క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గొనాలంటే మాత్రం ఆటగాళ్లు పలు సమస్యలు ఎదర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం తోపాటు ఫుడ్‌కి అలవాటు పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరూ త్వరగా ఆ పరిస్థితులకు సెట్ అయినా మరికొందరు ఆటగాళ్లు నానాపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన భారతీయ వంటకాలకు చోటు ఉండదు. అలాంటిది ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో మాత్రం భారతీయ వంటకాలతో కూడిన మెను పెట్టనున్నారు. చక్కగా పప్పు అన్నం, కోడి కూర, గోబీ, ఆలు వంటి రుచికరమైన వంటకాలను క్రీడకారులకు పెట్టనన్నారు.
ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఈ ఫుడ్ సమస్యను ఎన్నేళ్లుగానో ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు చెక్ పెడుతూ..ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ అంగీకరించడం విశేషం. ఈ ఏడాది ఒలింపిక్స్ పారిస్‌లో వేదికగా జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ఇక ఫుడ్ సమస్య ఉండదు. చక్కగా అథ్లెట్ల గ్రామంలో మన క్రీడాకారులకు భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంచక్కా మన ఆటగాళ్లు పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాదించవచ్చు. అంతేగాదు భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహార మెనుకి సంబంధించిన లిస్ట్‌ని ఓలింపిక్స్ నిర్వాహకులకు పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు.
ఇంతవరకు దక్షిణాసియా వంటకాలే..
భారత వంటకాలతో కూడిన మెనూ ఉండాలని చేసిన ప్రతిపాదనలకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెఫ్ శివ తెలిపారు. ఇక ఈ జాబితాను పోషకాహార నిపుణుడి సూచనల మేరకే రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ఆహారం విషయంలోనే పెద్ద సమస్య ఉందన్నారు చెప్పాలంటే..ఒలింపిక్స్‌లో క్రీడాకారుల భోజన మెనులో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటాయి. కేవలం మనవాళ్లకి మినహా. అందువల్లే మన భారతీయ అథ్లెట్లకు దక్షిణాసియా వంటకాలు ఉండాలని పట్టుబట్టడం జరిందన్నారు శివ. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ మండలి అంగీకరించిందని చెప్పారు.
కాగా, ఈ అథ్లెట్ల గ్రామంలోనే డాక్టర్ దిన్‌షా పర్దీవాలా పర్యవేక్షణలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు చికిత్స అందించింది దిన్‌షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు.
(చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment