బాలీవుడ్ నటి నేహా ధూపియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మోడల్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. అలాగే 2002లో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్య వహించింది. బాలీవుడ్‌లో అనేక బ్లాక్‌బాస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకోవడమే గాక అనేక రియాలిటీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ..విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
ఆమె అంగద్ బేడీని 2018లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లకు జన్మనివ్వడంతో లావుగా అయిపోయారు. అయితే అనుకోకుండా ఒక రోజు మీడియా కంట పడటంతో..ఒక్కసారిగా ఆమె అధిక బరువు గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏకంగా 23 కిలోలు బరువు తగ్గి ఇదివరకటి నేహాలా నాజుగ్గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పైగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే గాక..పలు ఆఫర్లను కూడా అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు తన అభిమానుతో తన వెయిట్ లాస్ జర్నీ గురించి, అందుకు సంబంధించిన చిట్కాలను కూడా షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్‌నెస్‌కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆరోగ్య స్ప్రుహ కలిగించే నేహా తాజాగా డైట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం షేర్ చేసుకుంది. అదేంటంటే..
డైట్ పాటించేటప్పుడూ కేవలం బరువు తగ్గేందుకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా గ్లూటెన్ ఫ్రీ డైట్‌ని అనుసరించమని చెబుతోంది. మంచి శరీరాకృతి తోపాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడమని ధీమాగా చెబుతోంది నేహా.
దీన్ని అత్యంత రుచికరమైన రీతిలో తయారు చేసుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌ని ఇష్టంగా తినగలుగుతారని అంటోంది. తాను అరటిపండ్లతో చేసిన పాన్‌కేక్, తాజా బెర్రీలు, లావెండర్ జామ్ వంటివి తీసుకుంటానని చెబతుతోంది. గ్లూటెన్ ఫ్రీ ఆహారపదార్థాలను ఎంపిక చేసుకుని మరీ డైట్‌ని ప్రారంభిస్తే మంచి ఫలితం ఉండటమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందని తెలిపింది.
గ్లూటెన్ డైట్ అంటే..
గ్లూటెన్ రహిత ఆహారంమే తీసుకోవడం. అందుకోసం గ్లూటెన్ లేని పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటిఆహారాలనే తీసుకుంటారు. అలాగే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ లేదా పాస్తా వంటివి కూడా తీసుకుంటారు.
ఎవరికి మంచిదంటే..
గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పడని వాళ్లకు, గోధుమ పిండితో చేసిన వంటకాలు తింటే ఎలెర్జీ లేదా జీర్ణశయాంతర సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ డైట్ మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణుల. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిదే. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీకి ప్రత్యామ్నాయంగా మంచి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.
(చదవండి: కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?)
Comments
Please login to add a commentAdd a comment