
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శైలు నూర్‌బాషా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 11–8, 11–7, 12–14, 6–11, 11–8, 11–9తో అంకిత దాస్ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. బెంగాల్‌కు చెందిన అంకిత 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
అయితే శైలు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. సుతీర్థతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 7–11, 4–11, 8–11తో పరాజయం పాలైంది. ఆర్‌బీఐ తరఫున పోటీపడిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో... ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment