ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారో తెలుసా..! | The Olympian Diet: Sports Dietitians Reveal | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారో తెలుసా..!

Aug 5 2024 4:35 PM | Updated on Aug 5 2024 5:22 PM

The Olympian Diet: Sports Dietitians Reveal

పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ పోటీల్లో క్రీడాకారులు మొత్తం పోటీ అంతా పూర్తి అయ్యేవరకు హెల్తీగా ఉండటానికి ఏం తింటారో తెలుసా. దీని గురించి ఎప్పుడైన ఆలోచించారా..?. తెలిస్తే మాత్రం షాకవ్వుతారు. మనం హెల్తీగా, ఫిట్‌గా ఉండేందుకే ఏ ఫుడ్స్‌కి అయితే దూరంగా ఉంటామో వాటినే వీళ్లు తిని పోటీ అంతటా హెల్తీగా ఉంటారట. నిజానికి పోటీ సమయంలో ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ క్రీడాకారులంతా ఫుడ్‌ని తగ్గించడం లేదా మితంగా తీసుకోవండంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. వాళ్లంతా ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఎలా పోటీలో చివరి వరకు ఉత్సాహంగా ఉండేందుకు ఏం చేస్తారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం.

ఒలింపిక్‌ పతకాలను గెలుచుకునే క్రీడాకారులంతా పిండి పదార్థాలతో ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. అథ్లెట్లకు అత్యుత్తమ శక్తి కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందుకే చాలా వరకు వాళ్ల ఫుడ్‌లో చాలా వరకు పిండి పదార్థాలే అధికంగా ఉంటాయి. వాళ్లు పోటీలోకి దిగేటప్పడు అవన్నీ సమర్థవంతమూన శక్తిగా మార్చబడి కండరాలకు శక్తి నిల్వ చేస్తాయి. వీటిని కండరాల గ్లైకోజెన్‌ అని పిలుస్తారు. క్రీడాకారులకు, సరళమైన (లేదా శుద్ధి చేయబడిన) కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి.  

ప్రాక్టీస్‌ లేదా పోటీకి ముందు  పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్ళు (బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు) వంటి పోషకమైన పిండి పదార్థాలు తర్వాత కోలుకోవడానికి గొప్పవి. చాలా మంది అథ్లెట్లకి ఈ అధిక-ఫైబర్, అధిక-పోషకాహార పిండి పదార్థాలే వారి ప్రధాన శక్తి వనరుగా  ఉంటుంది. ఇవి కండరాల నిర్మాణం మరమ్మత్తు కోసం ఉపయోగపడతాయి. అలాగే రికవరీ సమయంలో బలం, శక్తిని పెంపొందించేందుకు ప్రోటీన్ కూడా ముఖ్యమైనది.

ముఖ్యంగా అథ్లెట్లు తగినంత నిద్రను పొందినప్పుడే, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోగలరని చెబుతున్నారు. దీంతోపాటు రోజువారీ వ్యాయామం కూడా ముఖ్యమే అని వెల్లడించారు. శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఉత్తమమైన మార్గం ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారాన్ని ఎంచుకోవడం. ప్రాసెస్ చేయని ఆహారాలు, అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండటం మేలని అంటున్నారు.

అథ్లెట్లు తమ పనితీరుని మెరుగ్గా ఉంచేందుకు సరైన సంఖ్యలో కేలరీలను తీసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది కూడా.  దాదాపు క్రీడాకారులందరికీ ఇలానే ఒకేలా ఉంటుంది. ఇకండ రోజువారి అవసరాలు, పనితీరుకి తగ్గట్టు ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్‌!: పోషకాహార శాస్త్రవేత్తలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement