అట్లాంటా: పీచ్ ట్రీలో జరిగిన మహిళల 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ఇతియోపియా కు చెందిన ఒలింపియన్ అథ్లెట్ సెన్బెర్ టెఫెరి మొత్తం పరుగు పందాన్ని పూర్తి చేసి గమ్యస్థానానికి ఆమడ దూరంలో చేయకూడని పొరపాటు చేసి 10,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కోల్పోయింది.
ఇతియోపియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ సెన్బెర్ టెఫెరి జులై 4న జరిగిన అట్లాంటాలో జరిగిన 10,000 కిలోమీటర్ల పరుగు పందెంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. మొత్తం పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సెన్బెర్ చివరి అంచెలో పరిగెడుతుండగా ఆమె పొరపాటున ఆమె ముందున్న ఎస్కార్ట్ బైక్ ను అనుసరించి కుడి వైపుకు తిరిగిపోయింది.
అప్పటికి పరుగులో ఆమె మిగతా వారికంటే చాలా ముందుంది. కానీ ఆమె రాంగ్ టర్న్ తీసుకుని పెద్ద పొరపాటు చేయడంతో మిగతావారు ఆమెకంటే ముందు గమ్యాన్ని చేరుకున్నారు. పక్కనున్న వారు సెన్బెర్ ను అప్రమత్తం చేశాక మళ్ళీ ఆమె సరైన దిశగా పరుగు లంఘించుకుని గమ్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచింది.
ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచిన టెస్ఫే 10 వేల డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా సెన్బెర్ మాత్రం 3000 డాలర్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. రేసు పూర్తయ్యాక సెన్బెర్ జరిగిన పొరపాటుకి బాధతో కుమిలిపోయింది. సహచరులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కీలకమైన దశలో సెన్బెర్ చేసిన పొరపాటు ఖరీదు 7 వేల డాలర్లన్న మాట.
During the women's elite division of the Peachtree Road Race, a 10-kilometer race held annually in Atlanta on July 4, one runner took a wrong turn just before the finish line, costing her the win pic.twitter.com/qRs9Umk19y
— CNN (@CNN) July 4, 2023
ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment