ఇటీవల చాలామంది చీర కట్టులో స్విమ్మింగ్, స్కేటింట్ వంటివి చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. మన భారతీయ వస్త్రధారణ మనకు నచ్చిన అభిరుచికి అనుకూలంగా మలుచుకోవచ్చని చేసి చూపిస్తున్నారు. అందుకోసమని పాశ్చాత్య బట్టలను ధరించాల్సిన పనిలేదని చాటి చెబుతున్నారు. మన భారత సంప్రదాయ వస్త్రాధారణకు ఉన్న ప్రాముఖ్యతను తెలయజెప్పుతున్నారు కూడా. అలానే ఈ మలయాళ కుట్టి చీరకట్టులో కేలరీల బర్న్ చేసే క్రీడలాంటి హులా హూప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సోషల్‌మీడియ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఎష్నా కుట్టి మూసపద్ధతలను సవాలు చేస్తూ సాంప్రదాయ భారతీయ చీరకట్టులో చాకచక్యంగా హులా హూపింగ్ చేసి చూపించింది. ఎష్నా చీర ధరించి కూడా చాలా సునాయాసంగా, వేగవంతంగా హులా హూపింగ్ చేసింది. అధునిక అథ్లెటిజంని భారత సాంప్రదాయ చీరతో మిళితం చేసింది. పైగా భారతీయ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పింది.
ఇక ఎష్నా ఇలా చీరకట్టులో హులా హూప్స్ చేయడానికి ప్రధాన కారణం శారీరక ఫిట్‌నెస్ కోసం చేసే ఈ క్రీడను మన సాంస్కృతికి వారసత్వానికి చిహ్నమైన చీరలో కూడా చెయ్యొచ్చు అని చెప్పేందుకేనని అంటోంది. ఆమె ఢిల్లీలో పెరిగినప్పటికీ..పుట్టుకతో ఆమె మళయాళీ. కానీ ఆమెకు మళయాళం రాదు. ఆమె తల్లి చిత్ర నారాయణ పాత్రికేయురాలు, తండ్రి విజయన్ కుట్టి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. తాను ఈ హులాహూపింగ్‌ని పదేళ్ల ప్రాయం నుంచే నేర్చుకున్నట్లు తెలిపింది. ఇది తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెప్పుకొచ్చింది. తన స్నేహితులు, తల్లిదండ్రలు మద్దతుతో హులా హూపింగ్స్ ట్రైనర్‌గా మారింది.
అంతేగాదు పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ 2024లో కూడా అథ్లెట్లకు మద్దతిస్తు పాల్గొనడం విశేషం. ఇక హులా హూప్స్ అనేది ఒక క్రీడా ఈవెంట్‌గా గుర్తించబడింది, దీనికి నిర్దిష్ట రూపం అవసరం. ముఖ్యంగా ఫిట్‌నెస్‌కి సంబంధించి కేలరీలను బర్న్ చేసే గొప్ప సాధనంగా చెప్పొచ్చు. కాగా, ఎష్నా జర్నీ భారతీయ యువతులకు స్ఫూర్తిదాయకం. మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే..అథ్లెటిక్స్ ఆసక్తిన కొనసాగించాలనుకునేవారికి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. రాబోయే తరాలు ఎష్నాని ఆదర్శంగా తీసుకుని తాము రాణిస్తున్న రంగంలో భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు పెద్దపీట వేసేలా మార్గం సుగమం చేసింది.
(చదవండి: కఠినమైన డైట్, జిమ్ చెయ్యలేదు..కేవలం పరాఠాలతో బరువు తగ్గడమా..?)
Comments
Please login to add a commentAdd a comment