బాల్యమంతా ఆస్తమాతో పోరాడింది. ఆ వ్యాధి చికిత్సలో భాగంగా నేర్చుకున్న స్విమ్మింగ్‌నే కెరీర్‌గా మార్చుకుని అథ్లెటిక్ స్థాయికి చేరి.. ఒలింపిక్‌లో బంగారు పతకాలు సాధించింది. ఇలా ఆమె ఏకంగా ఆరుసార్లు పతకాలను గెలుచుకోవడం విశేషం. శరీరానికే వైద్యపరమైన సమస్య కానీ మనసుకు కాదని నిరూపించింది. హాయిగా జీవితం సాగుతుంది అనుకునేలోపు ఊహించిన ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులుగా చేసింది. అయినా తగ్గేదేలా అంటూ దూసుకుపోతూ తనలాంటి చిన్నారులను ఛాంపియన్లగా మారేలా స్థైర్యం నింపుతూ ఆదర్శంగా నిలిచింది.
ఆమెనే అమీ వాన్ డైకెన్. స్విమ్మింగ్ ఎక్సలెన్స్‌కు పర్యాయపదంగా ఆమె. అమీ బాల్యం అంతా ఆస్తమాతో పోరాడింది. అందుకోసం తీసుకున్న చికిత్సలో భాగంగా ఈత నేర్చుకునేది. చెప్పాలంటే ఈత ద్వారా ఉపశమనం పొందేది. అదే ఆమెకు భవిష్యత్తులో కెరీర్‌గా మారి ఉన్నత శిఖరాలు చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె వైద్యుడు చికిత్సలో భాగంగా సూచించిన స్విమ్మింగ్ తన సమస్యను నివారించడమే కాకుండా అదే ఆమెను స్విమ్మింగ్ ఛాంపియన్‌గా అవతరించేలా చేసింది. 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్న తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించింది.
2000 సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో, మరో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. ఇలా ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు బంగారు పతకాలను దక్కించుకున్న అథ్లెట్‌గా నిలిచింది. ఇక వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేటప్పటికీ..మాజీ-అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ రూయెన్‌ను వివాహం చేసుకుంది . ఇక స్విమ్మింగ్ నుంచి రిటైర్ అయ్యి, యాంకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అలా అమె టీవీ, రేడియో ప్రెజెంటర్‌గా మారింది. ఐతే జూన్ 6, 2014న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌చైర్‌కి పరిమితమైపోయింది. అయినా కూడా తగ్గేదే లే..! అంటూ తనలా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ఒలింపిక్ ఛాంపియన్లలా రాణించేలా స్ఫూర్తిని నింపుతోంది. ఆమె గాథ జీవితంలో విధి కష్టాల రూపంలో మన గమనానికి బ్రేక్‌పడేలా చేస్తే.. ఆగిపోకుండా దాన్నే ఆయుధంగా చేసుకుని బతకాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తోంది కదూ..!
(చదవండి: ఈ కిచెన్‌వేర్స్‌ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !)
Comments
Please login to add a commentAdd a comment