యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.
కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్‌ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్‌గా పిలుస్తున్నారు.
ఈ డైట్ విధానం..
కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్‌వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు.
ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?
డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్‌లో ఏం తీసుకుంటారంటే..
నిపుణల అభిప్రాయం ప్రకారం..
పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడం
నాన్‌వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడం
సౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం
ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటం
స్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.
ఆమె ఈ డైట్‌లో ఏం తీసుకుంటారంటే..
ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్‌వెజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ డైట్‌లో ఉండే ఆహారాలు..
ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలు
కార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్
కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంప
పండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రో
నట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్‌లు, కొబ్బరి
మొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలు
పానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీ
ప్రయోజనాలు:
ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది
మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.
(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?)
Comments
Please login to add a commentAdd a comment