డయాబెటిస్ ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటుంటే చక్కెర అదుపులో ఉంటుందన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే ఇందులో కాస్తంత పాక్షిక సత్యమూ లేకపోలేదు. కాకరలో ‘కరాటిన్’, ‘మమోర్డిసిస్’ అనే పోషకాలు ప్రధానంగా ఉంటాయి. వాటికి కొంతవరకు చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఉంది.
ఇక కాకర గింజల్లోనూ పాలీపెపెప్టైడ్–పీ’ అనే ఇన్సులిన్‌ను పోలిన ఫైటోకెమికల్ ఉంటుంది. దీనికి కూడా కొంతవరకు ఇన్సులిన్‌లాగా పనిచేసే గుణం ఉండటంతో అది కొంతవరకు చక్కెరను అదుపు చేస్తుంది. కానీ కాకరకాయతో చేసే వంటలతోనే చక్కెర పూర్తిగా అదుపులో ఉండటమన్నది అసాధ్యం. వాళ్లు డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సిందే.
ఉపయోగపడే పోషకాలెన్నెన్నో...
అయితే ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు కాకరలో ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకు కాకరలో విటమిన్ బి1, బి2, బి3, సి ల తోపాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. ‘సి’ విటమిన్ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో అది దేహంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.
ఆ ప్రక్రియతో మాలిగ్నంట్ కణాల (కేన్సర్ కారక కణాలు) తొలగి΄ోయి... కేన్సర్లు నివారితమవుతాయి. కాకర గింజలకు కొవ్వును కరిగించే గుణం ఉండటంతో గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో పీచు చాలా ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని రాకుండా చూస్తూ ఎన్నో వ్యాధులను నివారిస్తుంది.
(చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!)
Comments
Please login to add a commentAdd a comment