Olympian
-
రైతుల గోడు కేంద్రం వినాలి
చండీగఢ్: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించారు. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద పంజాబ్ రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనోద్యమం శనివారం 200వ రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్తోపాటు ఖనౌరీ బోర్డర్ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలాల వద్ద బైఠాయించి వారికి వినేశ్ ఫొగాట్ మద్దతు పలికారు. రైతు కుటుంబంలో పుట్టిన వినేశ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. డిమాండ్లు ఇంకా నెరవేర్చనందుకే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 200 రోజులుగా ఉద్యమిస్తున్న వీళ్లను చూస్తే బాధేస్తోంది. రెజ్లర్లుగా మేం రైతులకు మావంతుగా ఏమీ చేయలేకపోయామని ఒక్కోసారి అనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మేము ఇక్కడ సొంత కుటుంబం కోసం ఏమీ చేయలేక నిస్సహాయులమయ్యాం. వీళ్ల బాధను ఇప్పటికైనా ప్రభుత్వం వినాలి. రైతన్న అన్నం పెట్టకపోతే మనమెలా బతుకుతాం?. ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోయినా నిస్వార్థంగా రైతులు పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్లది పెద్ద మనసు. ప్రభుత్వం కూడా తమది పెద్దమనసు అని చాటిచెప్పాలి. డిమాండ్లను నెరవేర్చాలి. హరియాణాలో రైతులు ఉద్యమిస్తే వారికీ నేను మద్దతు పలుకుతా. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిందే. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతుల ఉద్యమం వృథా కాకూడదు’’ అని అన్నారు. హరియాణాలోని ఛర్ఖీ దాద్రీ జిల్లాకు చెందిన మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా ‘‘ నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు. నాకు రాజకీయ అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రాబోను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది రైతుల ఉద్యమస్థలి. ఇక్కడ రైతన్నల సమస్యల గురించే మాట్లాడదాం. చర్చిద్దాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనోద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంయుక్తంగా అక్కడే ‘కిసాన్ మహాపంచాయత్’ ఏర్పాటుచేశాయి. -
క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !
పారిస్ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్ యైలగుల్ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్ రౌండ్ 1/32లో 28వ ర్యాంక్ చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్లో జర్మనీకి చెందని మిచెల్ క్రోపెన్ చేతిలో నిష్క్రమించింది. గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్ ప్రదర్శించాను. అలాగే ఈ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏకి చెందిన మాజీ ఎన్సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.(చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో క్రీడాకారులు మొత్తం పోటీ అంతా పూర్తి అయ్యేవరకు హెల్తీగా ఉండటానికి ఏం తింటారో తెలుసా. దీని గురించి ఎప్పుడైన ఆలోచించారా..?. తెలిస్తే మాత్రం షాకవ్వుతారు. మనం హెల్తీగా, ఫిట్‌గా ఉండేందుకే ఏ ఫుడ్స్‌కి అయితే దూరంగా ఉంటామో వాటినే వీళ్లు తిని పోటీ అంతటా హెల్తీగా ఉంటారట. నిజానికి పోటీ సమయంలో ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ క్రీడాకారులంతా ఫుడ్‌ని తగ్గించడం లేదా మితంగా తీసుకోవండంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. వాళ్లంతా ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఎలా పోటీలో చివరి వరకు ఉత్సాహంగా ఉండేందుకు ఏం చేస్తారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం.ఒలింపిక్ పతకాలను గెలుచుకునే క్రీడాకారులంతా పిండి పదార్థాలతో ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. అథ్లెట్లకు అత్యుత్తమ శక్తి కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందుకే చాలా వరకు వాళ్ల ఫుడ్‌లో చాలా వరకు పిండి పదార్థాలే అధికంగా ఉంటాయి. వాళ్లు పోటీలోకి దిగేటప్పడు అవన్నీ సమర్థవంతమూన శక్తిగా మార్చబడి కండరాలకు శక్తి నిల్వ చేస్తాయి. వీటిని కండరాల గ్లైకోజెన్ అని పిలుస్తారు. క్రీడాకారులకు, సరళమైన (లేదా శుద్ధి చేయబడిన) కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. ప్రాక్టీస్ లేదా పోటీకి ముందు పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్ళు (బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు) వంటి పోషకమైన పిండి పదార్థాలు తర్వాత కోలుకోవడానికి గొప్పవి. చాలా మంది అథ్లెట్లకి ఈ అధిక-ఫైబర్, అధిక-పోషకాహార పిండి పదార్థాలే వారి ప్రధాన శక్తి వనరుగా ఉంటుంది. ఇవి కండరాల నిర్మాణం మరమ్మత్తు కోసం ఉపయోగపడతాయి. అలాగే రికవరీ సమయంలో బలం, శక్తిని పెంపొందించేందుకు ప్రోటీన్ కూడా ముఖ్యమైనది.ముఖ్యంగా అథ్లెట్లు తగినంత నిద్రను పొందినప్పుడే, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోగలరని చెబుతున్నారు. దీంతోపాటు రోజువారీ వ్యాయామం కూడా ముఖ్యమే అని వెల్లడించారు. శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఉత్తమమైన మార్గం ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారాన్ని ఎంచుకోవడం. ప్రాసెస్ చేయని ఆహారాలు, అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండటం మేలని అంటున్నారు.అథ్లెట్లు తమ పనితీరుని మెరుగ్గా ఉంచేందుకు సరైన సంఖ్యలో కేలరీలను తీసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది కూడా. దాదాపు క్రీడాకారులందరికీ ఇలానే ఒకేలా ఉంటుంది. ఇకండ రోజువారి అవసరాలు, పనితీరుకి తగ్గట్టు ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్!: పోషకాహార శాస్త్రవేత్తలు) -
యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!
యుద్ధం సృష్టించే విలయం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని పరాయి దేశాలకు పారిపోయి శరణార్థులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆలాంటి దుస్థితినే చవిచూసింది ఓ ఒలింపియన్. ఆమె కూడా యుద్ధం వాతావరణం నుంచి తప్పించుకునేందుకు పడవ ఎక్కితే..మృత్యువు నీ వెంటే ఉన్నా అన్నట్లు సడెన్‌గా నడి సంద్రంలో ఇంజెన్ ఫెయిల్. అంతటి దురదృష్టంలోనూ బతకాలన్న ఆశతో.. తనతో ఉన్నవారి ప్రాణాలను కాపాడేలా తపించింది. నాటి సాహస ఫలితమే ఒలింపియన్ క్రీడాకారిణిగా అవతరించేలా చేసింది. ఏం జరిగిందంటే..సిరియా ఎంతలా అంతర్యుద్ధంతో అట్టుడుకిపోయిందో మనకు తెలిసిందే. నిరంతర యుద్ధంతో అక్కడ చిన్నారుల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవ్వగా, మరి కొందరూ సర్వస్వం కోల్పోయి ఎందుకు బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలోనే ఉంది యుస్రా మర్దిని కుటుంబం. అమె తన చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మింగ్‌లో గెలుచుకున్న పతకాలు, సాధించిన విజయాలను గురించి కథలు కథలుగా వింటు పెరిగింది. ఓ పక్క యుద్ధ బీభత్సానికి యుస్రా కుంటుంబ ఇంటిని కోల్పోయి బంధువలు ఇళ్లల్లో తలదాచుకునే స్థితికి వచ్చేసింది. అలా ఓ పక్క రైఫిళ్ల మోత బాంబుల బీభత్సం మధ్య పెరిగింది యుస్రా. చెప్పాలంటే ఆ భయానక వాతావరణానికి అలవాటు పడపోయింది. ఓ రోజు యుద్ధం తమ ప్రాంతంలో సృష్టించిన విలయానికి తల్లడిల్లి యుస్రా కుటుంబం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుని గట్టిగా నిర్ణయించుకుంది. అలా యుస్రా 13వ ఏటన ఆమె కుటుంబం ప్రాణాలు అరచేత పట్టుకుని లెబనాన్ మీదుగా టర్కీకి చేరుకుంది. అక్కడ నుంచి గ్రీసుకి సముద్రం మీదుగా వెళ్లే క్రమంలో పడవ ఎక్కింది యుస్రా కుటుంబం. అక్కడ దురదృష్టం నీడలా వెంటాడిందా..? అన్నట్లు నడి సంద్రంలో ఉండగా ఇంజిన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియని భయానక స్థితి. అయితే పడవలో చాలామంది ఉన్నారు దీంతో యుస్రా ఆమె అక్క సారా, బోటు నడిపే వ్యక్తి సుమద్రంలోకి దిగి ముగ్గురు గంటల తరబడి బోటును నెట్టుకుంటూ వచ్చారు. అలా 25 రోజులు ప్రయాణించి జర్మనీ చేరుకున్నారు. చెప్పాలంటే యుస్రా, ఆమె అక్క తమ తల్లిదండ్రుల ప్రాణాల తోపాటు బోటులో ఉన్న ఇతర ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఇక అక్కడ జర్మనీలో శరణార్థులుగా జీవితాన్ని ప్రారంభించింది యుస్రా కుటుంబం. అయితే యుస్రా చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మంగ్ విజయాలను వినడం వల్ల మరేదైన కారణమో గానీ తాను కూడా స్విమ్మర్ అవ్వాలనే అనుకుంది. తానే ఏ దుస్థితిలోనూ ఉన్నప్పటికీ తన కలను వదులోకోలేదు యుస్రా. అలా ఆమె బెర్లిన్‌లోని స్థానిక స్విమ్మింగ్ క్లబ్లో చేరింది. అక్కడ ఆమె అసాధారణమైన ప్రతిభ కోచ్‌లను ఆకర్షించింది. దీంతో వారి ప్రోద్భలంతో 2016లో రియో శరణార్థుల ఒలింపిక్ జట్టులో సభ్యురాలిగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. అక్కడ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈతలో మంచి ప్రదర్శన కనబర్చి ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది. అంతేగాదు 2020 ఒలింపిక్ క్రీడలలో కూడా పోటీ పడింది. యుస్రా ఆ ఒలింపిక్ స్టేడియంపై నిలబడి మాట్లాడుతూ."నేను నా దేశం జెండాను మోయకపోయినా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే ఒలింపిక్ జెండాను మోస్తున్నానని సగర్వంగా చెప్పింది". View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) ఆ మాటలకు ఆ స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఒక్కసారిగా మీడియాతో సహా యావత్తు ప్రపంచం దృష్టిని యుస్రా ఆకర్షించింది. ఇక యుస్రా యూఎన్‌హెచ్‌సీఆర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న అతి పిన్న వయస్కురాలు ఆమె. అంతేగాదు యుస్రా విజయగాథే 2022లో "ది స్విమ్మర్స్" అనే మూవీ విడుదలయ్యింది. ఇక 2023లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా నిలవడం విశేషం. ఇక్కడ యుస్రా స్విమ్మింగ్ క్రీడాకారిణిగా సత్తా చాటి శరణార్థుల హక్కుల కోసం పోరాడటమే గాక వారి కష్టాలను ప్రపంచానికి తెలియజేసింది. నిజం చెప్పాలంటే పోరాటం అంటే ఎలా ఉండాలనేది అందిరికి తెలియజేసింది. ఆమె వియగాథ ఎందరిలోనో స్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. చిన్న కష్టాలకు అమ్మో అనుకునేవాళ్లకు ఆమె విజయగాథ కష్టాల్లో కూడా లక్ష్యాన్ని ఎలా వదలకూడదో చెబుతుంది. View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?) -
గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా..
అట్లాంటా: పీచ్ ట్రీలో జరిగిన మహిళల 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ఇతియోపియా కు చెందిన ఒలింపియన్ అథ్లెట్ సెన్బెర్ టెఫెరి మొత్తం పరుగు పందాన్ని పూర్తి చేసి గమ్యస్థానానికి ఆమడ దూరంలో చేయకూడని పొరపాటు చేసి 10,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కోల్పోయింది. ఇతియోపియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ సెన్బెర్ టెఫెరి జులై 4న జరిగిన అట్లాంటాలో జరిగిన 10,000 కిలోమీటర్ల పరుగు పందెంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. మొత్తం పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సెన్బెర్ చివరి అంచెలో పరిగెడుతుండగా ఆమె పొరపాటున ఆమె ముందున్న ఎస్కార్ట్ బైక్ ను అనుసరించి కుడి వైపుకు తిరిగిపోయింది. అప్పటికి పరుగులో ఆమె మిగతా వారికంటే చాలా ముందుంది. కానీ ఆమె రాంగ్ టర్న్ తీసుకుని పెద్ద పొరపాటు చేయడంతో మిగతావారు ఆమెకంటే ముందు గమ్యాన్ని చేరుకున్నారు. పక్కనున్న వారు సెన్బెర్ ను అప్రమత్తం చేశాక మళ్ళీ ఆమె సరైన దిశగా పరుగు లంఘించుకుని గమ్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచిన టెస్ఫే 10 వేల డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా సెన్బెర్ మాత్రం 3000 డాలర్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. రేసు పూర్తయ్యాక సెన్బెర్ జరిగిన పొరపాటుకి బాధతో కుమిలిపోయింది. సహచరులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కీలకమైన దశలో సెన్బెర్ చేసిన పొరపాటు ఖరీదు 7 వేల డాలర్లన్న మాట. During the women's elite division of the Peachtree Road Race, a 10-kilometer race held annually in Atlanta on July 4, one runner took a wrong turn just before the finish line, costing her the win pic.twitter.com/qRs9Umk19y — CNN (@CNN) July 4, 2023 ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి.. -
అతన్ని అరెస్టు చేయకపోతే నిరసన జంతర్‌మంతర్‌ని దాటి వెళ్తుంది!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరసనకు రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతో.. రెజ్లర్లు తమ నిరసనను జంతర్ మంతర్ని దాటి మరింత ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. ఇతర దేశాల ఒలింపిక్ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించి వారి మద్దతును కూడా తీసుకుని తమ ఆందోళన మరింతగా ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇలానే చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారత స్టార్ రెజ్లర్లు ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు మే 21న పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 23 రోజులుగా భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: అమితాబ్ బచ్చన్ పోస్ట్ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు) -
స్టార్ ఒలింపియన్ కన్నుమూత
Olympic Diver Ian Matos Dies Aged 32: బ్రెజిల్‌కు చెందిన ఒలింపిక్ డైవర్ ఇయాన్ మాటోస్ 32 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ గత రెండు నెలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాటోస్.. బుధావరం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో పోటీ పడ్డ మాటోస్.. పతకం గెలవలేనప్పటికీ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మాటోస్.. 2010 సౌత్ అమెరికన్ గేమ్స్‌లో మూడు కాంస్య పతకాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. మాటోస్ అకాల మరణం పట్ల బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ సంతాపం తెలిపింది. కాగా, మాటోస్.. 2014లో తాను గే నంటూ సంచలన ప్రకటన చేసిన వార్తల్లో నిలిచాడు. చదవండి: అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం -
సోదరి మరణ వార్త విని తల్లడిల్లిపోయిన భారత ఒలింపియన్
సాక్షి, చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తమిళనాడు మహిళా స్ప్రింటర్ ధనలక్షి శేఖర్.. తన సోదరి మరణ వార్త తెలిసి తల్లడిల్లిపోయింది. విశ్వక్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి స్వస్థలమైన తిరుచ్చి గుండురుకు ఆదివారం తిరిగొచ్చిన ధనలక్ష్మి.. తన ప్రాణానికి ప్రాణమైన అక్క గాయత్రి లేదని తెలిసి బోరున విలపించింది. ధనలక్ష్మి టోక్యోలో ఉండగానే ఆమె సోదరి గుండెపోటుతో మరణించింది. అయితే ధనలక్ష్మి ఎక్కడ డిస్టర్భ్ అవుతుందోనని ఆందోళన చెందిన తల్లి ఉష.. ఆమెకు ఈ వార్తను తెలియనివ్వలేదు. ఒలింపిక్స్‌లో పాల్గొని స్వస్థలానికి తిరిగొచ్చిన సందర్భంగా అక్క రాలేదని ధనలక్ష్మి ఆరా తీయగా.. తల్లి చెప్పిన సమాధానం విని ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించింది. చదువుల పరంగానే కాకుండా క్రీడా పరంగా కూడా అక్క తనను చాలా ప్రోత్సహించిందని కన్నీటి పర్యంతం అయ్యింది. కాగా, ధనలక్ష్మి.. టోక్యోకు వెళ్లిన 400మీ మిక్స్డ్ రిలే బృందంలో రిజర్వ్ సభ్యురాలిగా ఉన్నారు. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని స్వస్థలానికి తిరిగొచ్చిన తమిళ క్రీడాకారులకు అభిమానులు, కుటుంబ సభ్యులు సాదర ఆహ్వానం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌కు రాష్ట్రానికి చెందిన 10 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. అందులో ఐదుగురు అథ్లెటిక్స్ విభాగంలో ఎంపికయ్యారు. వీరంతా తమ శక్తి మేరకు సత్తా చాటినా పతకం మాత్రం దక్కలేదు. -
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను
మన ఆటగాళ్లకు కాంస్యం దక్కిన క్షణం చూసిన నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా వల్ల సాధ్యం కానిది ఈతరం ఆటగాళ్లు సాధించడం గర్వంగా అనిపిస్తోంది. జర్మనీతో మ్యాచ్‌లో మన జట్టులో కొన్ని లోపాలు కనిపించినా చివరకు మెడల్ గెలవగలిగాం. ఎప్పటిలాగే చివరి క్షణాల్లో గోల్ ఇచ్చేస్తారేమోనని భయపడ్డాను. ఆ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్‌ను నిలబెట్టుకోగలిగారు. నేను ఆడిన రోజుల్లో ఒలింపిక్స్‌కు ముందు యూరోప్ దేశాలకు వెళ్లి 100 శాతం శ్రమించి గెలిచి రావడం, అసలు ఒలింపిక్స్‌కు వచ్చేసరికి విఫలం కావడం జరిగాయి. మిగతా జట్లు ఒలింపిక్స్‌లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కోసం సన్నద్ధమయ్యేవి. దీనిని కూడా గుర్తించలేని స్థితిలో మా ఆట సాగింది. ఇప్పుడు అంతా మారిపోయింది. విదేశీ కోచ్‌లు బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును యూరోపియన్ శైలికి అనుగుణంగా మనోళ్ల ఆటను తీర్చిదిద్దారు. గత 6–7 ఏళ్లుగా ఇది సాగుతుండగా ఫలితం ఇప్పుడు కనిపించింది. కొత్త తరహా షాట్లు వచ్చి అంతా ‘పవర్‌గేమ్’గా మారిపోయింది. మేం ఆడిన రోజులతో పోలిస్తే సబ్స్టిట్యూట్ల సంఖ్య విషయంలో పరిమితి లేకపోవడంతో ఎక్కువ మందిని రొటేట్ చేస్తూ అందరినీ మ్యాచ్ ఆసాంతం తాజాగా ఉంచే అవకాశం కలిగింది. దాంతో ఆటలో వేగం పెరిగింది. ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులను భారత జట్టు సమర్థంగా అమలు చేయగలగడమే మళ్లీ పతకం గెలుచుకోవడానికి కారణమైంది. –‘సాక్షి’తో ముకేశ్ కుమార్ (ట్రిపుల్ ఒలింపియన్–1992, 1996, 2000) భారత హాకీకి ఇదో పునర్జన్మలాంటిది. ఈ పతకం సాధించి భవిష్యత్తులో ఎవరైనా హాకీ ఆడేందుకు కావాల్సిన ప్రేరణను అందించగలిగాం. ఆఖరి పెనాల్టీ కార్నర్‌కి ముందే ఒకటే మాట అనుకున్నాను. 21 ఏళ్లుగా హాకీ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు ఈ పెనాల్టీని ఆపలేకపోతే అదంతా వృథా అనిపించింది. ఆపి చూపించాను. –పీఆర్ శ్రీజేశ్, గోల్ కీపర్ యావద్భారత దేశం ఈ పతకం కోసం ఎదురు చూస్తోందని నాకు బాగా తెలుసు. ఈ విజయంలో నేనూ ఒక పాత్ర పోషించడం గొప్పగా అనిపిస్తోంది. జట్టు సభ్యులంతా ఎన్నో త్యాగాలు చేసి కష్టపడ్డారు. కరోనా బారిన పడి కూడా అంతే పట్టుదలగా సాధన చేశారు. మ్యాచ్ పూర్తిగా ముగిసే వరకు అంతా అయిపోయినట్లు కాదు. ఈ మ్యాచ్‌లో జట్టు వెనుకబడి కూడా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. –గ్రాహం రీడ్, చీఫ్ కోచ్ అద్భుతంగా అనిపిస్తోంది. మాకు పతకం గెలిచే అర్హత ఉందని భావించాం. 15 నెలలుగా దీని కోసం ఎంతో కష్టపడ్డాం. మ్యాచ్‌లో వెనకబడ్డా మేం నిరాశ చెందలేదు. చివరి వరకు పోరాడాం. చివరి ఆరు సెకన్లలో పెనాల్టీని ఆపేందుకు మా ప్రాణాలు అడ్డువేయాలన్నట్లుగా అనిపించింది –మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ ప్రతీ భారతీయుడి హృదయంలో హాకీకి ప్రత్యేక స్థానం ఉంది. హాకీ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ఆగస్టు 5, 2021 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి భారత జట్టు 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది. 1–3తో వెనుకబడి కూడా ఎంతో పట్టుదల కనబరుస్తూ 5–4తో గెలవడం నిజంగా అద్భుతం. కాంస్యం గెలిచి జట్టుకు నా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం గెలవడం మనందరం సంబరాలు చేసుకోవాల్సిన ఘట్టం. జట్టుకు నా అభినందనలు. ఈ విజయంతో హాకీ పునర్వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నా. కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి 1983, 2007, 2011లను మరచిపోండి. భారత హాకీ జట్టు సాధించిన ఈ పతకం ఏ ప్రపంచ కప్‌కంటే కూడా ఎక్కువే. –గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ -
ఒలింపియన్ అంకితపై శైలు సంచలన విజయం
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శైలు నూర్‌బాషా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 11–8, 11–7, 12–14, 6–11, 11–8, 11–9తో అంకిత దాస్ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. బెంగాల్‌కు చెందిన అంకిత 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అయితే శైలు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. సుతీర్థతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 7–11, 4–11, 8–11తో పరాజయం పాలైంది. ఆర్బీఐ తరఫున పోటీపడిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో... ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
ఈవ్ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్!
జైపూర్: భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి కృష్ణ పూనియా నిజమైన హీరోగా నిలిచారు. రాజస్థాన్‌లోని చిరు పట్టణమైన చురులో ఆమె ముగ్గురు ఆకతాయిలను వెంటాడి.. ఒకడి భరతం పట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద తన కారులో పూనియా వేచి చూస్తుండగా.. ముగ్గురు యువకులు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించడం ఆమె కంటపడింది. వెంటనే కారులోంచి దిగిన ఆమె ఆకతాయిలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. దీంతో బెదిరిపోయిన ముగ్గురు యువకులు బైక్ మీద పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినా, వారిని వదిలిపెట్టకుండా వెంటాడి మరీ బైక్ మీద ఒక ఆకతాయిని ఆమె పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు కృష్ణ పూనియా గోల్డ్ మెడల్ అందించిన సంగతి తెలిసిందే. 'అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తుండటం చూడగానే.. వారు నా కూతుళ్లయితే ఏం చేసేదాన్ని అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కిందకు దిగాను. నేను ఎదురుపడటంతో వారు పరారయ్యారు' అని పూనియా 'హిందూస్తాన్ టైమ్స్'కు తెలిపింది. ఒక ఆకతాయిని పట్టుకొని పోలీసులకు ఫోన్ చేసినా వారు వెంటనే సంఘటనాస్థలానికి రాలేదని, ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే.. దేశంలో మహిళలకు భద్రత ఎలా లభిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటున్న బుజ్జాయి!
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ 'ఐ వాన్నా ఫాలో ఫాలో' అంటూ అద్భుతంగా స్కేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్ లో ఓ బుజ్జాయిలో మంచులో స్కేటింగ్ చేస్తూ అదరగొడుతోంది. నిండా ఏడాదిన్నర వయస్సు కూడా లేని ఆ చిన్నారి నోటిలో పాలపీక పెట్టుకొని అలవోకగా మంచుపై స్కేటింగ్ చేస్తూ.. చూసిన వాళ్లని అబ్బురపరుస్తోంది. అమెరికా ఉటాలోని నార్త్ సాల్ట్ లేక్ కు చెందిన 14 నెలల సోలాన్ హెండర్సన్ మంచు కనబడితే చాలు మురిసిపోతుంది. నెల కిందటే ఈ చిన్నారి బుడిబుడి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. అప్పుడు తమ ముద్దుల బిడ్డ కోసం జాష్ హెండర్సన్, కేటీ దంపతులు స్కేటింగ్ షూస్ కొన్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా స్నోబోర్డింగ్ క్రీడాకారులు. దీంతో వారు సోలాన్ కోసం ఒక చిన్నపాటి స్కేట్ బోర్డు కొనుగోలు చేసి.. అందులో క్రమంగా తనకు శిక్షణ ఇచ్చారు. 13 నెలలకే సోలాన్ కు స్కేటింగ్ షూస్ తొడిగి మంచులో విడిచిపెట్టారు. సరిగ్గా నిలబడటానికి తడబడుతున్న సోలాన్ మంచులో స్కేటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఫ్రొఫెషనల్ ఆటగాడిలో దూసుకుపోతోంది. తాజాగా పార్క్ సిటీ మౌంటైన్ రిసార్టులో సోలాన్ చేసిన స్కేటింగ్ విన్యాసాలను దంపతులు తాజాగా వీడియోలో రికార్డు చేశారు. ఇలా వాళ్లు తమ చిన్నారి వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారో లేదా ఇది వైరల్ అయింది. సహజంగా పిల్లలు 12 నుంచి 15 నెలల వయస్సులో బుడి బుడి అడుగుల వేసే ప్రయత్నం చేస్తారు. కానీ 14 నెలలకు నిలకడగా స్కేట్ బోర్డు మీద నిలబడటమే కాదు మంచులో సోలాన్ అలవోకగా దూసుకుపోవడం ఇప్పుడు అబ్బురపరుస్తోంది. ఇప్పుడు తన స్నో బోర్డింగ్ సాహసాలు నెటిజన్లకు చూపించేందుకు సోలాన్ యూట్యూబ్ లో ఓ చానెల్ కూడా పెట్టింది. ఈ చానెల్ లో సోలాన్ తండ్రి అపలోడ్ చేస్తున్న వీడియోలను చూసి భవిష్యత్తులో ఒక ఒలింపియన్ చాంపియన్ తమకు దొరికినట్టేనని అమెరికన్లు మురిసిపోతున్నారు.