athelets
-
ఆమె స్థైర్యం ముందు.. విధే చిన్నబోయింది..!
బాల్యమంతా ఆస్తమాతో పోరాడింది. ఆ వ్యాధి చికిత్సలో భాగంగా నేర్చుకున్న స్విమ్మింగ్‌నే కెరీర్‌గా మార్చుకుని అథ్లెటిక్ స్థాయికి చేరి.. ఒలింపిక్‌లో బంగారు పతకాలు సాధించింది. ఇలా ఆమె ఏకంగా ఆరుసార్లు పతకాలను గెలుచుకోవడం విశేషం. శరీరానికే వైద్యపరమైన సమస్య కానీ మనసుకు కాదని నిరూపించింది. హాయిగా జీవితం సాగుతుంది అనుకునేలోపు ఊహించిన ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులుగా చేసింది. అయినా తగ్గేదేలా అంటూ దూసుకుపోతూ తనలాంటి చిన్నారులను ఛాంపియన్లగా మారేలా స్థైర్యం నింపుతూ ఆదర్శంగా నిలిచింది.ఆమెనే అమీ వాన్ డైకెన్. స్విమ్మింగ్ ఎక్సలెన్స్‌కు పర్యాయపదంగా ఆమె. అమీ బాల్యం అంతా ఆస్తమాతో పోరాడింది. అందుకోసం తీసుకున్న చికిత్సలో భాగంగా ఈత నేర్చుకునేది. చెప్పాలంటే ఈత ద్వారా ఉపశమనం పొందేది. అదే ఆమెకు భవిష్యత్తులో కెరీర్‌గా మారి ఉన్నత శిఖరాలు చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె వైద్యుడు చికిత్సలో భాగంగా సూచించిన స్విమ్మింగ్ తన సమస్యను నివారించడమే కాకుండా అదే ఆమెను స్విమ్మింగ్ ఛాంపియన్‌గా అవతరించేలా చేసింది. 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్న తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో, మరో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. ఇలా ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు బంగారు పతకాలను దక్కించుకున్న అథ్లెట్‌గా నిలిచింది. ఇక వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేటప్పటికీ..మాజీ-అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ రూయెన్‌ను వివాహం చేసుకుంది . ఇక స్విమ్మింగ్ నుంచి రిటైర్ అయ్యి, యాంకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలా అమె టీవీ, రేడియో ప్రెజెంటర్‌గా మారింది. ఐతే జూన్ 6, 2014న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌చైర్‌కి పరిమితమైపోయింది. అయినా కూడా తగ్గేదే లే..! అంటూ తనలా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ఒలింపిక్ ఛాంపియన్లలా రాణించేలా స్ఫూర్తిని నింపుతోంది. ఆమె గాథ జీవితంలో విధి కష్టాల రూపంలో మన గమనానికి బ్రేక్పడేలా చేస్తే.. ఆగిపోకుండా దాన్నే ఆయుధంగా చేసుకుని బతకాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తోంది కదూ..!(చదవండి: ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !) -
చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!
ఇటీవల చాలామంది చీర కట్టులో స్విమ్మింగ్, స్కేటింట్ వంటివి చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. మన భారతీయ వస్త్రధారణ మనకు నచ్చిన అభిరుచికి అనుకూలంగా మలుచుకోవచ్చని చేసి చూపిస్తున్నారు. అందుకోసమని పాశ్చాత్య బట్టలను ధరించాల్సిన పనిలేదని చాటి చెబుతున్నారు. మన భారత సంప్రదాయ వస్త్రాధారణకు ఉన్న ప్రాముఖ్యతను తెలయజెప్పుతున్నారు కూడా. అలానే ఈ మలయాళ కుట్టి చీరకట్టులో కేలరీల బర్న్ చేసే క్రీడలాంటి హులా హూప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్‌మీడియ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఎష్నా కుట్టి మూసపద్ధతలను సవాలు చేస్తూ సాంప్రదాయ భారతీయ చీరకట్టులో చాకచక్యంగా హులా హూపింగ్ చేసి చూపించింది. ఎష్నా చీర ధరించి కూడా చాలా సునాయాసంగా, వేగవంతంగా హులా హూపింగ్ చేసింది. అధునిక అథ్లెటిజంని భారత సాంప్రదాయ చీరతో మిళితం చేసింది. పైగా భారతీయ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పింది. ఇక ఎష్నా ఇలా చీరకట్టులో హులా హూప్స్ చేయడానికి ప్రధాన కారణం శారీరక ఫిట్నెస్ కోసం చేసే ఈ క్రీడను మన సాంస్కృతికి వారసత్వానికి చిహ్నమైన చీరలో కూడా చెయ్యొచ్చు అని చెప్పేందుకేనని అంటోంది. ఆమె ఢిల్లీలో పెరిగినప్పటికీ..పుట్టుకతో ఆమె మళయాళీ. కానీ ఆమెకు మళయాళం రాదు. ఆమె తల్లి చిత్ర నారాయణ పాత్రికేయురాలు, తండ్రి విజయన్ కుట్టి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. తాను ఈ హులాహూపింగ్ని పదేళ్ల ప్రాయం నుంచే నేర్చుకున్నట్లు తెలిపింది. ఇది తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెప్పుకొచ్చింది. తన స్నేహితులు, తల్లిదండ్రలు మద్దతుతో హులా హూపింగ్స్ ట్రైనర్‌గా మారింది. అంతేగాదు పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ 2024లో కూడా అథ్లెట్లకు మద్దతిస్తు పాల్గొనడం విశేషం. ఇక హులా హూప్స్ అనేది ఒక క్రీడా ఈవెంట్‌గా గుర్తించబడింది, దీనికి నిర్దిష్ట రూపం అవసరం. ముఖ్యంగా ఫిట్నెస్కి సంబంధించి కేలరీలను బర్న్ చేసే గొప్ప సాధనంగా చెప్పొచ్చు. కాగా, ఎష్నా జర్నీ భారతీయ యువతులకు స్ఫూర్తిదాయకం. మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే..అథ్లెటిక్స్ ఆసక్తిన కొనసాగించాలనుకునేవారికి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. రాబోయే తరాలు ఎష్నాని ఆదర్శంగా తీసుకుని తాము రాణిస్తున్న రంగంలో భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు పెద్దపీట వేసేలా మార్గం సుగమం చేసింది. (చదవండి: కఠినమైన డైట్, జిమ్ చెయ్యలేదు..కేవలం పరాఠాలతో బరువు తగ్గడమా..?) -
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
ఉంగరం వేలు మన గుండె నరాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే మన పెద్దలు ఉంగరం వేలుకి ఉంగరం పెట్టేవారని మనం కథకథలుగా విన్నాం. అలాగే ఆయుర్వేదంలో కూడా వేళ్ల నరాలకు మన శరీరంలోని అవయవాలకు సంబంధం ఉందని చెబుతోంది. అయితే చైనా కంపెనీ ఆ ఉంగరంతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉండేలా..సరికొత్త స్మార్ట్ ఉంగరాన్ని తీసుకొచ్చింది.శరీరం పనితీరును, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్ రింగ్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వాటి కోవలోనిదే ఈ స్మార్ట్ రింగ్. చైనీస్ కంపెనీ ‘అమాజ్‌ఫిట్’ ఇటీవల ఈ స్మార్ట్‌రింగ్‌ను ‘హీలియో రింగ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ఇందులోని సెన్సర్లు ఎప్పటికప్పుడు శరీరం పనితీరును గమనిస్తూ స్మార్ట్‌వాచీ లేదా స్మార్ట్‌ఫోన్‌కు యాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, ఒత్తిడి, నిద్ర తీరు సహా పలు అంశాలపై ఈ ఉంగరం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసేవారికి ‘అమాజ్‌ఫిట్’ మూడు నెలల వరకు ‘జెప్ ఆరా’ హెల్త్ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తుండటం విశేషం. ఈ స్మార్ట్‌రింగ్ ధర 71 డాలర్లు (రూ.5,914) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?) -
యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!
యుద్ధం సృష్టించే విలయం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని పరాయి దేశాలకు పారిపోయి శరణార్థులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఆలాంటి దుస్థితినే చవిచూసింది ఓ ఒలింపియన్. ఆమె కూడా యుద్ధం వాతావరణం నుంచి తప్పించుకునేందుకు పడవ ఎక్కితే..మృత్యువు నీ వెంటే ఉన్నా అన్నట్లు సడెన్‌గా నడి సంద్రంలో ఇంజెన్ ఫెయిల్. అంతటి దురదృష్టంలోనూ బతకాలన్న ఆశతో.. తనతో ఉన్నవారి ప్రాణాలను కాపాడేలా తపించింది. నాటి సాహస ఫలితమే ఒలింపియన్ క్రీడాకారిణిగా అవతరించేలా చేసింది. ఏం జరిగిందంటే..సిరియా ఎంతలా అంతర్యుద్ధంతో అట్టుడుకిపోయిందో మనకు తెలిసిందే. నిరంతర యుద్ధంతో అక్కడ చిన్నారుల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవ్వగా, మరి కొందరూ సర్వస్వం కోల్పోయి ఎందుకు బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలోనే ఉంది యుస్రా మర్దిని కుటుంబం. అమె తన చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మింగ్‌లో గెలుచుకున్న పతకాలు, సాధించిన విజయాలను గురించి కథలు కథలుగా వింటు పెరిగింది. ఓ పక్క యుద్ధ బీభత్సానికి యుస్రా కుంటుంబ ఇంటిని కోల్పోయి బంధువలు ఇళ్లల్లో తలదాచుకునే స్థితికి వచ్చేసింది. అలా ఓ పక్క రైఫిళ్ల మోత బాంబుల బీభత్సం మధ్య పెరిగింది యుస్రా. చెప్పాలంటే ఆ భయానక వాతావరణానికి అలవాటు పడపోయింది. ఓ రోజు యుద్ధం తమ ప్రాంతంలో సృష్టించిన విలయానికి తల్లడిల్లి యుస్రా కుటుంబం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుని గట్టిగా నిర్ణయించుకుంది. అలా యుస్రా 13వ ఏటన ఆమె కుటుంబం ప్రాణాలు అరచేత పట్టుకుని లెబనాన్ మీదుగా టర్కీకి చేరుకుంది. అక్కడ నుంచి గ్రీసుకి సముద్రం మీదుగా వెళ్లే క్రమంలో పడవ ఎక్కింది యుస్రా కుటుంబం. అక్కడ దురదృష్టం నీడలా వెంటాడిందా..? అన్నట్లు నడి సంద్రంలో ఉండగా ఇంజిన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియని భయానక స్థితి. అయితే పడవలో చాలామంది ఉన్నారు దీంతో యుస్రా ఆమె అక్క సారా, బోటు నడిపే వ్యక్తి సుమద్రంలోకి దిగి ముగ్గురు గంటల తరబడి బోటును నెట్టుకుంటూ వచ్చారు. అలా 25 రోజులు ప్రయాణించి జర్మనీ చేరుకున్నారు. చెప్పాలంటే యుస్రా, ఆమె అక్క తమ తల్లిదండ్రుల ప్రాణాల తోపాటు బోటులో ఉన్న ఇతర ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఇక అక్కడ జర్మనీలో శరణార్థులుగా జీవితాన్ని ప్రారంభించింది యుస్రా కుటుంబం. అయితే యుస్రా చిన్నతనం నుంచి తండ్రి స్విమ్మంగ్ విజయాలను వినడం వల్ల మరేదైన కారణమో గానీ తాను కూడా స్విమ్మర్ అవ్వాలనే అనుకుంది. తానే ఏ దుస్థితిలోనూ ఉన్నప్పటికీ తన కలను వదులోకోలేదు యుస్రా. అలా ఆమె బెర్లిన్‌లోని స్థానిక స్విమ్మింగ్ క్లబ్లో చేరింది. అక్కడ ఆమె అసాధారణమైన ప్రతిభ కోచ్‌లను ఆకర్షించింది. దీంతో వారి ప్రోద్భలంతో 2016లో రియో శరణార్థుల ఒలింపిక్ జట్టులో సభ్యురాలిగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. అక్కడ 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈతలో మంచి ప్రదర్శన కనబర్చి ప్రపంచ వేదికపై విజేతగా నిలిచింది. అంతేగాదు 2020 ఒలింపిక్ క్రీడలలో కూడా పోటీ పడింది. యుస్రా ఆ ఒలింపిక్ స్టేడియంపై నిలబడి మాట్లాడుతూ."నేను నా దేశం జెండాను మోయకపోయినా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే ఒలింపిక్ జెండాను మోస్తున్నానని సగర్వంగా చెప్పింది". View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) ఆ మాటలకు ఆ స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఒక్కసారిగా మీడియాతో సహా యావత్తు ప్రపంచం దృష్టిని యుస్రా ఆకర్షించింది. ఇక యుస్రా యూఎన్‌హెచ్‌సీఆర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న అతి పిన్న వయస్కురాలు ఆమె. అంతేగాదు యుస్రా విజయగాథే 2022లో "ది స్విమ్మర్స్" అనే మూవీ విడుదలయ్యింది. ఇక 2023లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా నిలవడం విశేషం. ఇక్కడ యుస్రా స్విమ్మింగ్ క్రీడాకారిణిగా సత్తా చాటి శరణార్థుల హక్కుల కోసం పోరాడటమే గాక వారి కష్టాలను ప్రపంచానికి తెలియజేసింది. నిజం చెప్పాలంటే పోరాటం అంటే ఎలా ఉండాలనేది అందిరికి తెలియజేసింది. ఆమె వియగాథ ఎందరిలోనో స్థైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. చిన్న కష్టాలకు అమ్మో అనుకునేవాళ్లకు ఆమె విజయగాథ కష్టాల్లో కూడా లక్ష్యాన్ని ఎలా వదలకూడదో చెబుతుంది. View this post on Instagram A post shared by Yusra Mardini (@yusramardini) (చదవండి: 19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?) -
ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!
క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గొనాలంటే మాత్రం ఆటగాళ్లు పలు సమస్యలు ఎదర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం తోపాటు ఫుడ్‌కి అలవాటు పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరూ త్వరగా ఆ పరిస్థితులకు సెట్ అయినా మరికొందరు ఆటగాళ్లు నానాపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన భారతీయ వంటకాలకు చోటు ఉండదు. అలాంటిది ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో మాత్రం భారతీయ వంటకాలతో కూడిన మెను పెట్టనున్నారు. చక్కగా పప్పు అన్నం, కోడి కూర, గోబీ, ఆలు వంటి రుచికరమైన వంటకాలను క్రీడకారులకు పెట్టనన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఈ ఫుడ్ సమస్యను ఎన్నేళ్లుగానో ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు చెక్ పెడుతూ..ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ అంగీకరించడం విశేషం. ఈ ఏడాది ఒలింపిక్స్ పారిస్‌లో వేదికగా జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ఇక ఫుడ్ సమస్య ఉండదు. చక్కగా అథ్లెట్ల గ్రామంలో మన క్రీడాకారులకు భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంచక్కా మన ఆటగాళ్లు పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాదించవచ్చు. అంతేగాదు భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహార మెనుకి సంబంధించిన లిస్ట్‌ని ఓలింపిక్స్ నిర్వాహకులకు పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. ఇంతవరకు దక్షిణాసియా వంటకాలే.. భారత వంటకాలతో కూడిన మెనూ ఉండాలని చేసిన ప్రతిపాదనలకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెఫ్ శివ తెలిపారు. ఇక ఈ జాబితాను పోషకాహార నిపుణుడి సూచనల మేరకే రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ఆహారం విషయంలోనే పెద్ద సమస్య ఉందన్నారు చెప్పాలంటే..ఒలింపిక్స్‌లో క్రీడాకారుల భోజన మెనులో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటాయి. కేవలం మనవాళ్లకి మినహా. అందువల్లే మన భారతీయ అథ్లెట్లకు దక్షిణాసియా వంటకాలు ఉండాలని పట్టుబట్టడం జరిందన్నారు శివ. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ మండలి అంగీకరించిందని చెప్పారు. కాగా, ఈ అథ్లెట్ల గ్రామంలోనే డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు చికిత్స అందించింది దిన్‌షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో విరాట్
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అత్యంత అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలిమో ఫిలిప్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో విరాట్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితా టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ మాత్రమే. అలిమో ఫిలిప్ విరాట్‌ను ఫేస్ ఆఫ్ ద క్రికెట్‌గా అభివర్ణించాడు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ తర్వాతి స్థానంలో మరో ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. 𝐆𝐑𝐄𝐀𝐓𝐄𝐒𝐓 𝐀𝐓𝐇𝐋𝐄𝐓𝐄𝐒 𝐎𝐅 𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 🥇 Lionel Messi 🥈 Cristiano Ronaldo 🥉 Muhammad Ali 4️⃣ Michael Jordan 5️⃣ Virat Kohli 6️⃣ Usain Bolt 7️⃣ Mike Tyson 8️⃣ Lebron James 9️⃣ Serena Williams 🔟 Michael Phelps 🐐 𝐓𝐡𝐞 𝐆𝐎𝐀𝐓𝐒#Messi𓃵|#GOAT𓃵|#NBA pic.twitter.com/Sxv0dBksKW — FIFA World Cup Stats (@alimo_philip) February 3, 2024 బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ ఆలీ మూడో స్థానంలో, బాస్కెట్‌బాల్ కింగ్ మైఖేల్ జోర్డన్ నాలుగో ప్లేస్‌లో, ట్రాక్ చీతా ఉసేన్ బోల్ట్ ఆరులో, మరో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఏడో స్థానంలో, బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ ఎనిమిదిలో, టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ తొమ్మిదిలో, బంగారు చేప, స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ పదో స్థానంలో నిలిచారు. ఆల్‌టైమ్ గ్రేట్ టాప్ 10 అథ్లెట్ల జాబితాలో సెరెనా విలియమ్స్ ఒక్కరే మహిళ కావడం విశేషం. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్న కారణంగా విరాట్ జట్టుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో విరాట్ తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం వైజాగ్‌లో రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్ చాంపియన్..
అండర్–23 విభాగంలో భారత జాతీయ స్ప్రింట్ మహిళా చాంపియన్ తరణ్‌జీత్ కౌర్ డోపింగ్ పరీక్షలో విఫలమైందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. ‘నాడా’ క్రమశిక్షణ కమిటీ విచారణలోనూ తరణ్‌జీత్ దోషిగా తేలితే ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధిస్తారు. చదవండి: రషీద్ ఖాన్ కుటంబంలో తీవ్ర విషాదం.. -
పరుగుల రాణి ‘కీర్తన’కు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్‌లో మరింతగా రాణించేందుకు పరుగుల రాణి కీర్తనకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహం అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కీర్తనకు ప్రోత్సాహం లభిస్తే, పీటీ ఉషలా దేశానికి కీర్తిని తెచ్చిపేట్టే కీర్తన అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కీర్తన.. కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్‌లో అండర్–16 విభాగంలో 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించింది. గూడూరుకు చెందిన చెరిపెల్లి నాగమణి– కుమార స్వామిల కుమార్తె కీర్తనను ఈ సందర్భంగా మంగళవారం మంత్రి తమ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అసమాన ప్రతిభను కనబరుస్తూ అండర్–16 జూనియర్ అథ్లెటిక్ విభాగంలో స్వర్ణ పతకం గెలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కీర్తన ప్రతిభకు గురుకుల పాఠశాల పదను పెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్థాపించిన గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతి, చదువు, క్రీడా ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గూడూరు సర్పంచ్ మంద కుమరయ్య, మాజీ సర్పంచ్ పుల్లయ్య, పూజరి రమాకాంత్ తదితరులున్నారు. ప్రశంసలతోపాటు పైసలివ్వాలి: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: జలమంత్రిత్వశాఖ పనితీరుపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో తెలంగాణను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వంద శాతం ఆవాసాలకు, నల్లాల ద్వారా ఇంటింటికీ, అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు మంచినీరు సరఫరా చేస్తున్నందుకు రాష్ట్రాన్ని గతంలోనూ కేంద్రం అభినందించిందని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ రహిత, శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నందుకు కేంద్రం మెచ్చుకుందని తెలిపారు. అయితే రాష్ట్రానికి కేవలం ప్రశంసలే కాకుండా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విధంగా నిధులు కూడా ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. -
పోలియోను గెలిచి... ఒలింపిక్ వరకు పరుగు
పసితనంలోనే ఆమెకు పోలియో సోకింది. ఇక నడవడం కష్టమే అని డాక్టర్లు తేల్చేశారు. ఆపై మశూచి మహమ్మారి కూడా ఆమెను వదల్లేదు. ఇక కోలుకున్నట్లుగా అనిపించిన సమయంలో న్యుమోనియా దాడి చేసింది. ఒకదశలో బతకడం కూడా కష్టమని అనిపించింది. పదేళ్లు వయసు కూడా దాటక ముందే ఇలాంటి గండాలను ఎదుర్కొనే పిల్లల భవిష్యత్తు సాధారణంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా 22 మంది పిల్లల కుటుంబంలో ఆమె 20వ సంతానం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారిపై ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. కానీ విల్మా రుడాల్ఫ్ విధిని ఎదిరించింది. కష్టాలను అధిగమించి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. నల్ల జాతీయుల ప్రతినిధిగా వారికి స్ఫూర్తిగా నిలిచింది. పరుగు, పరుగు, పరుగు... విల్మా గ్లాడియాన్ రుడాల్ఫ్ జీవితకాలం ఇష్టపడిన మంత్రం! కొత్తగా రెక్కలొచ్చిన పక్షికి ఎగరాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో బహుశా అదే ఆమెకు స్ఫూర్తినందించి ఉండవచ్చు. ఎందుకంటే పోలియో బారిన పడిన తర్వాత నడవలేనేమో అనుకున్న దశ నుంచి ఆమె కొంత కోలుకుంది. అయితే ఎడమ కాలు బాగా బలహీనంగా మారిపోయింది. కానీ సుదీర్ఘ చికిత్స తర్వాత 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె పాదాల్లో చురుకుదనం వచ్చింది. అంతే...ఆ తర్వాత నడకే కాదు పరుగునే విల్మా ప్రాణంగా మార్చుకుంది. కోచ్ దృష్టిలో పడి... పాఠశాల స్థాయిలో విల్మా బాస్కెట్‌బాల్ ఆడేది. ఆమె చురుకుదనం, వేగంతో స్కూల్ టీమ్‌కు పలు విజయాలు అందించింది. అదే సమయంలో విల్మాపై స్థానిక టెన్నెసీ యూనివర్సిటీ అథ్లెటిక్స్ కోచ్ ఎండ్ టెంపుల్ దృష్టి పడింది. ఆమెలోని సహజ అథ్లెట్ నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్... తమ వేసవి శిబిరంలో చేరాల్సిందిగా సూచించాడు. అక్కడి క్యాంప్‌లో భాగమైన తర్వాత విల్మా పరుగు మరింత మెరుగైంది. ఇదే జోరులో ప్రతిష్టాత్మక అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ నిర్వహించిన ట్రాక్ మీట్లో పాల్గొన్న ఈ అమ్మాయి తాను పాల్గొన్న 9 ఈవెంట్లలో కూడా విజేతగా నిలిచింది. ఆ తర్వాత విల్మా రుడాల్ఫ్ అథ్లెటిక్స్ కెరీర్ అమిత వేగంగా దూసుకుపోయింది. పోలియో నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఆమె అంతర్జాతీయస్థాయిలో పోటీ పడే అథ్లెట్‌గా ఎదగడం విశేషం. ఒలింపిక్ విజేతగా... విల్మా స్కూల్ చదువు కూడా పూర్తి కాక ముందే 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ కోసం అథ్లెటిక్స్ సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. 16 ఏళ్ల విల్మా ఇందులో పాల్గొని సత్తా చాటింది. 200 మీటర్ల పరుగులో పోటీ పడేందుకు జట్టులోకి ఎంపికై, మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూఎస్ జట్టులో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 200 మీటర్ల పరుగులో హీట్స్‌లోనే విఫలమై వెనుదిరిగినా... రిలే రూపంలో ఆమెకు మరో అవకాశం దక్కింది. అమెరికా మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. ఇందులో భాగంగా ఉన్న విల్మా ఖాతాలో తొలి ఒలింపిక్ పతకం చేరింది. బంగారు బాల... విల్మా కెరీర్ మరో నాలుగేళ్ల తర్వాత శిఖరానికి చేరింది. మెల్బోర్న్ ఒలింపిక్స్ అనుభవంతో ఆమె తర్వాతి ఒలింపిక్స్‌కు మరింత పట్టుదలగా, కఠోర శ్రమతో సిద్ధమైంది. దాని ఫలితమే 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు. 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగులో వ్యక్తిగత స్వర్ణాలు గెలుచుకున్న ఈ స్ప్రింటర్ 4్ఠ100 మీటర్ల రిలేలో ఈసారి తన పతకం రంగు మార్చుకుంది. విల్మా సభ్యురాలిగా ఉన్న జట్టు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఇదే మెగా ఈవెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీల ప్రత్యక్ష ప్రసారం జరిగింది. దాంతో ఒక్కసారిగా విల్మా పేరు మారుమోగిపోయి స్టార్‌గా మారిపోయింది. అన్ని దేశాలు ఆమె వేగాన్ని ప్రశంసిస్తూ ‘టోర్నడో’... ‘ఫ్లాష్’... ‘ట్రాక్ స్టార్’... ‘ద బ్లాక్ పెర్ల్’ అంటూ వేర్వేరు ఉపమానాలతో విల్మాను ఆకాశానికెత్తేశాయి. 22 ఏళ్లకే ముగించి... రోమ్ ఒలింపిక్స్ తర్వాత కూడా అనేక మంది మిత్రులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పలు ఈవెంట్లలో విల్మా పాల్గొంది. కానీ తన కోసం ఎలాంటి ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకోలేదు. ‘నేను వచ్చే ఒలింపిక్స్‌లో మరో రెండు స్వర్ణాలు నెగ్గినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. నేను సాధించింది చాలు. ఇక పరుగు ఆపడమే మంచిది’ అంటూ కెరీర్ అత్యుత్తమ దశలో ఉండగా 22 ఏళ్లకే ట్రాక్‌కు రిటైర్మెంట్ చెప్పేసింది. అందుకే 1964 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనలేదు. ఆట ముగించగానే తన చదువుపై దృష్టి పెట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆపై పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమైంది. ముఖ్యంగా నల్ల జాతి అమెరికన్స్ పౌర హక్కులు, మహిళల హక్కుల కోసం ఆమె పోరాడింది. చిన్నప్పటి వైకల్యాలను అధిగమించి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన విల్మా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. -
అథ్లెట్ జూమా ఖాతూన్‌పై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడటంతో భారత మహిళా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతూన్‌పై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘డి హైడ్రోక్లోరోమిథైల్ టెస్టోస్టిరాన్’ వాడినట్లు తేలింది. 2018 జూన్‌లో గువాహటి వేదికగా జరిగిన అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జుమా 1500, 5000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. ఈ పోటీల సందర్భంగా ఆమె నుంచి జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్) శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. అయితే అదే శాంపిల్‌ను ‘వాడా’ పరీక్షించగా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. జుమాపై నిషేధం ఈ ఏడాది విధించినా... ఈ నిషేధం మాత్రం 2018 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా 2018 జూన్ నుంచి నవంబర్ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్‌లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు. -
ఆటలు, ఆతిథ్యం...
మేబషి (జపాన్): కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముంచెత్తిన వేళ సామాజిక దూరం పేరిట మనిషికి మనిషికి మధ్య ఎడం పెరిగిపోయింది. విదేశాల నుంచి, పొరుగు ఊరు నుంచి వచ్చిన వారిని కలిసేందుకు అయినవాళ్లు, బంధువులే ఆసక్తి చూపడం లేదు. అలాంటిది పరాయి దేశం నుంచి వచ్చిన అథ్లెట్లను కంటికి రెప్పలా కాచుకుంటున్నారు జపాన్ వాసులు. ప్రాక్టీస్ కోసం ట్రాక్‌లు, ఉండేందుకు వసతి, ఆహారం, వారి అవసరాల కోసం నిధులు సేకరిస్తూ మానవత్వాన్ని చూపిస్తున్నారు. ఆటపై మమకారంతో తమ దేశానికి తరలివచ్చిన అథ్లెట్లపై తమ ప్రేమను కురిపిస్తున్నారు ఉత్తర టోక్యోలోని మేబషి నగరవాసులు. టోక్యో ఒలింపిక్స్ కోసం నిరుపేద దేశమైన దక్షిణ సూడాన్‌కు చెందిన ఐదుగురు అథ్లెట్ల బృందం నవంబర్‌లో మేబషి చేరుకుంది. ఇందులో ఒకరు కోచ్ కాగా... ముగ్గురు పురుష, ఒక మహిళా స్ప్రింటర్ ఉన్నారు. అప్పటినుంచి ఇక్కడి ట్రాక్‌లపై ప్రాక్టీస్ చేస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. అనూహ్యంగా ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మేబషివాసులు తమ స్నేహ హస్తం అందించారు. జూలై వరకు వారు అక్కడే ఉంటూ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు తగిన ఏర్పాట్లను వారే చూసుకుంటున్నారు. మేబషివాసుల అందించిన ఆపన్నహస్తంతో ఒలింపిక్స్‌కు పూర్తి స్థాయిలో తయారయ్యే అవకాశం లభించిందని వారి ప్రేమకు కృతజ్ఞులం అని 20 ఏళ్ల స్ప్రింటర్ అబ్రహం మజొక్ మాటెట్ గ్యుయెమ్ అన్నాడు. -
విశ్వాసమే గెలిపించింది
వివాహం స్త్రీని ఏమీ సాధించనివ్వదని ఒక అపోహ. వివాహం జరిగి, పిల్లలు పుట్టి, 40 ఏళ్లు వచ్చేశాక స్త్రీలు ఎంతకూ సాధించే అవకాశం లేదనేది తిరుగులేని అపోహ. కాని– ఈ అపోహలన్నీ తప్పు అని నిరూపించారు దివ్యా బొల్లారెడ్డి. 42 ఏళ్ల వయసులో ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో వింటిని వొదిలిన బాణంలా దూసుకువెళ్లి ఆమె స్వర్ణపతకాన్ని సాధించారు. అంతేకాదు ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఎంట్రీ పొందారు. దైవం మీద తనకున్న విశ్వాసమే ఈ గెలుపును ఇచ్చిందని, ఈ గెలుపు దైవానిదేనని ఆమె వినమ్రంతో సాక్ష్యం చెబుతున్నారు. ఈ నెల మొదటివారంలో మలేసియాలోని కుచింగ్‌లో ‘ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’ జరిగాయి. 35 ఏళ్లు పైబడినవారు ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులు. ఆసియా ఖండంలోని 29 దేశాల నుంచి 2,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అంతపోటీని ఎదుర్కొని కూడా 40 ఏళ్ల విభాగంలో మన దేశానికి 800 మీటర్ల పరుగుపోటీలో బంగారు పతకం, 400 మీటర్ల పరుగుపోటీలో రజతపతకం సాధించారు నలభై రెండేళ్ల దివ్యారెడ్డి. ఆమె కేవలం అథ్లెట్ మాత్రమే కాదు. మీడియా రంగంలో ఉన్నతోద్యోగి కూడా. తెలుగు ప్రాంతాల స్త్రీలనే కాదు, దేశంలో ఉన్న స్త్రీలకు కూడా స్ఫూర్తినిచ్చే ఆసక్తికరమైన కథను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆటలు తెలియవు మాది రాయలసీమే అయినా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇక్కడ బిఎస్సీ చేసి అమెరికాలో కంప్యూటర్స్‌లో ఎం.ఎస్ చేశాను. చదువులో చురుగ్గా ఉన్నాను కాని ఆటలు పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. మా కుటుంబాలలో మగవారు కొందరు ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టి కృషి చేయడం తెలుసు. స్త్రీలకు ఆ విషయంపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది కాదు. అందరూ ఆడుకునే చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం, నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ పోటీలను టీవీలో చూడటం తప్ప నేను ఈ రంగానికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. వివాహం జరిగి, పిల్లలు పుట్టాక అనుకోకుండా ఈ రంగంలో అడుగుపెట్టాను. బాబు పుట్టాక... నాకు ఒక పాప. ఒక బాబు. బాబు పుట్టాక సంవత్సరం తర్వాత ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాలనిపించింది. ఇంట్లోనే ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేయడం మొదలెట్టాను. నేను సన్నగా ఉండటం, ట్రెడ్మిల్ మీద ఉత్సాహంగా పరిగెత్తడం చూసిన ఒక స్నేహితురాలు ‘బాగా పరిగెడుతున్నావ్... రోడ్‌రేస్‌లో పాల్గొనచ్చు కదా’ అని సలహా చెప్పింది. 2013లో అనుకుంటాను సిటీలో ‘బిట్స్ పిలాని యానివర్సరీ 10కె రన్’ జరిగింది. అందులో పాల్గొనమని అందరూ ప్రోత్సహించారు. నాకు అంతవరకూ ఆ దృష్టి లేదు. సరే.. స్నేహితులతో సరదాగా ఉంటుందని పాల్గొన్నాను. 10కె రన్ అంటే సామర్థ్యాన్ని కొనసాగించే శక్తి ఉండాలి. ఆ దేవుడి కృప వల్ల అది నాకున్నట్టుంది. పోటీలో మూడో స్థానంలో వచ్చాను. అందరూ మెచ్చుకున్నారు. ఇక మీదట పరుగు మీద దృష్టి పెట్టాలని సూచించారు. అలా పరుగు మీద ఆసక్తి కలిగింది. పిల్లల స్ఫూర్తితో మా పిల్లలు స్విమ్మర్లు. పాపకు 15, బాబుకి 12 సంవత్సరాలు. ప్రాక్టీసు కోసం రోజూ వెంటబెట్టుకుని వెళ్తుంటాను. నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే బాబు ఆశ్రయ్ సైకిలింగ్ చేస్తూ నాకు తోడుగా ఉంటాడు. పిల్లలిద్దరూ రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేస్తారు. ఈతే కాదు, ఏ క్రీడ అయినా శరీరాన్ని గొప్ప క్రమశిక్షణతో ఉంచుతుందని ఆ ప్రాక్టీస్ చూస్తే నాకు అనిపించేది. గృహిణిగా, ఉద్యోగిగా నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నా నేను పరుగు మీద దృష్టి పెట్టడానికి ఈ స్ఫూర్తి ఒక కారణం. ట్రెడ్మిల్ మీద 10 కిలోమీటర్ల దూరాన్ని గంటా మూడు నిమిషాల్లో పూర్తి చేయడం నాకు నేనే ప్రాక్టీసు చేశాను. దానిని ఒక్కో నిమిషం తగ్గించుకుంటూ ఇప్పుడు 49 నిమిషాలలో పూర్తయ్యేలా సాధన చేశాను. ‘ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’లో సాధించిన బంగారు, రజత పతకాలతో దివ్యా బొల్లారెడ్డి దైవం ఇచ్చిన విజయం నేను ఇలా ఈ స్థాయికి వచ్చానంటే అదంతా దేవుడు నాయందు చూపిన కరుణ వల్లే అని అనుకుంటాను. తాత ముత్తాతల నుంచి దైవ విశ్వాసులుగా ఉన్న మా కుటుంబం ఆశీస్సులు ముఖ్యంగా మా అమ్మ ప్రార్థనలు నాకు మానసికంగా, శారీరకంగా ఎంతో బలాన్నిచ్చాయి. గృహిణిగా, ఉద్యోగిగా ఉన్న నేను అథ్లెట్‌గా మారడం కేవలం ఆ దేవుడి గొప్పతనం వల్లే అనిపిస్తుంది. నా కోసం ఆయన రచించిన ప్రణాళిక వల్లే నేను అథ్లెట్ కాగలిగాను. ఆయన గొప్పతనం చాటడానికే నాకు విజయం చేకూరింది అని కూడా నా విశ్వాసం. పిల్లలతో, ఉద్యోగంతో అలిసిన ప్రతిసారి నాకు బైబిల్ ఒక ఉత్సాహాన్ని ఇచ్చేది. నేను ఇక నా వల్ల కాదు, వెనక్కు మరలుదాం అనుకున్నప్పుడల్లా ‘డెయిలీ బ్రెడ్’ నాకు ఎంతో ప్రేరణనిచ్చేది. అన్నిటినీ మించి క్రిస్టమస్ వేడుకలు జరిగే డిసెంబర్ మాసంలో నేను అసియా పోటీలలో విజయం సాధించడాన్ని కూడా నేను దైవ విజయంగానే భావిస్తాను. – దివ్యారెడ్డి హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్... సరదాగా మొదలైన నా పరుగు ఇప్పుడు హాఫ్ మారథాన్ (21 కి.మీ)కు చేరింది. హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్టెల్ హాఫ్‌మారథాన్‌లో పాల్గొని అన్ని కిలోమీటర్లు పరిగెత్తగలనని నిరూపించాను. ఆ తర్వాత 2016లో ముంబైలో జరిగిన ‘టాటా ముంబై మారథాన్’లో ఫుల్ మారథాన్ (42 కి.మీ) పరిగెత్తాను. అయితే ఏ సాధనకైనా ట్రైనర్ అవసరమని అర్థమయ్యాక రాజశేఖర్ కాలివెంకట దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ విభాగానికి డైరెక్టర్ అయిన మా కోచ్ నేను స్ప్రింట్‌లో (తక్కువ దూరపు పరుగు) పాల్గొంటే బాగుంటుందని సూచించారు. అంతేకాదు... స్పోర్ట్ సైన్స్, న్యూట్రిషన్లో పీహెచ్డీ చేసి ఉండడంతో నా డైట్లో కూడా మార్పులు చెప్పారు. ఇక స్ప్రింట్‌లో అంటే పూర్తిస్థాయి అథ్లెటిక్‌గా మారాలి. గాయాల ప్రమాదం ఉంటుంది. చాలా శారీరక శ్రమ చేయాలి. డైట్ పాటించాలి. చాలామంది వద్దు అని వారించారు. కాని నేను అవన్నీ చేశాను. జూలై 2019లో గోవాలో జరిగిన ‘నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో’ 800 మీటర్ల పరుగులో, 400 మీటర్ల పరుగులో కూడా గోల్డ్ సాధించేసరికి ఆసియా అథ్లెటిక్స్‌కు క్వాలిఫై అయ్యాను. కోచ్ రాజశేఖర్ కాలివెంకటతో దివ్య ఆసియా గోల్డ్ మలేసియాలో జరిగిన 800 మీటర్ల పరుగును నేను మర్చిపోలేను. నాతోపాటు ఫీల్డ్‌లో 13 మంది ఉన్నారు. కాని దైవాన్ని తలుచుకుని, దేశాన్ని తలుచుకుని ఒక్కసారిగా పరుగు తీశాను. లక్ష్యం పూర్తి చేసేసరికి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఇండియాకు గోల్డ్ అని ప్రకటించారు. చాలా ఉద్వేగం కలిగింది. 400 మీటర్ల పరుగులో రజతం సాధించడం కూడా చాలా సంతోషం కలిగించింది. ఇప్పుడు నా దృష్టి అంతా వచ్చే సంవత్సరం టొరెంటో (కెనడా)లో జరిగే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్’పైనే. దైవం తోడుగా అక్కడ కూడా విజయం సాధిస్తానని ఆశిస్తాను. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
గోల్డ్‌కోస్ట్ లో అథ్లెట్‌పై అసభ్యకర ప్రవర్తన
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ క్రీడా గ్రామంలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేశారని మారిషస్ అథ్లెట్ ఒకరు ఆరోపించారు. మారిషస్ చెఫ్ డి మిషన్ కయాసీ టీరోవెంగడమ్ తనను అసభ్యకర రీతిలో తాకుతూ దాడి చేశారని అథ్లెట్ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల ప్రారంభ కార్యక్రమానికి ముందే ఘటన జరిగినట్లు అథ్లెట్ ఫిర్యాదులో పేర్కొన్నారని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని క్వీన్స్లాండ్ డీసీపీ స్టీవ్ గోలెచ్స్కీ పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన గేమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 6600 మంది క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్‌కు చేరుకున్నారు. వీరంతా క్రీడాగ్రామంలో బస చేస్తున్నారు. వారి రక్షణ పట్ల బాధ్యతగా ఉంటామని, ఇలాంటి దాడులను తాము సహించబోమని’ స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై మారిషస్ టీమ్ స్పందించలేదు. కాగా దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చెఫ్‌ని బాధ్యతల నుంచి తప్పించినట్లు మారిషస్ మీడియా పేర్కొంది. -
‘స్పీడ్ స్టార్’ విజేతలు పృథ్వీరాజ్, హరికృష్ణ
జాతీయ స్థాయిలో మెరిసిన హైదరాబాద్ కుర్రాళ్లు సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు జాతీయ స్థాయిలో ఫాస్టెస్ట్ అథ్లెట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కూహ్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన ‘స్పీడ్‌స్టార్’ అథ్లెటిక్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో నగరానికి చెందిన పృథ్వీరాజ్, హరికృష్ణ విజేతలుగా నిలిచారు. ఈ పోటీల ఫైనల్స్ ఆదివారం ముంబైలో జరిగాయి. ఇందులో దేశవ్యాప్తంగా 10 నగరాలకు చెందిన 80 మంది చిన్నారులు పోటీ పడ్డారు. అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగును 8.64 సెకన్లలో పూర్తి చేసి పృథ్వీరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. అండర్-12 విభాగంలో 100 మీటర్ల రేస్‌లో హరికృష్ణ (12.06 సెకన్లు) మొదటి స్థానం సాధించాడు. ఈ ఈవెంట్లో అండర్-10, 12, 14, 16 విభాగాల్లో ఇద్దరు చొప్పున (బాలబాలికలు) మొత్తం ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటించాడు. అండర్-10 విజేతగా నిలిచిన పృథ్వీరాజ్‌కు రూ. 50 వేల నగదు బహుమతి లభించింది. అండర్-10 మినహా మిగతా ఆరుగురికి ఆస్ట్రేలియాలో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం దక్కింది. ప్రఖ్యాత అంతర్జాతీయ కోచ్ షరాన్ హెనాన్ వీరికి శిక్షణ ఇస్తారు. కూహ్ స్పోర్ట్స్ ప్రచారకర్తగా ఉన్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష విజేతలుగా నిలిచిన చిన్నారులను అభినందించారు. -
డబ్బు వసూలు చేస్తాం
న్యూఢిల్లీ: వయసు మీరిన అథ్లెట్లను ఆసియా యూత్ గేమ్స్‌కు పంపిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆగ్రహంగా ఉంది. వారు చైనాకు వెళ్లడానికి తాము ఇచ్చిన ఖర్చులను ఏఎఫ్ఐ నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. చైనాలోని నాన్జింగ్లో జరుగుతున్న ఈ గేమ్స్‌కు 17 ఏళ్ల వయస్సు కలిగిన అథ్లెట్స్ అర్హులు. అయితే ఏఎఫ్ఐ 1996లో జన్మించిన 18 మంది ఆటగాళ్లను ఈ పోటీలకు పంపింది. ఏడాది వయస్సు ఎక్కువైందనే కారణంతో వీరిని నిర్వాహకులు వెనక్కి పంపారు. ‘నిజంగా ఇది దేశానికి అవమానకరం. ఈ వ్యవహారంపై ఏఎఫ్‌ఐను వివరణ కోరతాం. అలాగే అథ్లెట్ల విమాన ప్రయాణం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన దాదాపు రూ.10 లక్షలను సమాఖ్య నుంచే వసూలు చేస్తాం’ అని సాయ్ డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఐఏఏఎఫ్ నిబంధనల ప్రకారం 1996లో జన్మించిన అథ్లెట్లను పంపామని... అయితే ఈ గేమ్స్ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయనే విషయం మర్చిపోయినట్టు ఏఎఫ్ఐ తెలిపింది. -
డబ్బు వసూలు చేస్తాం
న్యూఢిల్లీ: వయసు మీరిన అథ్లెట్లను ఆసియా యూత్ గేమ్స్‌కు పంపిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆగ్రహంగా ఉంది. వారు చైనాకు వెళ్లడానికి తాము ఇచ్చిన ఖర్చులను ఏఎఫ్ఐ నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. చైనాలోని నాన్జింగ్లో జరుగుతున్న ఈ గేమ్స్‌కు 17 ఏళ్ల వయస్సు కలిగిన అథ్లెట్స్ అర్హులు. అయితే ఏఎఫ్ఐ 1996లో జన్మించిన 18 మంది ఆటగాళ్లను ఈ పోటీలకు పంపింది. ఏడాది వయస్సు ఎక్కువైందనే కారణంతో వీరిని నిర్వాహకులు వెనక్కి పంపారు. ‘నిజంగా ఇది దేశానికి అవమానకరం. ఈ వ్యవహారంపై ఏఎఫ్‌ఐను వివరణ కోరతాం. అలాగే అథ్లెట్ల విమాన ప్రయాణం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన దాదాపు రూ.10 లక్షలను సమాఖ్య నుంచే వసూలు చేస్తాం’ అని సాయ్ డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఐఏఏఎఫ్ నిబంధనల ప్రకారం 1996లో జన్మించిన అథ్లెట్లను పంపామని... అయితే ఈ గేమ్స్ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయనే విషయం మర్చిపోయినట్టు ఏఎఫ్ఐ తెలిపింది.