ఉంగరం వేలు మన గుండె నరాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే మన పెద్దలు ఉంగరం వేలుకి ఉంగరం పెట్టేవారని మనం కథకథలుగా విన్నాం. అలాగే ఆయుర్వేదంలో కూడా వేళ్ల నరాలకు మన శరీరంలోని అవయవాలకు సంబంధం ఉందని చెబుతోంది. అయితే చైనా కంపెనీ ఆ ఉంగరంతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉండేలా..సరికొత్త స్మార్ట్ ఉంగరాన్ని తీసుకొచ్చింది.
శరీరం పనితీరును, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్ రింగ్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వాటి కోవలోనిదే ఈ స్మార్ట్ రింగ్. చైనీస్ కంపెనీ ‘అమాజ్‌ఫిట్’ ఇటీవల ఈ స్మార్ట్‌రింగ్‌ను ‘హీలియో రింగ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.
ఇందులోని సెన్సర్లు ఎప్పటికప్పుడు శరీరం పనితీరును గమనిస్తూ స్మార్ట్‌వాచీ లేదా స్మార్ట్‌ఫోన్‌కు యాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, ఒత్తిడి, నిద్ర తీరు సహా పలు అంశాలపై ఈ ఉంగరం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసేవారికి ‘అమాజ్‌ఫిట్’ మూడు నెలల వరకు ‘జెప్ ఆరా’ హెల్త్ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తుండటం విశేషం. ఈ స్మార్ట్‌రింగ్ ధర 71 డాలర్లు (రూ.5,914) మాత్రమే!
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?)
Comments
Please login to add a commentAdd a comment