయంలో మృత్యువుతో పోరాడాను. సంవత్సరం తిరిగేలోపే వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుబోతున్నాను.ఈ ఏడాది మార్చిలో ఒసాకాతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఆమె చేతిలో ఓడిపోయాను. కానీ నేనప్పుడు పూర్తి ఫామ్‌లో లేను’’ అని సెరెనా వ్యాఖ్యానించింది. 13 బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... మరో సెమీఫైనల్లో 20 ఏళ్ల నయోమి ఒసాకా 6–2, 6–4తో 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై విజయం సాధించింది. ఈ విజయంతో ఒసాకా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా ఏకంగా 13 సార్లు బ్రేక్ పాయింట్స్‌ను కాపాడుకోవడం విశేషం. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 13 బ్రేక్ పాయింట్లు ఎలా కాపాడుకున్నారని విజయానంతరం ఒసాకాను ప్రశ్నించగా... సెరెనాతో ఎలాగైనా ఫైనల్ ఆడాలనే ఆలోచనే వాటిని కాపాడుకునేలా చేసిందని సమాధానం ఇచ్చింది. 1997 అక్టోబర్ 16న జపాన్‌లో జన్మించిన నయోమి ఒసాకా మూడేళ్ల వయసులో వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. ► రాత్రి గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
నాదల్ నిలిచాడు
రాఫెల్ నాదల్ ్ఠ డొమినిక్ థీమ్మ్యాచ్ చూసిన వాళ్లకిది ఆటగాఅనిపించలేదంటే నమ్మాల్సిందే!ఆటగాళ్లు రాకెట్లతోనే పోరాడారంటేఅనుమానించాల్సిందే! ఇందులో విజేత ఒకరే అంటే తప్పనాల్సిందే! ఈ పోరాటంలో ఓడింది... చెమటే అంటే ఔనాల్సిందే!అవును. ఇది నిజం. ఆట కాదది యుద్ధం. అవి రాకెట్లు కాదు ఆయుధాలే.ఒకరు కాదు ఐదు గంటలాడిన ఇద్దరూ విజేతలే. థీమ్ పరాజిత కానేకాదు. పోరాడి ఓడినా కచ్చితంగా విజయుడే...థీమ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ చావే తప్పించుకున్నాడు... అంతే! కానీ కన్నులొట్టబోయింది. ఈ శ్రమైక సమరంలో చివరకు కొన ఊపిరితో బయటబట్టాడు నాదల్. ప్రత్యర్థి థీమ్ ఒక్క ఫలితంలోనే వెనుకబడ్డాడు. అరివీర పరాజయుడుగా నిలిచాడు. ఔరా... యూఎస్ ఓపెన్ క్వార్టర్స్. న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరాడు. డొమినిక్ థీమ్ చివరకు ఫలితంలో ఓడినా మనసుల్ని గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో పాటు డెల్‌పొట్రో కూడా విజయం సాధించగా... మహిళల సింగిల్స్‌లో సెరెనా ట్రాక్‌లోకి వచ్చింది. సెమీస్‌లోకి అడుగు పెట్టిన ఆమె... అమ్మతనంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడేందుకు మరింత చేరువగా వచ్చింది. సరైనోడికి ‘సారీ’... స్పెయిన్ స్టార్, టాప్ సీడ్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్‌లో అసాధారణ రికార్డు ఉంది. అందుకే సరిలేరు నీకెవ్వరని కీర్తిస్తాం. కానీ అలాంటి యోధుడికి ఈ యూఎస్ ఓపెన్‌లో సరైనోడు ఎదురుపడ్డాడు. ఎంతకీ తగ్గలేదు. ఎందాకైనా పోరాడాడు. ఓ దశలో ప్రేక్షకులకు ఈ మ్యాచ్ ముగించేది ఎవరనే అనుమానం వచ్చేసింది. చివరకు 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సుదీర్ఘ క్వార్టర్ ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 0–6, 6–4, 7–5, 6–7 (4/7), 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలిచాననిపించాడు. ఇక్కడ ఫలితం ప్రకారమైతే విజేత ఒక్కరే కానీ పోరాటాన్ని పరిశీలిస్తే కచ్చితంగా ఇద్దరనే అనిపిస్తుంది. మండే ఎండ సెగలకు హేమాహేమీలైన ఆటగాళ్లే బిత్తరపోతుంటే... వీళ్లిద్దరి హోరాహోరీకి ఆ సెగలే సలామ్ అన్నాయి. ఇద్దరు నాలుగేసి డబుల్ ఫాల్ట్‌లు చేశారు. కానీ ఆస్ట్రియన్ ఏస్‌లతో చెలరేగిపోయాడు. ఏకంగా 18 ఏస్‌లను సంధించగా, నాదల్ మూడు ఏస్‌లకే పరిమితమయ్యాడు. స్పెయిన్ స్టార్ 55 విన్నర్లు కొడితే, థీమ్ 74 కొట్టాడు. ఇలా ఎందులోనూ తగ్గకుండా కడదాకా పోరాడాడు. దీంతో మొదటి సెట్లో నాదల్ ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయాడు. కాస్త తేరుకొని రెండో సెట్‌ను, తర్వాత మూడో సెట్‌ను కష్టంగా గెలుచుకున్నాడు. ఇక మ్యాచ్ చేతుల్లోకి వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఆట కాస్తా ‘హాట్’అయింది. ప్రతీ పాయింట్ ఓ వేటయ్యింది. ఇద్దరి పోరాటం ఎంతకీ తగ్గకపోవడంతో ఆ తర్వాతి రెండు సెట్లు టైబ్రేక్‌కు దారి తీశాయి. ఈ టైబ్రేక్‌లు కూడా సమవుజ్జీలకు సమ న్యాయం చేశాయి. ఇద్దరూ చెరొకటి గెలిచారు. నాలుగో సెట్‌ను 7/6 (7/4)తో థీమ్ కైవసం చేసుకుంటే... నిర్ణాయక సెట్‌ను 7–6 (7/5)తో నాదల్ చేజిక్కించుకున్నాడు. అప్పటికే ఇద్దరు డ్రెస్‌పైనే చెమటస్నానం చేశారు. సరైనోడికి ‘సారీ’ చెబుతూ నాదల్ అతని వెన్నుతడితే... ప్రేక్షకుల చప్పట్ల మధ్య థీమ్ నిష్క్రమించాడు. -
వొజ్నియాకి నిష్క్రమణ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే టాప్ సీడ్ హలెప్ ఇంటిముఖం పట్టగా... ఆమె సరసన రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), 11వ సీడ్ కసత్కినా (రష్యా) చేరారు. ఉక్రెయిన్ అమ్మాయి లెసియా సురెంకోతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి 4–6, 2–6తో... సస్నోవిచ్ (బెలారస్)తో జరిగిన మ్యాచ్‌లో కసత్కినా 2–6, 6–7 (3/7)తో ఓడిపోయారు. సురెంకతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి మూడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 35 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ షరపోవా (రష్యా), నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు.పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–5, 6–4, 6–4తో పెయిర్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–3, 6–7 (2/7), 6–2తో సాండ్‌గ్రెన్ (అమెరికా)పై, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 6–2తో మహుట్ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. పేస్ జంట పరాజయం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)–సెరెటాని (అమెరికా) జంట 3–6, 4–6తో చార్డీ–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో... జీవన్–ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) ద్వయం 3–6, 2–6తో కబాల్–ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్ శరణ్–సితాక్ (న్యూజిలాండ్) జోడీ 6–4, 6–4తో రెడికి–జు (అమెరికా) జంటపై గెలిచింది. -
జొకోవిచ్ చేతికి ‘నవరత్నాలు’
సిన్సినాటి (అమెరికా): సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో 6–4, 6–4తో స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అందు బాటులో ఉన్న తొమ్మిది మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్స్‌ను గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 1990 నుంచి మాస్టర్స్ సిరీస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టోర్నీలు ఈ జాబితాలో ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత అత్యంత ప్రాధా న్యత ఉన్న టోర్నీలుగా మాస్టర్స్ టోర్నమెంట్లకు గుర్తింపు ఉంది. జొకోవిచ్ గెలిచిన మాస్టర్స్ టైటిల్స్ (మొత్తం 31): మయామి (6), ఇండియన్‌వెల్స్ (5), రోమ్ (4), కెనడా (4), పారిస్ (4), షాంఘై (3), మోంటెకార్లో (2), మాడ్రిడ్ (2), సిన్సినాటి (1). -
రోజర్స్ కప్ సెమీఫైనల్లో రాఫెల్ నాదల్
హార్డ్ కోర్టులపై ఐదేళ్లుగా ఊరిస్తోన్న ఏటీపీ మాస్టర్స్ సింగిల్స్ టైటిల్‌ను సాధించే దిశగా రాఫెల్ నాదల్ ముందంజ వేశాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతోన్న రోజర్స్ కప్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 2–6, 6–4, 6–4తో గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు వరుసగా 14వ ఏడాది అర్హత సాధించాడు. -
లవ్ ప్రెగ్నెన్సీ!
ఇండియన్ టెన్నిస్‌కు ఒక తిరుగులేని క్రేజ్ తెచ్చిన సూపర్‌స్టార్ సానియా మీర్జా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లాడిన ఆమె, కెరీర్ కోసం ఇంతకాలం పిల్లలకు దూరంగా ఉంటూ వచ్చింది. షోయబ్, సానియా దంపతులు అక్టోబర్ నెలలో తల్లిదండ్రులయ్యే అవకాశాలున్నాయి. సానియా చివరి మూడు నెలల ప్రెగ్నెన్సీకి వచ్చేయడంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారట! ‘మనందరికీ ఇదొక గొప్ప అదృష్టం. డైట్ విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆకుకూరలు, గ్రీన్ జ్యూస్ బాగా తీసుకుంటున్నా’ అని ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళలకు సూచనలు ఇస్తున్నారు సానియా. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రెగ్నెన్సీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారామె. దీనికి ‘లవ్ ప్రెగ్నెన్సీ’ అని ట్యాగ్ పెట్టుకొని ఉత్సాహంగా పుట్టబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నారు. అలాగే బిడ్డ పుట్టాక అందరూ అనుకునేట్టు టెన్నిస్‌కు దూరం కానని కూడా చెప్పేశారు. ‘2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటా. ప్రెగ్నెన్సీ తర్వాత, బేబీ పుట్టాక రెండే రెండేళ్ల గ్యాప్‌లో మళ్లీ ఆటంటే, అదీ ఇంతకుముందు ఉన్న ఫామ్‌లో అంటే కష్టమే. అయినా సాధిస్తా’ అని ధీమాగా చెబుతున్నారు సానియా. -
రామ్‌కుమార్ పరాజయం
న్యూఢిల్లీ: గతవారం న్యూపోర్ట్ ఓపెన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ అట్లాంటా ఓపెన్‌లో నిరాశపరిచాడు. అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 115వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ప్రపంచ 65వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 186వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 2–6, 2–6తో ప్రపంచ 71వ ర్యాంకర్ లూకాస్ లాకో (స్లొవేకియా) చేతిలో ఓడాడు. -
సెరెనా వచ్చేసింది
లండన్: ఏడు సార్లు వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్ వన్, అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తన ఎనిమిదో టైటిల్ వేటలో ఆమె ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఎదుర్కోనుంది. శనివారం జరిగే తుదిపోరులో వీళ్లిద్దరు తలపడనున్నారు. 2016లో వీరిద్దరి మధ్యే జరిగిన ఫైనల్లో సెరెనా విజేతగా నిలిచింది. ప్రసవానంతరం బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు ముందే గాయంతో తప్పుకున్న సెరెనా, ఈ సారి పచ్చికపై తన అసలు ఆటను ప్రదర్శిస్తూ ఫైనల్ చేరడం విశేషం. సెమీస్‌లో 25వ సీడ్ సెరెనా 6–2, 6–4తో 13వ సీడ్ జులియా జార్జెస్‌పై అలవోక విజయం సాధించింది. 12 ఏళ్లుగా ఏనాడు ప్రిక్వార్టర్ దశను దాటలేకపోయిన జార్జెస్‌ను అమెరికా టెన్నిస్ దిగ్గజం గంటా 10 నిమిషాల్లో ఇంటిదారి పట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన కెర్బర్ వింబుల్డన్‌లో రెండోసారి ఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 11వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ వరుస సెట్లలో 12వ సీడ్ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై అలవోక విజయం సాధించింది. గంటా 8 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆమె 6–3, 6–3తో ఒస్టాపెంకోను ఇంటిదారి పట్టించింది. అదేపనిగా అనవసర తప్పిదాలు, డబుల్ ఫాల్ట్‌లతో ఒస్టాపెంకో పరాజయం చవిచూసింది. -
‘రాజు’ కూలె పచ్చికపై...
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. వింబుల్డన్ పచ్చిక కోర్టులపై అద్వితీయ రికార్డు కలిగిన ఈ డిఫెండింగ్ చాంపియన్ ప్రస్థానం ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఎనిమిదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ 6–2, 7–6 (7/5), 5–7, 4–6, 11–13తో ఓడిపోయాడు. 4 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 8 అంగుళాల పొడవు, 92 కేజీల బరువున్న అండర్సన్ 28 ఏస్‌లు సంధించి, 65 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు తొలి రెండు సెట్లు గెలిచి... మూడో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి... అండర్సన్ సర్వీస్‌లో మ్యాచ్ పాయింట్ సంపాదించిన ఫెడరర్ బ్యాక్‌హ్యాండ్ షాట్ బయటకు కొట్టి విజయం సాధించే సువర్ణావకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత అండర్సన్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. అనంతరం ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని మూడో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్లో ఒకసారి ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అండర్సన్ అదే జోరులో ఈ సెట్‌నూ దక్కించుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌కూ హోరాహోరీగా పోరాడారు. చివరకు ఫెడరర్ సర్వీస్ చేసిన 23వ గేమ్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించాడు. అనంతరం తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని సంచలన విజయం దక్కించుకున్నాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్ మ్యాచ్ పాయింట్ సంపాదించాక ఓడిపోవడం ఇదే తొలిసారి. కెవిన్ కరెన్ (1983లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. జొకోవిచ్ జోరు... మరో క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 3–6, 6–2, 6–2తో నిషికోరి (జపాన్)పై గెలిచి 2015 తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జంట
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ఈ జోడీ 19–21, 21–14, 21–17తో అక్బర్–విన్నీ ఒక్తా(ఇండోనేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ యాదవ్ 14–21, 12–21తో సితికోమ్ (థాయ్‌లాండ్) చేతిలో, కార్తికేయ 14–21, 26–28తో సోనీ ద్వి కుంకొరో (ఇండోనేసియా) చేతిలో, శ్రేయాన్‡్ష 7–21, 9–21తో లూ గ్వాంగ్జు (చైనా) చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 18–21, 9–21తో యూలియా సుసాంతో (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
బుడి బుడి అడుగులు చూడలేదని ఏడ్చేశా!
లండన్: అమెరికన్ టెన్నిస్ నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఆటంటే ప్రాణం. అందుకే గర్భంతోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడింది. ఇప్పుడు తన చిన్నారే ఆమె లోకం. ఆ గారాలపట్టిని ముద్దు చేయడానికి, మురిపెంగా చూసుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అలా అని ఆటని వదలట్లేదు. తన అమ్మాయిని వీడి ఉండట్లేదు. ప్రస్తుతం వింబుల్డన్ ఆడేందుకు కుమార్తె ఒలింపియాతో కలిసి ఇక్కడికి వచ్చిన సెరెనా ప్రాక్టీస్ సమయంతో తన చిట్టితల్లికి దూరమవుతోంది. ఇదే ఆమె మనసుకు భారమవుతున్నట్లుంది. అందుకేనేమో చిన్నారి తొలిసారిగా వేసే బుడిబుడి అడుగులు చూడలేకపోయినందుకు తెగ ఏడ్చేశానని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఇది 2018 అని తెలుసు. ఆధునిక యుగమని తెలుసు. కానీ అమ్మ అమ్మే కదా. సహజంగా నేనూ అంతే. అందుకే ఆ చిన్ని సంగతులన్నీ విశేషాలుగానే తోస్తాయి. ఈ ఆనంద క్షణాలన్నీ పంచుకోవాలనుకుంటా’నని సెరెనా పేర్కొంది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన సెరెనా వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు చేరింది. -
ముగురుజా నిష్క్రమించె...
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణుల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) ఇంటిముఖం పట్టగా... ఈ ఐదుగురి సరసన మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) చేరడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా 7–5, 2–6, 1–6తో ప్రపంచ 47వ ర్యాంకర్ అలీసన్ వాన్ ఉత్వానక్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఉత్వానక్ తన కెరీర్లో తొలిసారి టాప్–10లోపు క్రీడాకారిణిపై గెలిచింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–5, 7–6 (7/2)తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆమె సోదరి వీనస్ 2–6, 7–6 (7/5), 6–8తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఎవగెనియా రొడినా (రష్యా) 7–5, 5–7, 6–4తో పదో సీడ్ మాడిసన్ కీస్పై సంచలన విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగం మూడో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–3, 7–5, 6–2తో స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అన్‌సీడెడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 5–7, 6–4, 6–4, 6–2తో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలుపొందాడు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట పరాజయం పాలైంది. ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్)–సాలిస్బరీ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం 4–6, 6–7 (4/7)తో తొలి రెండు సెట్లను కోల్పోయి... మూడో సెట్లో 1–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. -
వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సిలిచ్ నిష్క్రమణ
-
సిలిచ్ నిష్క్రమణ
లండన్: గతేడాది రన్నరప్, క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రెండోరౌండ్లోనే చుక్కెదురైంది. ఇది మినహా నాలుగో రోజు మిగతా సీడెడ్ ఆటగాళ్లంతా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ స్టార్ రాఫెల్ నాదల్, సెర్బియన్ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్, ఎంజెలిక్ కెర్బర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. భారత ఆటగాళ్లలో దివిజ్ శరణ్ జోడీ శుభారంభం చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనలిస్ట్ సిలిచ్ ఈ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. మూడో సీడ్ క్రొయేషియా ఆటగాడు 6–3, 6–1, 4–6, 6–7 (3/7), 5–7తో గుయిడో పెల్లా (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. 3 గంటల 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సిలిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన పెల్లా చివరకు అతన్ని ఇంటిదారి పట్టించాడు. రెండో సీడ్ నాదల్, జొకోవిచ్‌లు అలవోక విజయాలతో ముందంజ వేశారు. రెండో రౌండ్లో నాదల్ 6–4, 6–3, 6–4తో మిఖాయిల్ కుకుష్కిన్ (కజకిస్తాన్)పై, 12వ సీడ్ జోకొవిచ్ 6–1, 6–2, 6–3తో జెబల్లొస్ (అర్జెంటీనా)పై గెలిచారు. 9వ సీడ్ ఇస్నర్ (అమెరికా) 6–1, 6–4, 6–7 (6/8), 6–7 (3/7), 7–5తో బెమెల్మన్స్ (బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–7 (7/9), 3–6, 6–7 (6/8) థామస్ ఫెబియానో (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ హలెప్ (రుమేనియా) 7–5, 6–0తో ససై జెంగ్ (చైనా)పై, 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 3–6, 6–2, 6–4తో క్లెయిర్ లియూ (అమెరికా)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో దివిజ్ శరణ్–అర్టెమ్ సిటక్ (న్యూజిలాండ్) జోడీ 7–6 (7/4), 6–7 (8/10), 6–3, 6–2తో అల్బొట్ (మాల్డొవా)–మలెక్ జజిరి (ట్యూనిషియా) ద్వయంపై గెలిచింది. విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 7–6 (7/5), 6–4, 7–6 (7/4)తో డానియెల్ (న్యూజిలాండ్)– వెస్లీ కూల్హోఫ్ (నెదర్లాండ్స్) జోడీపై గెలుపొందగా, జీవన్ నెడున్‌జెళియన్ (భారత్)–క్రాజిసెక్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 6–7 (3/7), 6–7 (2/7)తో అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఫెడరర్ ఫటాఫట్
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 89 నిమిషాల్లో 6–4, 6–4, 6–1తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచాడు. వరుసగా 20వ వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్ ఈ మ్యాచ్‌లో 48 విన్నర్స్తోపాటు 16 ఏస్‌లు సంధించాడు. శుక్రవారం జరిగే మూడో రౌండ్లో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో ఫెడరర్ ఆడతాడు. ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో స్ట్రఫ్ 6–7 (3/7), 3–6, 7–6 (7/4), 7–6 (7/4), 13–11తో గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో కార్లోవిచ్ ఏకంగా 61 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (7/4), 6–3, 6–3తో స్తకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 7–6 (7/4), 7–6 (7/4), 7–6 (7/4)తో మిల్మాన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. షరపోవా ఓటమి మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్లో, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), మాజీ రన్నరప్ రద్వాన్‌స్కా (పోలాండ్) రెండో రౌండ్లో ఇంటిదారి పట్టారు. దియాత్‌చెంకో (రష్యా) 6–7 (3/7), 7–6 (7/3), 6–4తో షరపోవాను ఓడించగా... మకరోవా (రష్యా) 6–4, 1–6, 7–5తో వొజ్నియాకిపై, ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో అజరెంకాపై, సఫరోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో రద్వాన్స్కాపై నెగ్గారు. మరోవైపు ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సెరెనా 6–1, 6–4తో విక్టోరియా తొమోవా (బల్గేరియా)పై, వీనస్ 4–6, 6–0, 6–1తో అలెగ్జాండ్రా డల్గెరూ (రొమేనియా)పై విజయం సాధించారు. పురవ్ రాజా జంట పరాజయం పురుషుల డబుల్స్‌లో పురవ్ రాజా (భారత్)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట తొలి రౌండ్లో పోరాడి ఓడింది. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పురవ్ రాజా–మార్టిన్ ద్వయం 2–6, 4–6, 7–6 (7/5), 6–4, 9–11తో మీర్జా బేసిక్ (బోస్నియా హెర్జెగోవినా)–లాజోవిక్ (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. -
ఫెడరర్ శుభారంభం
లండన్: తొమ్మిదో సారి వింబుల్డన్ టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన దిగ్గజ ఆటగాడు, టాప్ సీడ్ రోజర్ ఫెడరర్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. టోర్నీ తొలి రోజు సోమవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–1, 6–3, 6–4తో డ్యుసాన్ లజోవిక్ (సెర్బియా)ను చిత్తు చేశాడు. కేవలం 79 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ముందు లజోవిక్ నిలవలేకపోయాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా విజయం సాధించి ముందంజ వేశాడు. సిలిచ్ 6–1, 6–4, 6–4తో నిషియోకా (జపాన్)ను ఓడించాడు. మహిళల విభాగంలో తొలి రోజే పెద్ద సంచలనం నమోదైంది. నాలుగో సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. క్రొయేషియాకు చెందిన డోనా వెకిక్ 6–1, 6–3తో స్టీఫెన్స్‌ను చిత్తుగా ఓడించింది. రెండో సీడ్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–3తో వర్వరా లెప్చెంకో (అమెరికా)ను చిత్తు చేసి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–5, 6–3తో అరాంటా రుస్ (నెదర్లాండ్స్)ను ఓడించి ముందంజ వేసింది. వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–7, 6–2, 6–1తో జొహన్నా లార్సన్ (స్వీడన్)పై గెలిచి తర్వాతి రౌండ్లోకి ప్రవేశించింది. భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో థామస్ ఫాబియానో (ఇటలీ) 2–6, 6–3, 6–3, 6–2తో బాంబ్రీని ఓడించాడు. 2 గంటల 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో యూకీ తొలి సెట్ గెలుచుకోగలిగినా... ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఏడాదికి రూ. 200 కోట్లు! రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత ‘నైకీ’ సంస్థతో కొనసాగించిన అనుబంధాన్ని ఫెడరర్ ముగించాడు. కొత్తగా జపాన్‌కు చెందిన ‘యునిక్లో’తో ఒప్పందం కుదుర్చుకున్న అతను, తొలిసారి వింబుల్డన్ మ్యాచ్‌లో ఆ సంస్థకు చెందిన కిట్‌తో బరిలోకి దిగాడు. పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం విలువ సుమారు 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 వేల కోట్లు) వరకు ఉందని సమాచారం. నైకీ ఇస్తున్నదానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. కాంట్రాక్ట్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఫెడరర్ ఆటగాడిగా రిటైర్ అయినా అతనికి అంతే డబ్బు లభిస్తుంది. అయితే ఫెడరర్ సొంత బ్రాండ్ ‘ఆర్ఎఫ్’ హక్కులు మాత్రం ఇంకా నైకీ వద్దనే ఉన్నాయి. అయితే తన పేరుతో ఉన్న బ్రాండ్ కాబట్టి ఇప్పుడు కాకపోయినా... మరి కొద్ది రోజుల తర్వాత దాని హక్కులు తనకే దక్కుతాయని ఈ స్విస్ స్టార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ఫెడరర్‌కు షాక్
హాలె (జర్మనీ): కెరీర్లో 99వ సింగిల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు నిరాశ ఎదురైంది. గ్యారీ వెబెర్ ఓపెన్ టైటిల్‌ను పదోసారి నెగ్గాలనే లక్ష్యంతో ఫైనల్ బరిలోకి దిగిన అతనికి క్రొయే షియాకు చెందిన 21 ఏళ్ల బోర్నా కోరిచ్ షాక్ ఇచ్చాడు. రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోరిచ్ 7–6 (8/6), 3–6, 6–2తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి విజేతగా నిలిచాడు. చాంపియన్ కోరిచ్కు 4,27,590 యూరోలు (రూ. 3 కోట్ల 38 లక్షలు); రన్నరప్ ఫెడరర్‌కు 2,09,630 యూరోలు (రూ. కోటీ 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత వారం మెర్సిడెస్ కప్ టైటిల్ గెలిచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న ఫెడరర్ తాజా ఓటమితో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు కోల్పోనున్నాడు. -
గ్యారీ వెబెర్ ఓపెన్‌లో 12వసారి ఫైనల్‌కు ఫెడరర్...
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ గ్యారీ వెబెర్ ఓపెన్‌లో 12వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. జర్మనీలోని హాలె నగరంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/1), 6–5తో క్వాలిఫయర్ డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 14వసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్ ట్రోఫీని సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బోర్నా కోరిచ్ (క్రొయేషియా)తో ఫెడరర్ తలపడతాడు.