wrong turn
-
గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్!
వాళ్లంతా ఒకే ఏరియాలో ఉండే స్నేహితులు. సరదా ట్రిప్పు కోసం కారులో కొద్ది దూరం వెళ్లారు. కానీ, తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వాళ్లలో ఇద్దరిని కబళించింది. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు.. ఇదంతా గూగుల్ మ్యాప్(Google Map) చేసిన నిర్వాకమనే విషయం తెలిసి కంగుతిన్నారు.ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన కారు-ట్రక్కు ప్రమాదంలో విస్తుపోయే విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా ముందుకెళ్లిన కారు.. అనూహ్యంగా ట్రక్కు ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారని ఎన్డీటీవీ ఒక కథనం ఇచ్చింది.హర్యానా రోహ్తక్కు చెందిన శివాని, సిమ్రాన్, రాహుల్, సంజూలు నైనిటాల్‌లోని నీమ్ కరోలీ బాబా ఆశ్రమ్‌కు వెళ్లి తిరిగొస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి టైంలో బైపాస్ గుండా వెళ్లాల్సిన కారు.. అనూహ్యాంగా ఢిల్లీ వైపు మలుపు తిరిగింది. అంతలో రామ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ దిమ్మెలతో కూడిన ట్రక్కు వీళ్ల కారును బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ట్రక్కు బోల్తా పడగా.. కారు నుజ్జు అయ్యి ట్రక్కు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్షగాతత్రులు సాయం కోసం కేకలు వేశారు.సుమారు 15 మంది(ట్రక్కు డ్రైవర్‌తో సహా).. దాదాపు గంట సేపు అతికష్టం మీద శ్రమించి కారులో ఉన్న నలుగురు క్షతగాత్రులను బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన శివాని, సిమ్రాన్‌లు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంలో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఉంది. బహుశా ఆ రాంగ్ టర్నే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల నుంచి అదే విషయాన్ని ధృవీకరించుకున్నారు. -
సొంత పౌరులపైనే ద.కొ. బాంబులు
సియోల్: దక్షిణ కొరియా సైన్యం శిక్షణలో(Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది. సొంత పౌరులపైనే యుద్ధ విమానం బాంబులు జారవిడిచింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆపై పొరపాటున ఈ దాడి జరిగినట్లు చెబుతూ సైన్యం పౌరులను క్షమాపణలు కోరింది.గురువారం ఉదయం పోచియాన్(Pocheon)లో సైన్యం-వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. కేఎఫ్-16 విమానం నుంచి నిర్దేశించిన లక్ష్యంలో ఎంకే-82 బాంబులను జార విడచాల్సి ఉంది. అయితే నిర్దేశిత లక్ష్యంలో కాకుండా.. జనావాసాలపైకి విమానం దూసుకెళ్లింది. మొత్తం ఎనిమిది బాంబులు వేసింది. దీంతో పలువురికి గాయాలుకాగా.. చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారంజరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సైన్యం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాధితులకు పరిహారం అందజేస్తామని, ఘటనపై దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా(South Korea) రాజధాని సియోల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో పోచియాన్ ఉంది. దీనికి సమీపంలోనే ఉత్తర కొరియా సరిహద్దు ఉంది. త్వరలో అమెరికా-ద.కొ. సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు ప్రాక్టీస్ చేస్తాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది కూడా. -
గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా..
అట్లాంటా: పీచ్ ట్రీలో జరిగిన మహిళల 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ఇతియోపియా కు చెందిన ఒలింపియన్ అథ్లెట్ సెన్బెర్ టెఫెరి మొత్తం పరుగు పందాన్ని పూర్తి చేసి గమ్యస్థానానికి ఆమడ దూరంలో చేయకూడని పొరపాటు చేసి 10,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కోల్పోయింది. ఇతియోపియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ సెన్బెర్ టెఫెరి జులై 4న జరిగిన అట్లాంటాలో జరిగిన 10,000 కిలోమీటర్ల పరుగు పందెంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. మొత్తం పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సెన్బెర్ చివరి అంచెలో పరిగెడుతుండగా ఆమె పొరపాటున ఆమె ముందున్న ఎస్కార్ట్ బైక్ ను అనుసరించి కుడి వైపుకు తిరిగిపోయింది. అప్పటికి పరుగులో ఆమె మిగతా వారికంటే చాలా ముందుంది. కానీ ఆమె రాంగ్ టర్న్ తీసుకుని పెద్ద పొరపాటు చేయడంతో మిగతావారు ఆమెకంటే ముందు గమ్యాన్ని చేరుకున్నారు. పక్కనున్న వారు సెన్బెర్ ను అప్రమత్తం చేశాక మళ్ళీ ఆమె సరైన దిశగా పరుగు లంఘించుకుని గమ్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచిన టెస్ఫే 10 వేల డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా సెన్బెర్ మాత్రం 3000 డాలర్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. రేసు పూర్తయ్యాక సెన్బెర్ జరిగిన పొరపాటుకి బాధతో కుమిలిపోయింది. సహచరులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కీలకమైన దశలో సెన్బెర్ చేసిన పొరపాటు ఖరీదు 7 వేల డాలర్లన్న మాట. During the women's elite division of the Peachtree Road Race, a 10-kilometer race held annually in Atlanta on July 4, one runner took a wrong turn just before the finish line, costing her the win pic.twitter.com/qRs9Umk19y — CNN (@CNN) July 4, 2023 ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి.. -
రాంగ్‌రూట్.. అతివేగం..
మొయినాబాద్: అసలే రాంగ్‌రూట్.. ఆపై అతివేగం.. ఒకరి మృతికి కారణమైంది. లారీని కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మీరాలం మండికి చెందిన ఎండీ ఉబేద్ (24), కార్వాన్ టప్పాచబుత్రా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా, ఎండీ ఇస్మాయిల్, ఇబ్రహీం, నహీమ్ స్నేహితులు. వీరంతా సోమవారం రాత్రి కారులో మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి శివారులో ఉన్న ఓ ఫాంహౌస్‌కు వచ్చారు. రాత్రి అక్కడ గడిపారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు నగరానికి వెళ్లేందుకు కారులో బయలు దేరారు. మొయినాబాద్ సమీపంలోని తాజ్‌హోటల్ వద్ద రాంగ్రూట్లో అతివేగంగా వెళుతున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు ఇంజిన్ ఎగిరి దూరంగా పడిపోయింది. అయిదుగురు యువకులు కారు లోనే ఇరుక్కుపోయారు. ఉబేద్ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఔటర్‌పై రోడ్డు ప్రమాదం ఒకరి మృతి.. ఏడుగురికి గాయాలు మణికొండ: అతివేగంతో ఓ వాహనం అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డుపై పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుగురికి గాయాలయ్యాయి. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ లేబర్ క్యాంప్‌లో ఉంటున్న 8 మంది కూలీలు గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్‌లో డెకరేషన్ పనులు చేస్తున్నారు. రోజు మాదిరిగానే అజీజ్‌నగర్ నుంచి డెకరేషన్ వస్తువులను తీసుకుని టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. వాహనం అతివేగంగా వెళుతూ ఔటర్ రింగ్ రోడ్డు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఇందులో ఉన్న వారందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. బర్దన్ (38) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు. -
Viral Video: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
-
దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
వాషింగ్టన్: మంటల్లో తగలబడుతున్న ఇంట్లోకి దూకి అందులోని వారిని హీరో రక్షించే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే అమెరికాలోని అయోవా ప్రాతంలో జరిగింది. మంటల్లో దగ్ధమవుతున్న ఇంట్లోని నలుగురు తోబుట్టువులను రక్షించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. ఇంట్లోని డోర్‌బెల్ కెమెరాలో నమోదైన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంట్లోంచి ప్రాణాలతో బయటపడిన వారిలో 8,14,17,22 ఏళ్ల వయసు వారిగా పోలీసులు తెలిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఇంటి యజమాని, నలుగురు పిల్లల తల్లి టెండర్ లెమన్. మన జీవితాలు శాశ్వతంగా మారిన రోజు! కానీ, బూడిద నుంచే కదా?? అంటూ రాసుకొచ్చారు. వీడియో ప్రకారం.. మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. కొద్ది సేపటికి ముందు నుంచి 22 ఏళ్ల యువకుడు సైతం అందులోంచి బయటకు వచ్చాడు. బ్రెండన్ బ్రిట్ అనే వ్యక్తి తన కారులో వెళ్తూ దారి తెలియక మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గంలో ఓ ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి కిటికీలను పగలగొట్టి లోపల ఎవరైనా ఉన్నారేమో పరీక్షించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారని భావించానని, వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు బ్రిట్ చెప్పారు. మంటలు తీవ్రమవుతున్న క్రమంలో లోపలి ఉన్న వారిని అలర్ట్ చేసి ఇంటి గుమ్మం గుండా బయటకు పంపించినట్లు తెలిపారు. మరోవైపు.. స్మోక్ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని, బయట నుంచి అరుపులు విని లేచినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఇంటి యజమాని లెమన్. ఈ మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఐదు పెంపుడు శునకాలు మృతి చెందాయని, మరో రెండు గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. అయితే, ఇంట్లో మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు రెడ్ ఓక్ ఫైర్ విభాగం తెలిపింది. ఇదీ చదవండి: బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా -
మద్యం మత్తులో ఎంతపని చేశాడు?
డెట్రాయిట్: తాగి వాహనం నడిపి ఓ వ్యక్తి వందలమంది తమ నివాసాలను వదిలి పారిపోయేలా చేశాడు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడమే కాకుండా ఓ ఫెన్సింగ్ గుద్దేసి అనంతరం సహజ వాయువు పైపు లైన్ ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదే వాహనం ఓ ఇంటిని కూడా ఢీకొట్టింది. ఈ ఘటన డెట్రాయిట్ లో చోటుచేసుకుంది. వేకువ జామున ఈ ఘటన సంభవించింది. తొలుత కొద్ది పరిమాణంలో వ్యాపించిన మంటలు క్షణాల్లో పుంజుకొని ఓ భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఉలిక్కిపడిన అక్కడి వాళ్లంతా పరారయ్యారు. ఇంకొందరు తమ ఇళ్లలో గ్యాస్ లీకవుతుందా అని అనుమానపడ్డారు. కొన్ని మైళ్ల వరకు ఈ గ్యాస్ ప్రభావం చూపించింది. కాగా, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. వెనుకే మరో వాహనంలో వస్తున్న వ్యక్తి వేగంగా స్పందించి అతడిని అందులో నుంచి బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అతడికి కొంత కాలిన గాయాలు కూడా అయ్యాయని వివరించారు. ఈ పేలుడు కారణంగా అక్కడి రోడ్డు మొత్తం కూడా ధ్వంసం అయిందన్నారు.