టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అత్యంత అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలిమో ఫిలిప్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో విరాట్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితా టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ మాత్రమే. అలిమో ఫిలిప్ విరాట్‌ను ఫేస్ ఆఫ్ ద క్రికెట్‌గా అభివర్ణించాడు.
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ తర్వాతి స్థానంలో మరో ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు.
𝐆𝐑𝐄𝐀𝐓𝐄𝐒𝐓 𝐀𝐓𝐇𝐋𝐄𝐓𝐄𝐒 𝐎𝐅 𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄
— FIFA World Cup Stats (@alimo_philip) February 3, 2024
🥇 Lionel Messi
🥈 Cristiano Ronaldo
🥉 Muhammad Ali
4️⃣ Michael Jordan
5️⃣ Virat Kohli
6️⃣ Usain Bolt
7️⃣ Mike Tyson
8️⃣ Lebron James
9️⃣ Serena Williams
🔟 Michael Phelps
🐐 𝐓𝐡𝐞 𝐆𝐎𝐀𝐓𝐒#Messi𓃵|#GOAT𓃵|#NBA pic.twitter.com/Sxv0dBksKW
బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ ఆలీ మూడో స్థానంలో, బాస్కెట్‌బాల్ కింగ్ మైఖేల్ జోర్డన్ నాలుగో ప్లేస్‌లో, ట్రాక్ చీతా ఉసేన్ బోల్ట్ ఆరులో, మరో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఏడో స్థానంలో, బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ ఎనిమిదిలో, టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ తొమ్మిదిలో, బంగారు చేప, స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ పదో స్థానంలో నిలిచారు. ఆల్‌టైమ్ గ్రేట్ టాప్ 10 అథ్లెట్ల జాబితాలో సెరెనా విలియమ్స్ ఒక్కరే మహిళ కావడం విశేషం.
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్న కారణంగా విరాట్ జట్టుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్లో విరాట్ తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం వైజాగ్‌లో రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Comments
Please login to add a commentAdd a comment