యుద్ధం సృష్టించే విలయం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని పరాయి దేశాలకు పారిపోయి శరణార్థులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆలాంటి దుస్థితినే చవిచూసింది ఓ ఒలింపియన్. ఆమె కూడా యుద్ధం వాతావరణం నుంచి తప్పించుకునేందుకు పడవ ఎక్కితే..మృత్యువు నీ వెంటే ఉన్నా అన్నట్లు సడెన్‌గా నడి సంద్రంలో ఇంజెన్ ఫెయిల్. అంతటి దురదృష్టంలోనూ బతకాలన్న ఆశతో.. తనతో ఉన్నవారి ప్రాణాలను కాపాడేలా తపించింది. నాటి సాహస ఫలితమే ఒలింపియన్ క్రీడాకారిణిగా అవతరించేలా చేసింది.
ఏం జరిగిందంటే..సిరియా ఎంతలా అంతర్యుద్ధంతో అట్టుడుకిపోయిందో మనకు తెలిసిందే. నిరంతర యుద్ధంతో అక్కడ చిన్నారుల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవ్వగా, మరి కొందరూ సర్వస్వం కోల్పోయి ఎందుకు బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలోనే ఉంది యుస్రా మర్దిని కుటుంబం. అమె తన చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మింగ్‌లో గెలుచుకున్న పతకాలు, సాధించిన విజయాలను గురించి కథలు కథలుగా వింటు పెరిగింది. ఓ పక్క యుద్ధ బీభత్సానికి యుస్రా కుంటుంబ ఇంటిని కోల్పోయి బంధువలు ఇళ్లల్లో తలదాచుకునే స్థితికి వచ్చేసింది.
అలా ఓ పక్క రైఫిళ్ల మోత బాంబుల బీభత్సం మధ్య పెరిగింది యుస్రా. చెప్పాలంటే ఆ భయానక వాతావరణానికి అలవాటు పడపోయింది. ఓ రోజు యుద్ధం తమ ప్రాంతంలో సృష్టించిన విలయానికి తల్లడిల్లి యుస్రా కుటుంబం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుని గట్టిగా నిర్ణయించుకుంది. అలా యుస్రా 13వ ఏటన ఆమె కుటుంబం ప్రాణాలు అరచేత పట్టుకుని లెబనాన్ మీదుగా టర్కీకి చేరుకుంది. అక్కడ నుంచి గ్రీసుకి సముద్రం మీదుగా వెళ్లే క్రమంలో పడవ ఎక్కింది యుస్రా కుటుంబం. అక్కడ దురదృష్టం నీడలా వెంటాడిందా..? అన్నట్లు నడి సంద్రంలో ఉండగా ఇంజిన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియని భయానక స్థితి.
అయితే పడవలో చాలామంది ఉన్నారు దీంతో యుస్రా ఆమె అక్క సారా, బోటు నడిపే వ్యక్తి సుమద్రంలోకి దిగి ముగ్గురు గంటల తరబడి బోటును నెట్టుకుంటూ వచ్చారు. అలా 25 రోజులు ప్రయాణించి జర్మనీ చేరుకున్నారు. చెప్పాలంటే యుస్రా, ఆమె అక్క తమ తల్లిదండ్రుల ప్రాణాల తోపాటు బోటులో ఉన్న ఇతర ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఇక అక్కడ జర్మనీలో శరణార్థులుగా జీవితాన్ని ప్రారంభించింది యుస్రా కుటుంబం. అయితే యుస్రా చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మంగ్ విజయాలను వినడం వల్ల మరేదైన కారణమో గానీ తాను కూడా స్విమ్మర్ అవ్వాలనే అనుకుంది.
తానే ఏ దుస్థితిలోనూ ఉన్నప్పటికీ తన కలను వదులోకోలేదు యుస్రా. అలా ఆమె బెర్లిన్‌లోని స్థానిక స్విమ్మింగ్ క్లబ్‌లో చేరింది. అక్కడ ఆమె అసాధారణమైన ప్రతిభ కోచ్‌లను ఆకర్షించింది. దీంతో వారి ప్రోద్భలంతో 2016లో రియో శరణార్థుల ఒలింపిక్ జట్టులో సభ్యురాలిగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. అక్కడ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈతలో మంచి ప్రదర్శన కనబర్చి ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది. అంతేగాదు 2020 ఒలింపిక్ క్రీడలలో కూడా పోటీ పడింది. యుస్రా ఆ ఒలింపిక్ స్టేడియంపై నిలబడి మాట్లాడుతూ."నేను నా దేశం జెండాను మోయకపోయినా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే ఒలింపిక్ జెండాను మోస్తున్నానని సగర్వంగా చెప్పింది".
ఆ మాటలకు ఆ స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఒక్కసారిగా మీడియాతో సహా యావత్తు ప్రపంచం దృష్టిని యుస్రా ఆకర్షించింది. ఇక యుస్రా యూఎన్‌హెచ్‌సీఆర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న అతి పిన్న వయస్కురాలు ఆమె. అంతేగాదు యుస్రా విజయగాథే 2022లో "ది స్విమ్మర్స్" అనే మూవీ విడుదలయ్యింది. ఇక 2023లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా నిలవడం విశేషం.
ఇక్కడ యుస్రా స్విమ్మింగ్ క్రీడాకారిణిగా సత్తా చాటి శరణార్థుల హక్కుల కోసం పోరాడటమే గాక వారి కష్టాలను ప్రపంచానికి తెలియజేసింది. నిజం చెప్పాలంటే పోరాటం అంటే ఎలా ఉండాలనేది అందిరికి తెలియజేసింది. ఆమె వియగాథ ఎందరిలోనో స్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. చిన్న కష్టాలకు అమ్మో అనుకునేవాళ్లకు ఆమె విజయగాథ కష్టాల్లో కూడా లక్ష్యాన్ని ఎలా వదలకూడదో చెబుతుంది.
(చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?)
Comments
Please login to add a commentAdd a comment