ఈవ్‌ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్‌! | Krishna Poonia chases down eve teaser | Sakshi
Sakshi News home page

ఈవ్‌ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్‌!

Published Tue, Jan 3 2017 3:24 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

ఈవ్‌ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్‌! - Sakshi

ఈవ్‌ టీజర్లను వెంటాడి.. రఫాడిన లేడీ ప్లేయర్‌!

జైపూర్‌: భారత డిస్కస్‌ త్రో క్రీడాకారిణి కృష్ణ పూనియా నిజమైన హీరోగా నిలిచారు. రాజస్థాన్‌లోని చిరు పట్టణమైన చురులో ఆమె ముగ్గురు ఆకతాయిలను వెంటాడి.. ఒకడి భరతం పట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద తన కారులో పూనియా వేచి చూస్తుండగా.. ముగ్గురు యువకులు ఇద్దరు టీనేజ్‌ అమ్మాయిలను వేధించడం ఆమె కంటపడింది. వెంటనే కారులోంచి  దిగిన ఆమె ఆకతాయిలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. దీంతో బెదిరిపోయిన ముగ్గురు యువకులు బైక్‌ మీద పరారయ్యేందుకు ప్రయత్నించారు.

అయినా, వారిని వదిలిపెట్టకుండా వెంటాడి మరీ బైక్‌ మీద ఒక ఆకతాయిని ఆమె పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 2010 కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు కృష్ణ పూనియా గోల్డ్‌ మెడల్‌ అందించిన సంగతి తెలిసిందే. 'అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తుండటం చూడగానే.. వారు నా కూతుళ్లయితే ఏం చేసేదాన్ని అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కిందకు దిగాను. నేను ఎదురుపడటంతో వారు పరారయ్యారు' అని పూనియా 'హిందూస్తాన్‌ టైమ్స్‌'కు తెలిపింది. ఒక ఆకతాయిని పట్టుకొని పోలీసులకు ఫోన్‌ చేసినా వారు వెంటనే సంఘటనాస్థలానికి రాలేదని, ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే.. దేశంలో మహిళలకు భద్రత ఎలా లభిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement